గోల్డ్‌ రోలెక్స్‌ వాచ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన విశ్వక్‌.. రవి బస్రూర్‌ ఎమోషనల్‌

Published on Sat, 02/21/2026 - 18:12

హీరో విశ్వక్‌సేన్‌కు ఈ మధ్య ఏదీ కలిసిరావట్లేదు. గతేడాది ఫిబ్రవరిలో వచ్చిన లైలా, ఈయేడు ఫిబ్రవరిలో వచ్చిన ఫంకీ.. రెండు చిత్రాలు తీవ్ర నిరాశపర్చాయి. దీంతో ఈసారి తన డైరెక్షన్‌లోనే ఓ సినిమా చేశాడు. అదే కల్ట్‌. శనివారం నాడు ఈ సినిమా టీజర్‌ రిలీజ్‌ చేశారు.

కల్ట్‌ టీజర్‌ రిలీజ్‌
టీజర్‌ ఫుల్‌ వయొలెంట్‌గా ఉంది. కల్ట్‌ అనే చోటుకు వెళ్లిన వారందరికీ లోపల ఉన్న ఒక బొమ్మ గేమ్స్‌ పెడుతోంది. అందులో ఓడిపోయినవారు గేమ్‌లోనే కాదు ఏకంగా ఈ భూమిపై నుంచే ఎలిమినేట్‌ అవుతారు. స్క్విడ్‌ గేమ్‌ సిరీస్‌ను గుర్తు చేస్తున్న ఈ మూవీకి తరుణ్‌ భాస్కర్‌ డైలాగ్స్‌ రాయగా, ప్రముఖ మ్యూజిక్‌ డైరెక్టర్‌ రవి బస్రూర్‌ సంగీతం అందించాడు. అతడి మ్యూజిక్‌కు ఫిదా అయిన విశ్వక్‌సేన్‌ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌లో ఊహించని బహుమతి ఇచ్చాడు. 

ఖరీదైన కానుక
విశ్వక్‌ మాట్లాడుతూ.. ఈ సినిమాకు ఒక కన్ను తరుణ్‌ భాస్కర్‌ అయితే మరో కన్ను రవి బస్రూర్‌ సర్‌. ఇంత మంచి మ్యూజిక్‌ నా మూవీకి దొరుకుతుందని ఎన్నడూ అనుకోలేదు. అలాంటిది నాకు మంచి మ్యూజిక్‌ అందించారు. అందుకు కృతజ్ఞతగా రోలెక్స్‌ గోల్డ్‌ వాచ్‌ బహుమతిగా ఇస్తున్నాను. ఇది నా ఫేవరెట్‌ గిఫ్ట్‌. ఎందుకంటే ఇది నేను రెండేళ్లు వెయిట్‌ చేసి మరీ తెప్పించుకున్న వాచ్‌. మళ్లీ నేనెప్పుడైనా సినిమా చేయమని అడిగితే ఈ వాచ్‌ చూసైనా ఓకే చేయాలి అన్నాడు. ఆ వెంటనే వాచ్‌ను రవి బస్రూర్‌ చేతికి తొడిగి తన సంతోషాన్ని చాటుకున్నాడు.

రవి బస్రూర్‌ ఎమోషనల్‌
అనంతరం రవి బస్రూర్‌ మాట్లాడుతూ.. నేను 25 ఏళ్లుగా పని చేస్తున్నాను. ఎల్లప్పుడూ మంచి సంగీతం అందించాలనే కృషి చేస్తూ వచ్చాను. ఇన్నేళ్లకాలంలో ఒకడు నాలోని అసలైన మ్యూజిక్‌ డైరెక్టర్‌ను గుర్తించాడు. ఇది కేవలం వాచ్‌ కాదు, సంగీత దర్శకులకు దక్కిన గౌరవం అని సంతోషం వ్యక్తం చేశాడు. ఇంకా మాట్లాడుతూ.. 18 ఏళ్ల వయసులో రెండుసార్లు ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నించాను. 

చివరి శ్వాస వరకు..
ఈ జీవితమే నాకు వద్దని చనిపోదామనుకున్నాను. రెండుసార్లు ఎలాగోలా బతికేశాను. రెండోసారి నన్ను కాపాడిన వ్యక్తి నా గురించి తెలిసి కీబోర్డు కొనుక్కోమని రూ.35 వేలు ఇచ్చాడు. అతడి పేరు రవి. అప్పటినుంచి నా పేరు రవి బస్రూర్‌గా మారింది. చివరి శ్వాస వరకు ఈ పేరు ఇలాగే ఉంటుంది. ఇప్పుడు విశ్వక్‌ సేన్‌ నా జర్నీని, ప్రతిభను గుర్తించాడు. అతడిని కూడా ఎన్నటికీ మర్చిపోలేను అని రవి బస్రూర్‌ ఎమోషనలయ్యాడు.

కల్ట్‌ టీజర్‌ కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)