మండలిలో మంచి సంఖ్యా బలం ఉంది: వైఎస్ జగన్
Breaking News
నాని పాన్ ఇండియా మూవీ.. ది ప్యారడైజ్ వాయిదా..!
Published on Thu, 02/12/2026 - 18:12
టాలీవుడ్ హీరో నాని నటిస్తోన్న యాక్షన్ చిత్రం ది ప్యారడైజ్. దసరా మూవీతో హిట్ కొట్టిన కాంబో కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా రేంజ్‌లో తెరెకెక్కిస్తున్నారు. ఈ మూవీని సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. మార్చి 26న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుందని వెల్లడించారు.
కానీ మొదటి నుంచి అనుకుంటున్నట్లుగానే ది ప్యారడైజ్ మూవీ వాయిదా పడింది. ఈ విషయాన్ని డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల అఫీషియల్‌గా ప్రకటించారు. ఏకంగా ఐదు నెలలు ఆలస్యంగా థియేటర్లకు రానుంది. కొత్త రిలీజ్ తేదీని ప్రకటిస్తూ పోస్టర్‌ను పంచుకున్నారు. దీంతో నాని ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ భారీ యాక్షన్ చిత్రాన్ని ఆగస్టు 21న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తానని శ్రీకాంత్ ఓదెల ట్వీట్ చేశారు. నేను తొందరపడాలనుకోవడం లేదు.. తనకు ఇంకాస్తా సమయం కావాలని అభిమానులకు కోరారు.
I don’t want to rush.
I need some time to deliver it.#TheParadise - 21-08-2026 🔒 pic.twitter.com/2aKDg7IJP3— Srikanth Odela (@odela_srikanth) February 12, 2026
Tags : 1