Breaking News

కోట్లాది ఉద్యోగాలు.. అమెరికా పారిశ్రామికవేత్త ఆందోళన

Published on Thu, 02/19/2026 - 11:56

అమెరికాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే 12 నుండి 18 నెలల్లో మిలియన్ల సంఖ్యలో వైట్-కాలర్ ఉద్యోగాలు ప్రమాదంలో పడవచ్చని అమెరికన్ పారిశ్రామికవేత్త, మాజీ డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి ఆండ్రూ యాంగ్‌ (Andrew Yang) హెచ్చరించారు.

ఏఐ సామర్థ్యం రోజురోజుకు పెరుగుతోందని పేర్కొన్న ఆయన, తన కుటుంబ సభ్యుల్లో ఒకరు ఉపయోగించిన ఏఐ ప్రోగ్రామ్ కొన్ని నిమిషాల్లోనే ఒక వెబ్‌సైట్ రూపకల్పన పూర్తి చేసిందని ఉదాహరణగా చెప్పారు. సాధారణంగా డిజైనర్‌కు లేదా నిపుణుడికి రోజులు పట్టే పనిని ఏఐ కేవలం నిమిషాల్లో ముగించగలగడం ఉద్యోగాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం మిడ్-కెరీర్ కార్యాలయ ఉద్యోగులు, కాల్ సెంటర్ సిబ్బంది, సేల్స్‌ సిబ్బంది, కోడర్లు వంటి వారు నిర్వహిస్తున్న పనుల్లో చాలా భాగాన్ని ఏఐ ఆటోమేట్ చేసే అవకాశం ఉందని యాంగ్ అభిప్రాయపడ్డారు. డేటా ప్రాసెస్ చేయడం, నివేదికలు తయారు చేయడం మాత్రమే కాకుండా నిర్ణయ ప్రక్రియ కూడా ఆటోమేషన్ వైపు మళ్లవచ్చని ఆయన తెలిపారు.

ఈ పరిణామం వైట్-కాలర్ ఉద్యోగాల్లో “గొప్ప విచ్ఛిన్నత”కు దారితీయవచ్చని హెచ్చరించిన ఆయన, ఒక కంపెనీ ఉద్యోగుల సంఖ్యను తగ్గించడం ప్రారంభిస్తే, పోటీ కారణంగా ఇతర సంస్థలు కూడా అదే మార్గాన్ని అనుసరించే అవకాశముందని అన్నారు. హెడ్‌కౌంట్ తగ్గిస్తే స్టాక్ మార్కెట్ ప్రతిఫలం ఇస్తుందనే భావన ఈ ధోరణిని మరింత వేగవంతం చేస్తుందని పేర్కొన్నారు.

అమెరికాలో సుమారు 70 మిలియన్ల వైట్-కాలర్ కార్మికుల్లో 20 నుండి 50 శాతం మంది రాబోయే రోజుల్లో ఉద్యోగాలను కోల్పోయే ప్రమాదం ఉందని ఆయన అంచనా వేశారు. డేటా విశ్లేషణ, రిపోర్ట్ తయారీ, కోడింగ్, కస్టమర్ సర్వీస్ వంటి రంగాల్లో ఏఐ సాధనాలు వేగంగా విస్తరిస్తుండటం ఈ పరిస్థితికి కారణమవుతుందని వివరించారు.

ఉద్యోగ నష్టాల ప్రభావం వినియోగదారుల ఖర్చులు, గృహ మార్కెట్, పన్ను ఆదాయాలపై పడే అవకాశం ఉందని, దీని వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థలు దెబ్బతినవచ్చని యాంగ్ హెచ్చరించారు. ఈ ప్రభావాన్ని తగ్గించేందుకు సార్వత్రిక ప్రాథమిక ఆదాయం (UBI), పునఃశిక్షణ కార్యక్రమాలు, అలాగే ఏఐ కంపెనీలపై పన్నులు విధించడం వంటి విధానాలను పరిశీలించాలని ఆయన సూచించారు.

Videos

ఏపీలో రోడ్లు అధ్వానం టీడీపీ ఎమ్మెల్యే బాబుకు షాక్

దేవుడితో పెట్టుకున్నాడు చుక్కలు చూస్తున్నాడు

వైరల్ గా మారిన ఆలియా భట్ డ్రెస్..

Tirumala : రెండు కాదు ఏడు కొండలే.. అసలు నిజాలు బయటపెట్టిన జగన్

జగనన్న కాలనీల కోసం.. అక్కచెల్లెమ్మలకు ఏకంగా 35,210 కోట్లు ఇచ్చాం

పొదుపు సంఘాల అక్కచెల్లెమ్మలకు ఉరి.. ప్రభుత్వ ఉద్యోగుల పరిస్థితి ఇక దేవుడికే తెలియాలి

ఏమయ్యా అచ్చెన్న.. 6,309 కోట్లు ఇచ్చావా ..? సిగ్గుందా కొంచెమైనా..!

వారణాసిలో కిచ్చా సుదీప్ రోల్ ఏంటంటే..?

ఇందాపూర్ డెయిరీ రూపంలో బయటపడ్డ బాబు కల్తీ కుట్ర

మహేష్ బాబు NEXT మూవీ ఫిక్స్.. అంత్యంత క్రేజీ కాంబినేషన్లో రాబోతున్న సినిమా!

Photos

+5

తిరుమల శ్రీవారి సేవలో హీరోయిన్ త్రిష (ఫోటోలు)

+5

పట్టుచీరలో అందంగా సోనియా ఆకుల (ఫోటోలు)

+5

శివబాలాజీ-మధుమిత కుమారుడికి మోహన్‌బాబు ఆశీస్సులు (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో ప్రముఖులు (ఫొటోలు)

+5

హీరోయిన్ నయన్ సారిక బ్యూటిఫుల్ (ఫొటోలు)

+5

స్టన్నింగ్‌ ఔట్‌ఫిట్‌తో సమంత.. వైరల్‌ ఫోటోలు

+5

విశాఖ సాగరతీరంలో సాహస గర్జన (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో రంజాన్‌ శోభ (ఫొటోలు)

+5

శ్రీకాళహస్తిలో అంగరంగ వైభవంగా శివపార్వతుల కల్యాణం (ఫొటోలు)

+5

‘విష్ణు విన్యాసం’ మూవీ టీజర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)