Breaking News

బరువు తగ్గడం అంటే వ్యాయామాలు కాదు..!

Published on Tue, 02/03/2026 - 11:28

బరువు తగ్గడం అంటే వర్కౌట్లు మీద ఫోకస్‌ పెడతాం. అన్నిట్లంకంటే తగ్గాలనే సంకల్పం బలంగా ఉండాలి అప్పుడే అది సాధ్యమవుతుందని అంటోంది ఫిట్‌నెస్‌ కోచ్‌ కేట్‌ డేనియల్‌. ఇంతకుమునుపులా ఉండాలి అన్న ఆలోచనే ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే అంత సులభంగా బరువు తగ్గడం ఈజీ అవుతుంది అంటోందామె. తాను మూడేళ్లలో 70 కిలోల అదనపు బరువుని తగ్గించుకున్నానని..అందుకోసం తన జీవనశైలిలో ఎలాంటి మార్పులు చేశారో ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా షేర్‌ చేసుకున్నారు. అవేంటంటే..

బేరియాట్రిక్‌ కోచ్‌ కేట్‌ డేనియల్‌ బరువు తగ్గడం అన్నది ఓర్పుతో, అంకితభావంతో సాగించాల్సిన జర్నీ అంటుందామె. ఇక్కడ ఈ ఫిట్‌నెస్‌ కోచ్‌ బేరియాట్రిక్‌ సర్జరీ చేయించుకున్నారు. బేరియాట్రిక్‌ సర్జరీ అంటే డైటింగ్/వ్యాయామం పనిచేయనప్పుడు పొట్ట పరిమాణాన్ని తగ్గించి, బరువు తగ్గడానికి సహాయపడే సురక్షితమైన చికిత్స. అది డేనియల్‌ లైఫ్‌లో ఒక భాగం మాత్రమే. కానీ బరువు తగ్గడానికి ముందు తాను టీనేజ్‌లో ఉన్నట్లుగా తనలా మారాలని స్ట్రాంగ్‌ కోరుకుంది. ఆ తర్వాత తన జీవనశైలిలో మార్పులు చేసుకున్నారు. అవేంటంటే..

ఉదయాన్నే మేల్కోవడం..
ఆకలి హార్మోన్ల నియంత్రించే అలవాట్ల కోసం త్వరితగతిన మేల్కోవడం మంచిదని చెబుతోంది. ఇలా తొందరగా లేవడం వల్ల చక్కగా డైట్‌, వర్కౌట్ల ప్లాన్‌ సవ్యంగా ఉంటుందన్నారామె. 

శుద్ధి చేసిన పిండి పదార్థాలకు దూరంగా ఉండటం..
చక్కెర, శుద్ధి చేసిన పిండిలతో చేసి ఆహార పదార్థాలను దగ్గరకు రానివ్వలేదట. ఇది శరీర కొవ్వుని తగ్గించేందుకు హెల్ఫ​ అయ్యిందట. 

వారానికొకసారి నచ్చిన ఆహారం..
నచ్చిన ఫుడ్‌ని స్వయంగా తయారు చేసుకుంటూ..హాయిగా తిన్నాను. దానివల్ల త్యాగాలు చేస్తున్నా అన్న ఫీల్‌ ఉండదు. పైగా కడుపు నిండుగా తినొచ్చు కూడా.

తనను తాను మెరుగ్గా ఉంచుకోవడం
మొదట మనల్ని మనం ప్రేమించడం, ఆహారంతో సంబంధం లేకుండా ఎంతసేపు ఉండగలం వంటి చిన్న ప్రయత్నాలను రోజు రోజుకి పెంచడం. 

ఆరోగ్యకరమైన రిలేషన్స్‌..
ఎందుకంటే మనకు నచ్చిన వాళ్లు ఇచ్చిన ఆహారాలను వాళ్లపై ప్రేమతో లాగించేస్తాం. కాబట్టి..బంధాలను బరువుని పెంచేవిగా మార్చుకోవద్దు. వాళ్లని మేలు కోరే వాళ్లుగా మార్చుకోవాలట. అంటే ఆ బంధాలు మనసుకి స్వాంతన ఇవ్వాలే గానీ శరీరాన్ని భారంగా మార్చకూడదని అంటోంది. 

విజువలైజేషన్‌
కోరుకున్న విధంగా స్మార్ట్‌గా మారినట్లు ఊహించుకోవడం. పదే పదే ఆ దృశ్యమానం..మిమ్మల్ని జాగురకతతో ఉండేలా చేస్తుంది. తినాల్సిన వాటిపై ఫోకస్‌ పెట్టేలా చేస్తుంది. టెంప్ట్‌ అయ్యే ఛాన్స్‌ ఉండదు.

చలాకీగా ఉండటం..
బరువు తగ్గిన వెంటనే 20ల వ్యక్తిలా ఎలా ఉషారుగా పనిచేయగలనో భావించడం. ప్రతి కదలికలో దీన్నిగుర్తించుకోవాలి.

మానసికంగా స్ట్రాంగ్‌ ఉండటం..
బరువు తగ్గలేకపోతున్న అన్న బాధ మెదుడులోకి ఎంటర్‌ అవ్వకూడదు. అది మిమ్మల్ని స్మార్ట్‌గా ఉండనివ్వదట. నిన్ను నువ్వు స్నేహితుడిగా, కేర్‌టేకర్‌గా మార్చుకుంటూ సాగితే బరువు తగ్గడం ఇష్టమైన ఆటలా మారి..సునాయాసంగా తగ్గేలా చేస్తుంది లేదా అదుపులో ఉంచుతుంది .

ఇక్కడ చెప్పినవన్ని..మాయలు మంత్రల్లాంటివి కాదని, కేవలం బరువు తగ్గేందుకు మానసికంగా మనల్ని సన్నద్ధం చేసేవి. వీటికి మంచి ఆహారపు అలవాట్లు, వర్కౌట్లు తోడైతే..బరువు తగ్గడం సులభమవుతుందని అంటోంది ఫిట్‌నెస్‌ కోచ్‌.

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

 

(చదవండి: ఒబెసిటీ డాక్టర్‌ వెయిట్‌లాస్‌ స్టోరీ..! ​కేవలం 18 నెలల్లో 56 కిలోలు..)

 

Videos

పోలీసులు లేకుండా రండి ఎవడి బలం ఏంటో తెలుస్తుంది

జైల్లో అంబటిని కలిసిన ముద్రగడ

అంబటి అల్లుడు,కూతురుని పరామర్శించిన అనిల్ కుమార్ యాదవ్

ఎవర్ని వదిలిపెట్టం.. బైరెడ్డి వార్నింగ్

KTR: 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ? జాబ్ క్యాలెండర్ కు పాతర

మీకు దమ్ముంటే.. బాధితురాలి సంచలన సెల్ఫీ వీడియో..

Brahmaji : నావల్లే పూరి సినిమా ప్లాప్ అయ్యింది

Thanuja : ప్లీజ్ అలా అనడం మానేయండి.. నరకం అనుభవిస్తున్నా..

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకర ఎయిర్ పోర్టులు

దేశం నుంచి వెళ్లిపోండి.. వాట్సాప్ కు సుప్రీంకోర్టు వార్నింగ్

Photos

+5

హీరోయిన్ జెనీలియా పెళ్లి జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సినీ ప్రముఖులు (ఫొటోలు)

+5

'హనీ' ఈవెంట్‌లో అందంగా దివి (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' ట్రైలర్‌ ఈవెంట్‌ లో మెరిసిన హీరోయిన్‌ మానస వారణాసి (ఫొటోలు)

+5

నిర్మల్‌ : ఘనంగా ముజ్గి మల్లన్న జాతర (ఫొటోలు)

+5

’వెరైటీ ఇండియా పార్టీ‘లో మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

'కపుల్ ఫ్రెండ్లీ' మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ధనుష్‌ 55వ సినిమా.. శ్రీలీల, సాయి పల్లవి క్రేజీ ఫోటోలు

+5

ఈషా రెబ్బా 'ఓం శాంతి' జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

దుబాయిలో చిల్ అయిపోతున్న దివ్య భారతి (ఫొటోలు)