చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
యానిమల్ సినిమా.. ఒప్పుకోవాలంటే భయమేసింది: హీరో
Published on Thu, 02/05/2026 - 20:34
సందీప్‌రెడ్డి వంగా సత్తా ఉన్న దర్శకుడు. అర్జున్‌రెడ్డి సినిమాతోనే తన టాలెంట్ చూపించాడు. అదే సినిమాను హిందీలో కబీర్‌సింగ్‌గా తెరకెక్కించి అక్కడ కూడా సూపర్ హిట్ అందుకున్నాడు. కొంత గ్యాప్ తర్వాత అతడు తెరకెక్కించిన మూవీ యానిమల్. రణ్‌బీర్ కపూర్ హీరోగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ సినిమా 2023 డిసెంబర్‌లో విడుదలై అద్భుతమైన విజయం సొంతం చేసుకుంది. తాజాగా ఈ మూవీ జపాన్‌లో ఫిబ్రవరి 13న విడుదల కానుంది.
భయపడ్డా..
ఈక్రమంలో సినిమా ప్రమోషన్స్‌లో రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రణ్‌బీర్ మాట్లాడుతూ.. గతంలో నేను ఎక్కువగా లవర్ బాయ్ ఇమేజ్ పాత్రలే చేశాను. యానిమల్ కథ చెప్పగానే నా పాత్ర గురించి విని భయపడ్డాను. కానీ సందీప్‌రెడ్డి నాపై పెట్టుకున్న నమ్మకంతో ధైర్యాన్ని కూడదీసుకున్నాను. సినిమాలో నేను పోషించిన రణ్‌విజయ్ పాత్ర భయంకరంగా ఉంటుంది.
అది బాగా నచ్చింది
కాకపోతే అతడిలో చాలా భావోద్వేగాలుంటాయి. కుటుంబాన్ని కాపాడుకోవడం కోసం ఎంతదూరమైనా వెళ్తాడు. ఈ పాయింట్ ప్రపంచంలో ఎవరికైనా కనెక్ట్ అవుతుంది. తండ్రీకొడుకుల మధ్య అనుబంధం పైకి కనిపించదు. నా జనరేషన్‌లోని అందరి ఇంట్లో ఇదే పరిస్థితి ఉంటుంది. తల్లితో ఉన్నంత క్లోజ్‌గా తండ్రితో ఉండం. దూరాన్ని మెయింటైన్ చేస్తాం. అదే ఈ సినిమాలో నాకు బాగా కనెక్ట్ అయింది అని చెప్పుకొచ్చాడు.
ఎప్పుడో ఫిక్సయ్యా..
సందీప్ రెడ్డి వంగా మాట్లాడుతూ.. రణ్‌బీర్‌కు అంతకుముందు చేసిన సినిమాలతో పోలిస్తే ఇది కొత్త. అందువల్ల కథ చెప్పగానే తాను చేయగలనా? లేదా? అని భయపడిపోయాడు. కథ చెప్పిన తర్వాత స్క్రిప్ట్ అతడి చేతికిచ్చాను. కొంత టైం తీసుకున్నాకే ఓకే చెప్పాడు. అయితే ఈ కథ రాసుకుంటున్నప్పుడే నేను రణ్‌బీర్‌ను ఫిక్సయిపోయాను అని తెలిపాడు. ఇకపోతే యానిమల్‌కు సీక్వెల్‌గా యానిమల్ పార్కింగ్ 2028లో రానుంది.
Tags : 1