చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు
Breaking News
ఓటీటీకి 'ది రాజాసాబ్'.. ఒక్క రోజే ఏకంగా 15 చిత్రాలు స్ట్రీమింగ్
Published on Thu, 02/05/2026 - 18:39
చూస్తుండగానే మరో వీకెండ్ వచ్చేస్తోంది. ఈ శుక్రవారం శ్రీ చిదంబరం గారు, సుమతీ శతకం, యూఫోరియా, బరాబర్ ప్రేమిస్తా లాంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్నాయి. వీటిలో సుమతీ శతకం, యూఫోరియా లాంటి సినిమాలపై కాస్తా బజ్ ఉంది. పెద్ద సినిమాలేవీ ఈ ఫ్రైడే బాక్సాఫీస్ బరిలో లేకపోవడంతో సినీ ప్రియులు కాస్తా నిరాశకు గురవుతున్నారు.
ఇక ఈ శుక్రవారం ఓటీటీ సినిమాల విషయానికొస్తే సంక్రాంతి మూవీ సందడి చేయనుంది. రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన ది రాజాసాబ్ ఈ ఫ్రైడ్ ఓటీటీకి వస్తోంది. జియో హాట్ స్టార్ వేదికగా స్ట్రీమింగ్ కానుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఓటీటీ ప్రియులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మారుతి డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజైంది. అయితే అనుకున్నంత స్థాయిలో ఈ మూవీ రాణించలేకపోయింది. ఈ మూవీతో పాటు పలు డబ్బింగ్ సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఈ ఫ్రైడే ఓటీటీల్లో సందడి చేయనున్నాయి. ఏ మూవీ ఎక్కడ స్ట్రీమింగ్ కానుందో మీరు ఓ లుక్కేయండి.
నెట్‌ఫ్లిక్స్
క్వీన్ ఆఫ్ చెస్ (ఇంగ్లీష్ మూవీ) - ఫిబ్రవరి 06
సాల్వడార్ (స్పానిష్ సిరీస్) - ఫిబ్రవరి 06
ట్రాన్స్‌ఫార్మర్స్ వన్(యానిమేటేడ్ మూవీ)- ఫిబ్రవరి 06
యో బెస్టీ(హాలీవుడ్ మూవీ)- ఫిబ్రవరి 06
అమెజాన్ ప్రైమ్
ఫైండింగ్ హార్మోనీ (ఇంగ్లీష్ సినిమా) - ఫిబ్రవరి 06
ఎల్ఓఎల్ (ఇంగ్లీష్ సిరీస్) - ఫిబ్రవరి 06
వయోలెంట్ ఎండ్స్(హాలీవుడ్ మూవీ)-ఫిబ్రవరి 06
జియో హాట్‌స్టార్
ది రాజాసాబ్ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06
జీ5
షాబాద్ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06
పరాశక్తి (తెలుగు డబ్బింగ్ మూవీ) - ఫిబ్రవరి 07
సన్ నెక్స్ట్
నీలకంఠ (తెలుగు సినిమా) - ఫిబ్రవరి 06
సోనీ లివ్
జాజ్ సిటీ (హిందీ సిరీస్) - ఫిబ్రవరి 06
టెంట్ కోట్టా
కోంబుసివీ(తమిళ సినిమా)- ఫిబ్రవరి 06
హెచ్‌బీవో మ్యాక్స్
బాయ్స్ గో టూ జూపిటర్(యానిమేషన్ చిత్రం)- ఫిబ్రవరి 06
ముబీ..
లా గ్రేజియా(హాలీవుడ్)- ఫిబ్రవరి 06
హులు..
స్పిట్స్‌విల్లే(హాలీవుడ్)- ఫిబ్రవరి 06
Tags : 1