Breaking News

భార్యతో విడాకులు, జైలు జీవితం.. డిప్రెషన్‌లోకి..: సామ్రాట్‌

Published on Mon, 02/16/2026 - 13:49

వినాయకుడు, పంచాక్షరి, దేనికైనా రెడీ, ప్రేమకావాలి, దూసుకెళ్తా వంటి పలు సినిమాలతో నటుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు సామ్రాట్‌ రెడ్డి. తర్వాత సడన్‌గా వెండితెరపై కనిపించడం మానేశాడు. తెలుగు బిగ్‌బాస్‌ రెండో సీజన్‌లో పాల్గొని బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. హర్షితను పెళ్లి చేసుకున్నాక వైవాహిక జీవితంలో ఇబ్బందులతో వార్తల్లో నిలిచిన సామ్రాట్‌ తన జీవితంలోని అనేక విషయాలను తాజా ఇంటర్వ్యూలో పంచుకున్నాడు.

అందుకే బ్రేక్‌
నటుడు సామ్రాట్‌ రెడ్డి మాట్లాడుతూ.. ఒకానొక సమయలో హీరోయిన్‌తో పెళ్లిపీటలపై కూర్చోవడం.. తీరా పెళ్లి క్యాన్సిల్‌ అవడం.. ఇలాంటి పాత్రలే తరచూ వచ్చాయి. దీంతో నాకు బోర్‌ కొట్టేసి బ్రేక్‌ తీసుకున్నాను. హర్షితను పెళ్లి చేసుకున్న కొంతకాలానికే నాపై గృహహింస, వరకట్న వేధింపుల కేసు పెట్టింది. ఇవన్నీ ఉట్టి ఆరోపణలు మాత్రమే!

కావాలనే నా ప్రతిష్ట దిగజార్చింది
పెళ్లి వర్కవుట్‌ కాలేదంటే దాన్ని చాలారకాలుగా డీల్‌ చేయొచ్చు. పరస్పర అంగీకారంతో లేదా తనవైపు నుంచి విడాకులు పంపించి విడిపోవచ్చు. కానీ ఆమె తప్పు దారి ఎంచుకుంది. నేను నటుడినన్న కారణంతో నా పరువు తీయాలనుకుంది. ఎన్నో తప్పుడు ఆరోపణలు చేసింది. అప్పుడు నేను చాలా బాధపడ్డాను. అదే సమయంలో నాన్నకు బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో మరింత కుంగిపోయాను. 

బిగ్‌బాస్‌ ఆఫర్‌
ఒక్కసారిగా మా కుటుంబం చిన్నాభిన్నమైంది. మా ఇంట్లో జరిగిన దొంగతనం కేసులో నేను రెండురోజులు జైలుకు వెళ్లివచ్చాను. నాపై లేనిపోని అభాండాలన్నీ వేశారు. అది నా కెరీర్‌ను కూడా దెబ్బతీసింది. డిప్రెషన్‌లోకి వెళ్లిపోయాను. అప్పుడు బిగ్‌బాస్‌ ఆఫర్‌ వచ్చింది. వెళ్లకూడదనుకున్నాను. కానీ నాపై పడ్డ నిందలు తొలగించుకోడానికి బిగ్‌బాస్‌కు వెళ్లాను. చాలా బాధలు అనుభవించి రాటు తేలిపోయాను. 

మరో పెళ్లి చేసుకోను
మొదటి పెళ్లి వల్ల చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాను. జీవితంలో మరో పెళ్లి చేసుకోనని ఇంట్లో చెప్పాను. కానీ, బిగ్‌బాస్‌ తర్వాత అంజనా శ్రీలిఖితను కలిశాను. చూడగానే నచ్చేసింది. పెళ్లి చేసుకుందామని అడిగాను. కానీ, ఆమె ఇంట్లోవాళ్లు ఒప్పుకోలేదు. వాళ్లను ఒప్పించేందుకు తను చాలాదూరం వెళ్లింది. అలా 2020లో పెళ్లి జరగ్గా 2022లో పాప పుట్టింది. మొదటిది పెద్దలు కుదర్చిన పెళ్లయితే రెండోది ప్రేమ వివాహం. లిఖిత నా జీవితంలోకి వచ్చాక సంతోషంగా ఉన్నాను అని సామ్రాట్‌ రెడ్డి చెప్పుకొచ్చాడు.

చదవండి: 4 రోజుల్లో రిలీజ్‌.. హే భగవాన్‌ టైటిల్‌ ఛేంజ్‌

Videos

మీ ముగ్గురి నోరు యాసిడ్ తో కడిగినా ఆ కంపు పోదు... బడ్జెట్ పై జడ శ్రవణ్ సెటైర్లు

నీ పని నువ్వు చూసుకో నాగబాబు తీరుపై టీడీపీ, బీజేపీ నేతల ఆగ్రహం

చంపేసి కారులో పెట్టి..? ప్రమాదం వెనుక మిస్టరీ

లైవ్ లో హెరిటేజ్ నెయ్యిని చూపిస్తూ.. చంద్రబాబు బండారం మొత్తం బట్టబయలు

ఇజ్రాయెల్‌ మహిళపై అత్యాచారం.. ముగ్గురు దోషులకు మరణశిక్ష విధించిన కోర్టు

తెలంగాణలో జనసేన అభ్యర్థికి 2 ఓట్లు.. నిన్ను వెంకటేశ్వర స్వామి కడిగేయడం ఖాయం..

ఉమ్మడి నల్గొండ జిల్లా మున్సిపల్ ఎన్నిక పూర్తి వివరాలు ఇవే..!

కష్ట కాలంలో మాకు... మీ అందరినీ మా ఫ్యామిలీ జీవితాంతం గుర్తు పెట్టుకుంటుంది

Stock Market: ఈ ఒక్క స్టాక్ లో ఇన్వెస్ట్ చేస్తే చాలు.. కోటీశ్వరులు అయిపోయినట్టే..!

Punjagutta: సైలెంట్ గా కిలో బంగారం కొట్టేశాడు

Photos

+5

ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026 (ఫోటోలు)

+5

‘హే భగవాన్’ మూవీ హీరోయిన్ శివానీ నగరం (ఫొటోలు)

+5

'పెద్ది' సెట్‌లో బుచ్చిబాబు బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

భార‌త్ vs పాకిస్తాన్‌ మ్యాచ్‌ సూపర్ హీరో ఇషాన్ కిషన్‌ స్పెషల్ (ఫొటోలు)

+5

శని దోష నివారణకు ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రం..12.5 అడుగుల ఎత్తైన శనిదేవుడి విగ్రహం (ఫొటోలు)

+5

నౌకాదళ పండగ వాతావరణంతో విశాఖ తీరం కళకళ (ఫొటోలు)

+5

నెక్లెస్‌ రోడ్డులో సందడిగా ఉమెన్‌ పింకథాన్‌ రన్‌ (ఫొటోలు)

+5

గెలుపంటే ఇదేరా.. ట్యాంక్‌బండ్ వద్ద క్రికెట్‌ అభిమానుల సంబరాలు (ఫొటోలు)

+5

కీసరగుట్టకు పోటెత్తిన భక్తజనం (ఫోటోలు )

+5

ప్రముఖ సినీతారల వాలైంటైన్స్ డే విషెస్ (ఫోటోలు )