మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
అమ్మకు రెండో పెళ్లి.. అవన్నీ అబద్ధాలే: సుప్రీత
Published on Mon, 02/16/2026 - 18:35
టాలీవుడ్ నటి సురేఖవాణి కూతురు సుప్రీత ఇటీవలే బిగ్ స్క్రీన్‌పై సందడి చేసింది. అమరావతికి ఆహ్వానం పేరుతో వచ్చిన థ్రిల్లర్ మూవీతో ప్రేక్షకులను పలకరించింది. ఈ నెల 13న థియేటర్లలోకి వచ్చిన టాలీవుడ్ అభిమానులను అలరిస్తోంది. అయితే ఈ మూవీ రిలీజ్‌కు ముందు జరిగిన ఈవెంట్‌లో సుప్రీత ఫుల్ ఎమోషనలైంది. తన జర్నీని తలచుకుని వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.
అంతేకాకుండా ఇటీవల సురేఖవాణి రెండో పెళ్లి గురించి వార్తలొస్తూనే ఉన్నాయి. దీనిపై తాజా ఇంటర్వ్యూలో మరోసారి క్లారిటీ ఇచ్చింది సుప్రీత. అమ్మకు రెండో పెళ్లి చేయాలనే ఆలోచన కేవలం నాది మాత్రమేనని.. అమ్మకు ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. గతంలో మీ అమ్మ మళ్లీ పెళ్లి చేసుకుంటుందని మీరెప్పుడైనా ఆలోచించారా? అని నన్ను కొందరు అడిగారని పేర్కొంది.
ఈ ప్రశ్నకు తాను అవును సమాధానమిచ్చానని సుప్రీత తెలిపింది. కానీ చాలామంది నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారని వెల్లడించింది. నా మాటలు విని అమ్మ రెండో పెళ్లి చేసుకోబోతోందన్న వార్తలు రాసుకొచ్చారని పేర్కొంది. అదంతా పూర్తిగా అబద్ధమని.. అమ్మకు పెళ్లి చేసుకోవాలన్న ఆలోచనే లేదన్నారు. ఆమెకు మ్యారేజ్ చేయాలన్న ఆలోచన నాది మాత్రమేనని ఫుల్ క్లారిటీ ఇచ్చేసింది
Tags : 1