Breaking News

యాటిట్యూడ్ కాదది అహంకారం.. చంద్రహాస్‌పై కేసు

Published on Thu, 02/05/2026 - 10:48

బుల్లితెర నటుడు ప్రభాకర్‌ కుమారుడు   చంద్రహాస్‌పై కేసు నమోదైంది. తను నటించిన బరాబర్ ప్రేమిస్తా అనే మూవీలో బూతు పాటపై సోషల్‌మీడియాలో నెటిజన్లు భగ్గుమంటున్నారు. ఇటీవల జరిగిన మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో చంద్రహాస్‌ పాడిన పాట వివాదాలకు కారణమైంది. అందులో అసభ్య పదాలు ఉండడంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ క్రమంలో జర్నలిస్ట్‌ అశోక్‌కుమార్‌ తప్పబడుతూ ఒక వీడియో​ పోస్ట్‌ చేశారు. పాటలో చంద్రహాస్‌ ఉపయోగించిన భాష చాలా అభ్యంతరకంగా ఉందని ఆయన సూచించారు. ఆయన వ్యాఖ్యలకు రియాక్ట్‌ అయిన  చంద్రహాస్‌ కౌంటర్‌గా సదరు జర్నలిస్టును బెదిరిస్తూ ఇన్‌స్టాలో వీడియో పోస్ట్‌ చేశారు.  దీంతో అశోక్‌కుమార్‌ మాదాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

తండ్రిగా ప్రభాకర్ వైఫల్యం.. చంద్రహాస్‌పై సైకాలజిస్ట్ విశేష్ కామెంట్‌

సినిమా సక్సెస్ కోసం సభ్యతాసంస్కారాలను తాకట్టు పెట్టడానికి సిద్ధపడిపోయారన్నది ఈ మధ్య కాలంలో సినిమా ప్రమోషన్ల పేరుతో జరుగుతున్న వికృత చేష్టలు చూస్తుంటే అర్థమవుతోంది.ప్రభాకర్ కుమారుడు చంద్రహాస్ వికృత ప్రవర్తన అందుకు తాజా ఉదాహరణ. ఇది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు, అది కుళ్ళిపోతున్న సామాజిక ధోరణికి నిదర్శనం.

'తప్పుడు' ప్రయాణం
పిల్లలకు ఆస్తులు ఇవ్వడం కంటే, సమాజంలో ఎలా నడుచుకోవాలో నేర్పడం ముఖ్యం. వేదికపై మహిళలు ఉన్నారనే కనీస జ్ఞానం లేకుండా బూతు పదాలతో పాట పాడటం 'యాటిట్యూడ్' కాదు, సంస్కారహీనత. తండ్రి వెనక ఉండి నడిపిస్తున్నాడా? లేక కొడుకు దారి తప్పుతుంటే మౌనంగా చూస్తున్నాడా? కారణం ఏదైనా, పక్కనే ఉండి అసభ్యతను ప్రోత్సహించడం "తండ్రిగా పేరెంటింగ్ వైఫల్యమే." 

సైకాలజీ ఏం చెబుతోంది?
సైకాలజీ పరిభాషలో దీనిని 'Attention Seeking Narcissism' అంటారు. అంటే, మంచిగా గుర్తింపు రానప్పుడు, అసభ్యతతోనైనా సరే వార్తల్లో ఉండాలనే పైశాచిక ఆనందం.  "నేను సారీ చెప్పను" అనడం మొండితనం కాదు, తనలోని ఇన్సెక్యూరిటీని కప్పిపుచ్చుకోవడానికి 'అహంకారం' అనే ముసుగు వేసుకుంటున్నాడు.విమర్శలను స్వీకరించలేని వాడు విజ్ఞుడవ్వలేడు, ప్రజాదరణ పొందిన నటుడవ్వలేడు.

షార్ట్ కట్ సక్సెస్... లాంగ్ టర్మ్ ఫెయిల్యూర్
వైరల్ అవ్వడం అంటే విజయం సాధించడం కాదు. నెగటివ్ పబ్లిసిటీతో సినిమాను గట్టెక్కించవచ్చు ఏమో కానీ, వ్యక్తిగా ప్రజల గుండెల్లో గౌరవాన్ని కోల్పోతే దాన్ని సంపాదించుకోవడానికి జీవితకాలం సరిపోదు. జెడి చక్రవర్తి వంటి సీనియర్ల అసహనం చూసైనా మారాలి.

'యాటిట్యూడ్ స్టార్' కాదు... 'అజ్ఞాన స్టార్'
స్టార్‌డమ్ అనేది ప్రవర్తనలో ఉండాలి, పిచ్చి చేష్టల్లో కాదు. సభ్యత నేర్వని విద్య, సంస్కారం లేని కళ రెండూ వ్యర్థమే. సినిమా హిట్ అవ్వచ్చు, ఫ్లాప్ అవ్వచ్చు... కానీ మనిషిగా ఓడిపోకూడదు. ఇప్పటికైనా ఆ తండ్రీ కొడుకులు తమ ప్రవర్తనను సరిదిద్దుకోకపోతే, ప్రేక్షకులు ఇచ్చే తీర్పు చాలా ఘోరంగా ఉంటుంది.

Videos

చంద్రబాబు భక్తుల మనోభావాలు దెబ్బతీనేలా మాట్లాడుతున్నారు

లోక్ సభలో మోదీపై దాడి? బయటపడ్డ సంచలన వీడియో..

జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ మరో వీడియో.. ఈ సారి ఏకంగా కారులో

అంబటి చాలా వీక్ గా ఉన్నారు.. చెప్పుకోలేనంత బాధ అనుభవిస్తున్నారు

ధురంధర్ దెబ్బకి వెనక్కి తగ్గిన పెద్ది..

చంద్రబాబుపై బైరెడ్డి వేటగాడు కథ.. నవ్వులే నవ్వులు

నూతన వధూవరులను ఆశీర్వదించిన వైఎస్ జగన్ మోహన్ రెడ్డి

ఢిల్లీ, ఆర్ సీబీ జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్

ఫిలిప్పీన్స్ లో అగ్నిప్రమాదం.. 5 వేల మందికి పైగా..!

మీకు రోజులు దగ్గరపడ్డాయి.. అంబటి రాంబాబు చిన్న కూతురు మాస్ వార్నింగ్

Photos

+5

బ్లూ డ్రెస్‌లో హీరోయిన్ ఐశ్వర్య రాజేశ్ అందాలు (ఫోటోలు)

+5

ఈయనే నా కెప్టెన్‌: శేఖర్‌ కమ్ముల కూతురు (ఫోటోలు)

+5

ప్రతి జన్మకూ నువ్వే కావాలి: శ్రీలీల (ఫోటోలు)

+5

ఫ్యామిలీతో వండర్‌ పార్క్‌లో లహరి (ఫోటోలు)

+5

బర్త్‌డే బ్యూటీ 'స్వాతిరెడ్డి'.. ట్రెండింగ్‌లో ఫోటోలు

+5

‘శ్రీ చిదంబరంగారు’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రవితేజ సోదరుడి తనయుడు మాధవ్‌ ‘మారెమ్మ’ మూవీ టీజర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు (ఫొటోలు)

+5

నేను తప్పు చేసినా సహించావ్‌.. సంఘవి ఎమోషనల్‌ (ఫోటోలు)

+5

అంబటి కుటుంబానికి వైఎస్‌ జగన్‌ పరామర్శ (ఫొటోలు)