కచ్చితంగా రిటర్న్ గిఫ్ట్ ఉంటది... సజ్జల వార్నింగ్
Breaking News
తమిళనాడు సంస్కృతి పరిరక్షణకు..
Published on Mon, 02/02/2026 - 12:04
డీఎంకే ఏలుబడిలో ఉన్న తమిళనాడుపై ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరాల జల్లు కురిపించారు. రాష్ట్రంలో కొత్తగా అరుదైన ఖనిజాల రవాణా కారిడార్‌ను నెలకొల్పనున్నట్లు బడ్జెట్‌లో ప్రకటించారు. దీంతోపాటు చెన్నై మీదుగా పయనించే హైస్పీడ్ రైలు లింక్‌లను అభివృద్ధిచేయనున్నారు. పశ్చిమ కనుమల మార్గంలో పొధుగైమలై కొండ ప్రాంతంలో హైకింగ్, ట్రెక్కింగ్, మౌంటేన్ బైకింగ్ వంటి సదుపాయాలు కల్పించనున్నారు.
పులికాట్ సరస్సుకు విచ్చేసే విదేశీ పక్షుల కోలాహలం, ప్రకృతి అందాలను పర్యాటకులు వీక్షించేందుకు బర్డ్ వాచింగ్ పాయింట్లను నిర్మించనున్నారు. త్వరలో తమిళ నాడు అసెంబ్లీ ఎన్నికలున్న నేపథ్యంలో రాష్ట్రానికి మోదీ ప్రభుత్వం పలు అభివృద్ధి పథకాల నిధులను భారీగా కేటాయించడం విశేషం. ఇనుప రాతి యుగం నాటి ప్రఖ్యాత ఆదిచనల్లూర్ ప్రాంతంలో పురాతత్వ శాఖ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టనున్నారు. అక్కడ లభించిన పురాతన రాళ్లు, ఆనాటి నాగరికత వైభవాన్ని చాటే వస్తువులతో ఆర్కియాలాజికల్ సైట్‌ను అభివృద్ధిచేయనున్నారు.
నాటి సంస్కృతికి కళ్లకు కట్టేలా అభివృద్ధి చేస్తామని ఆమె వెల్లడించారు. నడకదారిలో మొత్తం పురాతత్వ ప్రాంతాన్ని కలియతిరిగేలా వాక్‌వేలను నిర్మించనున్నారు. అక్కడి ప్రాచీన వస్తు వుల విశిష్టతను కథల రూపంలో చెప్పే లా, నాటి సాంకేతికతలను విడమర్చి విశదీకరించేలా గైడ్‌లను అందుబాటు లోకి తేనున్నారు. పాడైన ప్రాచీన వస్తు వులకు మరమ్మతులు, సంరక్షణ కోసం కన్జర్వేటివ్ ల్యాబ్‌ను ఏర్పాటు చేయ నున్నారు.
పురాతత్వ ప్రాంతానికి విచ్చేసే పర్యా టకులు, విదేశీ సందర్శకుల్లో ఆ ప్రాంతంపై మరింత అవగాహన పెంచేలా ఎగ్జిబిషన్‌ల వంటివి ఏర్పా టుచేయనున్నారు. ‘అత్యంత అరుదైన మూలకాల కోసం ఖనిజాల తవ్వకం కోసం తమిళనాడులో రేర్ ఎర్త్ కారిడార్‌ను ఏర్పాటుచేయబోతున్నాం. ఖనిజాల శుద్ధి, పరిశోధన, తయారీని మరింతగా ప్రోత్సహిస్తాం’ అని మంత్రి నిర్మల అన్నారు.
ఇదీ చదవండి: బంగారం ధరల యూటర్న్.. భారీ తగ్గుదల!
Tags : 1