మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు
Breaking News
బ్రేకింగ్: విజయ్ రష్మిక పెళ్లి శుభలేఖ ఇదే.. ఫొటో వైరల్
Published on Mon, 02/16/2026 - 14:22
టాలీవుడ్ హీరోహీరోయిన్ విజయ్ దేవరకొండ-రష్మిక.. ఈ నెల 26న పెళ్లి చేసుకోనున్నారు. ఈ విషయం అందరికీ తెలిసినప్పటికీ అధికారికంగా ఇప్పటివరకు ప్రకటించలేదు. తాజాగా హైదరాబాద్ విమానాశ్రయంలోనూ కనిపించారు. వీళ్లిద్దరూ వెళ్తున్నది పెళ్లి జరిగే రాజస్థాన్‌లోని ఉదయ్‌పుర్‌కే అనేది తెలిసిందే. తాజాగా వీళ్ల పెళ్లి శుభలేఖ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 13 సినిమాలు.. ఆ నాలుగు కాస్త స్పెషల్)
26వ తేదీన ఉదయ్పుర్లో పెళ్లి జరగనుందని అందులో రాసుకొచ్చారు. కాకపోతే కుటుంబ సభ్యులు, సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరు కానున్నారు. మార్చి 4వ తేదీన హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్లో రిసెప్షన్ జరగనుంది. ఆ విషయాన్ని పెళ్లి పత్రికలో ముద్రించారు. ఈ మేరకు సినిమా సెలబ్రిటీలకు ఇదివరకే ఆహ్వానాలు అందాయి. ఇప్పుడు ఆ ఫొటోలే వైరల్ అవుతున్నాయి.
విజయ్-రష్మిక తొలిసారి జంటగా 'గీతగోవిందం' సినిమా చేశారు. అది సూపర్ హిట్. తర్వాత 'డియర్ కామ్రేడ్' మూవీ చేశారు. ఇది బాక్సాఫీస్ దగ్గర ఫెయిలైంది. తర్వాత చాన్నాళ్ల పాటు కలిసి పనిచేయలేదు. ప్రస్తుతం విజయ్ 'రణబాలి' అనే చిత్రం చేస్తున్నాడు. ఇందులో రష్మికనే హీరోయిన్. ఇది దసరాకు రిలీజ్ కానుందని కొన్నిరోజుల క్రితమే ప్రకటించారు. అంటే పెళ్లి తర్వాత విజయ్-రష్మిక నుంచి రాబోయే మూవీ ఇదే.
(ఇదీ చదవండి: బీజేపీ నేత దారుణ కామెంట్స్‌పై స్పందించిన త్రిష)

Tags : 1