సుహాస్‌కి కలిసొచ్చింది.. 'హే బలవంత్' కలెక్షన్ ఎన్ని కోట్లంటే?

Published on Sat, 02/21/2026 - 15:06

ఈ వీకెండ్ థియేటర్లలోకి పలు తెలుగు సినిమాలు, డబ్బింగ్ చిత్రాలు వచ్చినప్పటికీ సుహాస్ హీరోగా చేసిన 'హే బలవంత్' పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. కలెక్షన్స్ కూడా బాగానే వచ్చాయి. ఈ మేరకు నిర్మాతలు అధికారిక నంబర్స్ వదిలారు. ఎన్ని కోట్లు వచ్చాయనేది పోస్టర్ రూపంలో విడుదల చేశారు. ఇంతకీ ఈ సినిమా సంగతేంటి?

(ఇదీ చదవండి: ‘హే బల్‌వంత్‌’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

గతవారం రిలీజైన వాటిలో 'కపుల్ ఫ్రెండ్లీ' మంచి రెస్పాన్స్ అందుకోగా.. ఈ వారం 'హే బలవంత్' ఆ బాధ్యత తీసుకుంది. ఇది కాకుండా మరో రెండు మూడు విడుదలైనప్పటికీ వాటికి పాజిటివ్ టాక్ రాలేదు. ఇకపోతే సుహాస్, శివానీ నాగారం, నరేశ్, సుదర్శన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించిన 'హే బలవంత్' చిత్రానికి ముందురోజు ప్రీమియర్స్ వేశారు. నిన్న(ఫిబ్రవరి 20) థియేటర్లలోకి వచ్చింది. అలా తొలిరోజు రూ.2.14 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వచ్చినట్లు నిర్మాతలు ప్రకటించుకున్నారు. సుహాస్ గత చిత్రంతో పోలిస్తే ఇది చాలా బెటర్. వీకెండ్ పూర్తయ్యేసరికి మంచి నంబర్స్ నమోదు చేసే అవకాశముంది.

'హే బలవంత్' విషయానికొస్తే.. చిన్నప్పుడే తల్లిని కోల్పోయిన కృష్ణ(సుహాసన్), తండ్రి బలవంత్(నరేశ్), నాన్నమ్మ(అన్నపూర్ణమ్మ) సంరక్షణలో పెరుగుతాడు. చిన్నప్పటి నుంచి తండ్రిని రోల్ మోడల్‌గా తీసుకున్న కృష్ణ.. ఆయన బిజినెస్ టేకోవర్ చేయాలని అనుకుంటాడు. తండ్రి తొలుత వద్దని చెప్పినప్పటికీ.. కొన్ని అనుకోని పరిస్థితుల్లో అది కృష్ణ చేతుల్లోకి వెళ్తుంది. తండ్రి చేస్తున్న బిజినెస్ ఏంటో తెలిసిన తర్వాత కృష్ణ మైండ్ బ్లాక్ అవుతుంది. దీని వల్లే ప్రేమించిన మిత్ర (శివానీ నాగారం)కి దూరమవ్వాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇంతకీ బలవంత్ చేస్తున్న బిజినెస్ ఏంటి? దాని వల్ల కృష్ణ ప్రేమకు వచ్చిన చిక్కేంటి? అనేది మిగతా స్టోరీ.

(ఇదీ చదవండి: ధురంధర్‌.. ఆ సీన్‌ అయిపోగానే ఏడ్చేశారు: మాధవన్‌)

Videos

రేపటి నుంచి ఇంటర్ పరీక్షలు.. నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ..

బాబుకు బిగ్ షాక్.. సుప్రీంకోర్టులో లడ్డూ వివాదంపై సుబ్రహ్మణ్య స్వామి పిటిషన్

ఆఫ్ఘనిస్తాన్ పై పాక్ వైమానిక దాడి.. 17 మంది మృతి

దేవుడి సన్నిధిలో దందా.. ప్రక్షాళన అంటే ఇదేనా!

నా భర్త అలాంటోడే.. ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

AP: 8వ తరగతి బాలుడిపై ముగ్గురు తోటి విద్యార్థుల లైంగిక దాడి..

విజయ్ & రష్మిక పెళ్లిపై నటుడు ప్రమోద్ శెట్టి కీలక వ్యాఖ్యలు

మీ బెదిరింపులకు భయపడను.. నోటీసులపై పూజిత రియాక్షన్

అది ఏక సభ్య కమిషన్ కాదు.. తెలుగుదేశం పార్టీ కమిషన్

Dharmavaram: నా భర్త అలాంటోడే ఆయన ఫ్రెండ్ తో కలిసి లైంగికంగా..

Photos

+5

సోఫీ షైన్‌ను పెళ్లాడిన టీమిండియా మాజీ క్రికెటర్ శిఖర్ ధావన్ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

పళని మురుగన్‌ని దర్శించుకున్న హీరో నిఖిల్ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అంబానీ ఇంద్రభవనానికి హిల్లరీ క్లింటన్‌ (ఫోటోలు)

+5

నరేశ్‌కు ఎంతో ప్రత్యేకమైన రోజు.. ఎందుకంటే? (ఫోటోలు)

+5

సింగర్ మంగ్లీ 'ఇషా' ట్రిప్ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

రాధిక, శివకార్తికేయన్‌ కోసం వచ్చిన కమల్‌ హాసన్‌ (ఫోటోలు)

+5

హైదరాబాద్ : అభినయం..అనన్యం (ఫొటోలు)

+5

గ్రాండ్‌ పార్టీ ఇచ్చిన అల్లు అర్జున్‌.. ఫుల్‌ జోష్‌లో హీరోయిన్స్‌ (ఫోటోలు)

+5

వైభవంగా శ్రీయాదగిరి లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలు (ఫొటోలు)