ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్
Breaking News
ది కేరళ స్టోరీ-2 మేకర్స్‌కు షాక్..!
Published on Thu, 02/19/2026 - 18:40
ది కేరళ స్టోరీ నిర్మాతలకు షాక్ తగిలింది. ఈ సినిమా రిలీజ్ నిలిపేయాలంటూ కేరళ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం కేంద్ర సమాచారశాఖతో పాటు సెన్సార్ బోర్డ్, నిర్మాతలకు నోటీసులు జారీ చేసింది. ఈ సినిమా ట్రైలర్ తనను ఆశ్చర్యానికి గురిచేసిందని.. కేరళ ప్రతిష్టను దెబ్బతీసేలా ఉందంటూ శ్రీదేవ్ అనే బయాలజిస్ట్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
సుదీప్తో సేన్ డైరెక్షన్‌లో వచ్చి ది కేరళ స్టోరీ బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఆదా శర్మ కీలక పాత్రలో తెరకెక్కంచిన ఈ మూవీ సూపర్ హిట్‌గా నిలిచింది. ఎన్ని విమర్శలొచ్చినా కలెక్షన్ల వర్షం కురిపించింది. తాజాగా ఈ మూవీకి సీక్వెల్‌గా ది కేరళ స్టోరీ-2 ప్రేక్షకుల ముందుకు వచ్చేస్తోంది. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ చేయగా.. ముగ్గురు హిందూ అమ్మాయిల కథగా ఈ సినిమాను రూపొందించినట్లు తెలుస్తోంది.
కాగా.. ఈ చిత్రం ఫిబ్రవరి 27న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈ సినిమాకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ యూ/ఏ సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ చిత్రానికి కామాఖ్య నారాయణ్ సింగ్ దర్శకత్వం వహంచారు.
Tags : 1