Breaking News

'360 గ్రాముల బంగారం'.. పాదపూజ చేసిన నటుడు

Published on Thu, 02/05/2026 - 13:15

'మాయమైపోతున్నడమ్మా.. మనిషన్నవాడు! మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు! నూటికో కోటికో ఒక్కడే ఒక్కడు..' నిజమే కదా.. పాటలో చెప్పినట్లుగా ఈరోజుల్లో మానవత్వం అనేది మచ్చుకైనా కనిపించడం లేదు. డబ్బు కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. పేరాశతో దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. ఇలాంటి సమయంలో ఓ పారిశుద్ధ్య కార్మికురాలు చేసిన పని అందర్నీ ఆశ్చర్యపరిచింది. ఆమె నిజాయితీకి యావత్‌ దేశం చప్పట్లు కొడుతోంది.

నిజాయితీ
జనవరి 11న చెన్నైలోని టీ నగర్‌లో పద్మ అనే మహిళ రోజూలాగే రోడ్డు శుభ్రం చేస్తోంది. చెత్త ఊడుస్తుండగా ఆమెకు ఓ బ్యాగు దొరికింది. అందులో రూ.45 లక్షలు విలువ చేసే 45 సవర్ల బంగారు ఆభరణాలు ఉండటంతో నేరుగా పోలీస్‌ స్టేషన్‌లో అప్పగించి తన నిజాయితీ చాటుకుంది. అది తెలుసుకున్న రజనీకాంత్‌ ఆమెను నేరుగా ఇంటికి పిలిచి మరీ బంగారు గొలుసు కానుకగా ఇచ్చాడు.

ఘనంగా సన్మానం
అప్పటినుంచి పద్మ పేరు మారుమోగుతూనే ఉంది. తాజాగా దర్శకనటుడు పార్తీబన్‌ (R Parthiban) ఓ కాలేజీలో జరుగుతున్న ఈవెంట్‌కు వెళ్లాడు. పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను కూడా ఆహ్వానించాడు. స్టేజీపై అందరిముందు ఆమెను ఘనంగా సన్మానించాడు. ఆమెకు చెప్పులు తొడిగి, కాళ్లకు నమస్కరించి చీర కానుకగా ఇచ్చాడు. అలాగే నెత్తిన కిరీటం పెట్టాడు. ఈ వీడియోను ఎక్స్‌ (ట్విటర్‌)లో షేర్‌ చేశాడు.

అందుకే పాదపూజ చేశా..
బంగారం విలువ పెరిగేకొద్దీ మానవత్వం తగ్గిపోతుంది. ఒక గ్రాము లక్ష రూపాయలకు చేరుకుంటున్నప్పుడు దానికోసం వేలాది మంది ప్రాణాలే పోవచ్చు. కానీ, పద్మ అనే మహిళ బంగారం కన్నా మానవత్వమే గొప్ప అని నిరూపించింది. సంవత్సరంలో 360 రోజులు పనిచేసే ఆమె 360 గ్రాముల బంగారం దొరికితే దాన్ని యజమానికి తిరిగిచ్చేసింది. అందుకే నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన కాలేజీ ఫంక్షన్‌కు తననూ తీసుకెళ్లాను. తనకు పాదపూజ చేసి కృతజ్ఞతలు చెప్పాను అని రాసుకొచ్చాడు. 

సినిమా
ఇది చూసిన నెటిజన్లు మీరు నిజంగా గొప్పవారు అని కొనియాడుతున్నారు. తమిళ నటుడు ఆర్‌.పార్తీబన్‌ నటుడు మాత్రమే కాదు, దర్శకుడు నిర్మాత కూడా! సహాయ దర్శకుడిగా కెరీర్‌ మొదలుపెట్టిన ఈయన వందకు పైగా చిత్రాల్లో యాక్ట్‌ చేశాడు. యుగానికి ఒక్కడు, రచ్చ, నేనూ రౌడీనే, పొన్నియన్‌ సెల్వన్‌, ఇడ్లీ కొట్టు వంటి పలు చిత్రాల్లో నటించాడు. సుడల్‌ వెబ్‌ సిరీస్‌లోనూ కనిపించాడు.

 

 

చదవండి: ఆరుసార్లు రక్తమార్పిడి.. మూడున్నర నెలలు ఆస్పత్రిలో.. నిక్‌ ఎమోషనల్‌

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)