Badvel : పేదల భూములు కొట్టేస్తున్న పచ్చ గద్దలు.. మాకు చావే గతి
Breaking News
సోదరుడు లాంటి వ్యక్తి చనిపోయాడని రజనీకాంత్ సంతాపం
Published on Sun, 02/15/2026 - 16:05
సూపర్‌స్టార్ రజనీకాంత్ చేసిన సినిమాల్లో 'బాషా'కి ప్రత్యేక స్థానముంటుంది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్ర నిర్మాత మరణించారు. వృద్ధాప్య సమస్యలతో నిర్మాత తమిళగన్ తుదిశ్వాస విడిచారు. ఈ క్రమంలోనే ఆయన మృతి పట్ల.. రజనీ సంతాపం వ్యక్తం చేశారు. బాధపడుతూ ట్వీట్ చేశారు.
(ఇదీ చదవండి: హీరో నిఖిల్ కౌంటర్ ఎవరికి? ఎందుకీ కామెంట్స్)
'సోదరుడు లాంటి అళగన్ మృతి నాకు అత్యంత బాధాకరమైన విషయం. ఆయన చాలా మంచి వ్యక్తి. ఆయన కుటుంబానికి నా సానుభూతి' అని రజనీకాంత్ ట్వీట్ చేశారు. నేటి సాయంత్రం (ఫిబ్రవరి 15) తమిళగన్ అంత్యక్రియలు జరగనున్నాయి. రజనీ హీరోగా సురేష్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన 'బాషా' చిత్రాన్ని తమిళగన్, తన తల్ల రాజమ్మాళ్‌తో కలిసి నిర్మించారు. ఇతడి తండ్రి ఆర్ఎం వీరప్పన్ సమర్పకుడిగా వ్యవహరించారు. దీనితోపాటే మూండ్రు ముగం, పణక్కారన్, రాణువ వీరన్ కూడా తమిళగన్ నిర్మించారు. మందిరపున్నగై, నిలా పెన్నే చిత్రాలకు దర్శకుడిగానూ వ్యవహరించారు.
(ఇదీ చదవండి: ఓటీటీ రివ్యూ: గుండె లోతుల్లో నిలిచిపోయే మలయాళ సినిమా)
மதிப்பிற்குரிய அமரர் ஆர்.எம். வீரப்பன் அவர்களின் புதல்வர், எனது அன்புத் தம்பி தமிழழகன் அருமையான மனிதர்.
அவரது திடீர் மறைவு எனக்கு மிகுந்த வேதனையளிக்கிறது. அவருடைய ஆத்மா சாந்தியடையட்டும். குடும்பத்தாருக்கு என் ஆழ்ந்த அனுதாபங்கள்.— Rajinikanth (@rajinikanth) February 15, 2026
Tags : 1