Konaseema : భారీ అగ్ని ప్రమాదం సిలిండర్ పేలి 10 ఇల్లు అగ్నికి ఆహుతి
Breaking News
ఆ సంఘటన తర్వాత అందరు చీరల్లోనే: వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్
Published on Thu, 02/12/2026 - 15:46
టాలీవుడ్ నటుడు వీకే నరేశ్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. హే భగవాన్ మూవీ ట్రైలర్ లాంఛ్ ఈవెంట్‌కు హాజరైన ఆయన హగ్ డే సందర్భంగా మాట్లాడారు. స్టేజీపై ఉన్న ఇద్దరు హీరోయిన్లను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఇవాళ హగ్ డే కావడంతో మిమ్మల్ని హగ్ చేద్దామని వచ్చాను.. కానీ మీరిద్దరు చీరలు కట్టుకుని వచ్చారని అన్నారు. కొన్ని సంఘటనల ప్రతి ఒక్కరూ చీరలు కట్టుకుని వస్తున్నారన్నారు.
కాగా.. గతంలో దండోరా మూవీ ఈవెంట్‌లో శివాజీ చేసిన కామెంట్స్ వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. మహిళల డ్రెస్సులను ఉద్దేశించి శివాజీ మాట్లాడిన భాషపై తీవ్రస్థాయిలో అభ్యంతరాలొచ్చాయి. అనసూయ, చిన్మయి లాంటి ఈ వివాదంపై నోరు విప్పారు. డ్రెస్ అనేది మహిళల ఛాయిస్ అని తమ వాయిస్ వినిపించారు. ఆ తర్వాత తన కామెంట్స్‌పై తీవ్ర వ్యతిరేకత రావడంతో శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. కానీ తన వాడిన ఆ రెండు పదాలకు మాత్రమేనని క్షమాపణలు అంటూ క్లారిటీ ఇచ్చారు. ఈ సంఘటనను ఉద్దేశించి తాజాగా వీకే నరేశ్ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
కాగా.. సుహాస్ హీరోగా వస్తోన్న కొత్త సినిమా హే భగవాన్. ఈ చిత్రంలో శివాని నాగారం హీరోయిన్‌గా కనిపించనుంది. గోపి డైరెక్షన్‌లో వస్తోన్న ఈ సినిమా ఫిబ్రవరి 20న విడుదల కానుంది. ఈ మూవీలో వీకే నరేశ్, సుదర్శన్ కీలక పాత్రలు పోషించారు.
Tags : 1