జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ
Breaking News
వ్యవసాయం, గ్రామీణ రంగాలకు మొండిచేయి!
Published on Tue, 02/03/2026 - 14:35
కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఇటీవలి బడ్జెట్‌లో మౌలిక సదుపాయాల కల్పనకు అత్యున్నత ప్రాధాన్యతనిస్తూ రికార్డు స్థాయిలో నిధులు కేటాయించింది. అయితే, వ్యవసాయ పరిశోధనలు, గ్రామీణాభివృద్ధి వంటి కీలక రంగాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి లేకపోవడం చర్చనీయాంశంగా మారింది.
దేశ ఆర్థిక వృద్ధికి వెన్నెముకగా నిలిచే మౌలిక సదుపాయాల కోసం ప్రభుత్వం ఈసారి రూ.12.2 లక్షల కోట్ల మూలధన వ్యయాన్ని ప్రతిపాదించింది. ఇది గత ఏడాదితో పోలిస్తే 9 శాతం అధికం. ప్రైవేట్ కార్పొరేట్ పెట్టుబడులు జీడీపీలో కేవలం 11.5% - 12.5% వద్దే స్థిరంగా ఉండటంతో (2004-2008లో ఇది 16% గా ఉండేది), ప్రభుత్వం స్వయంగా రంగంలోకి దిగి పెట్టుబడులను పెంచాలని నిర్ణయించింది.
అంకెలు పెరిగినా.. ఆందోళనలు?
వ్యవసాయ శాఖకు కేటాయింపులు రూ.1.23 లక్షల కోట్లు నుంచి రూ. 1.30 లక్షల కోట్లకు పెరిగాయి. ఇందులో ప్రధానంగా.. పీఎం కిసాన్, పీఎం కిసాన్ మాన్ ధన్ యోజనకు ఎక్కువ కేటాయింపులు చేశారు. అయితే ఆర్థిక మంత్రి ప్రసంగంలో పశుసంవర్ధక, పాడిపరిశ్రమ, మత్స్య సంపద, వాల్‌నట్స్ వంటి అనుబంధ రంగాలపై దృష్టి సారించినప్పటికీ ప్రధాన పంటల రంగం, ఉద్యానవన రంగాల ప్రస్తావన లేకపోవడం గమనార్హం.
దేశంలో విమానాశ్రయాలు, రహదారులు ప్రపంచ స్థాయికి చేరుకున్నా ఢిల్లీలోని ఆజాద్ పూర్ వంటి ప్రధాన వ్యవసాయ మార్కెట్ కమిటీల ఆధునీకరణకు బడ్జెట్ నుంచి ప్రత్యక్ష మద్దతు అవసరమని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
పరిశోధన నిధుల్లో కోత
వాతావరణ మార్పులను తట్టుకునే విత్తనాలు, అధిక ఉత్పాదకత కోసం పరిశోధనలు అవసరమైన తరుణంలో వ్యవసాయ పరిశోధన, విద్యా శాఖ (డీఏఆర్‌ఈ) నిధులు రూ.10280 కోట్ల నుంచి రూ.9967 కోట్లకు తగ్గాయి. ప్రైవేట్ భాగస్వామ్యంతో ‘ఛాలెంజ్ మోడ్’లో నిధులు ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ అది ఎంతవరకు కార్యరూపం దాల్చుతుందనేది స్పష్టత లేదు. మరోవైపు, ప్రధాన మంత్రి మత్స్య సంపద యోజన (పీఎంఎంఎస్‌వై) నిధులను రూ.1500 కోట్ల నుంచి రూ.2500 కోట్లుకు పెంచడం సానుకూల పరిణామం.
ఇదీ చదవండి: పౌరుల గోప్యతను హరించకూడదు: సుప్రీంకోర్టు ఆగ్రహం
Tags : 1