దాడులను మళ్లీ రిపీట్ చేస్తాం.. గల్లా మాధవి అంబటికి వార్నింగ్..
Breaking News
తలైవా మెచ్చిన కార్మికురాలు.. నిజాయితీలో బంగారం..!
Published on Tue, 02/03/2026 - 16:31
కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్ తన గొప్ప మనసు చాటుకున్నారు. నిజాయితీ గల పారిశుద్ధ్య కార్మికురాలిని ఆయన అభినందించారు. చెన్నై మహానగర పాలకసంస్థలో కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మను ఇంటికి పిలిచి మరీ సత్కరించారు. ఆమె నిజాయతీని సూపర్ స్టార్ రజనీకాంత్ మెచ్చుకోవడంతో పాటు బంగారు గొలుసును బహుకరించారు.
అసలేం జరిగిందంటే..
చెన్నై నగరంలో పారిశుద్ధ్య కార్మికురాలిగా పనిచేస్తున్న పద్మకు 45 తులాల బంగారం దొరికింది. తనకు దొరికిన ఆ బంగారాన్ని వెంటనే పోలీసులకు అప్పగించింది. దీంతో తనకు రోడ్డుపై దొరికిన 45 తులాల బంగారాన్ని పోలీసులకు అప్పగించడంపై ఆమె ప్రశంసలు వర్షం కురిసింది. ఆమె నిజాయితీని ప్రతి ఒక్కరు ప్రశంసించారు. ఈ విషయం తెలుసుకున్న తలైవా ఆమెను ఇంటికి పిలిచి సన్మానించారు. ఆప్యాయంగా మాట్లాడిన రజనీకాంత్.. ఆమెకు ఒక బంగారపు గొలుసు గిఫ్ట్‌గా అందించారు. దీంతో ఆమె ముఖంలో ఆనందంతో నిండిపోయింది.
అంతేకాకుండా పద్మకు భారత తపాలా శాఖ ఇటీవలే అరుదైన గౌరవాన్ని అందించింది. ఆమె ఫొటోతో కూడిన ప్రత్యేక పోస్టల్ స్టాంపును విడుదల చేసింది. ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా ఆమెకు రూ.15 లక్షల ప్రమాద బీమా పాలసీని కూడా అందించింది. అంతేకాకుండా తమిళనాడు ప్రభుత్వం ఆమెను అభినందిస్తూ రూ.లక్ష నగదు బహుమతిని చెక్కు రూపంలో ఇచ్చింది. పరుల సొమ్ము తనకు వద్దని పోలీసులకు అప్పగించిన పారిశుద్ధ్య కార్మికురాలు పద్మను ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు.
⭐ A Heartwarming Gesture by #SuperstarRajinikanth ⭐
Superstar #Rajinikanth personally called Padmaa and honoured her with a gold chain 👑✨
Padmaa, a frontline worker, earned widespread appreciation after she recovered 45 sovereigns of gold jewellery found on the road and… pic.twitter.com/1vHv6NBF7u— Danishkumar Sankaran (@S_Danishkumar) February 3, 2026
Tags : 1