Allu Arjun : ఇది సార్.. నా బ్రాండ్
Breaking News
విశ్వక్ 'ఫలక్‌నుమా దాస్'.. చేజార్చుకున్న హీరో ఎవరంటే?
Published on Fri, 01/30/2026 - 17:18
బొమ్మలరామారం సినిమాతో నటుడిగా పరిచయమయ్యాడు తిరువీర్. ఘాజి, ఏ మంత్రం వేసావె, మల్లేశం చిత్రాల్లో నటించాడు. జార్జ్ రెడ్డి, పలాస 1978 సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. మసూదతో హీరోగా మారాడు. ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షోతో గతేడాది మంచి హిట్ అందుకున్నాడు. ఇప్పుడు భగవంతుడు అని కొత్త సినిమా చేస్తున్నాడు.
నా డైరెక్షన్‌లో చేయాల్సింది!
జీజీ విహారి దర్శకత్వం వహించిన ఈ మూవీ సమ్మర్‌లో రిలీజ్ కానుంది. శుక్రవారం (జనవరి 30) నాడు భగవంతుడు మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ కార్యక్రమానికి హీరో విశ్వక్‌సేన్ ముఖ్య అతిథిగా విచ్చేశాడు. ఈ సందర్భంగా అతడు ఓ ఆసక్తికర విషయాన్ని వెల్లడించాడు. నా ఫస్ట్ సినిమా ఫలక్‌నుమా దాస్‌లో తిరువీర్ నాతోపాటు కలిసి నటించాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల అది కుదరలేదు అని చెప్పాడు.
మరో సినిమా
బహుశా ఫలక్‌నుమా దాస్‌లో విలన్ పాత్ర కోసం మొదట తిరువీర్‌ను అనుకున్నట్లు తెలుస్తోంది. కానీ, చివరకు అది జరగలేదు. ఇకపోతే తిరువీర్ చేతిలో మరో మూవీ కూడా ఉంది. అదే ఓ సుకుమారి. తిరువీర్ హీరోగా, ఐశ్వర్య రాజేశ్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాకు భరత్ దర్శన్ దర్శకత్వం వహిస్తున్నాడు.
చదవండి: అమ్మానాన్న ఆనంద భాష్పాలు.. ఎన్నటికీ మర్చిపోలేను: సారా అర్జున్
Tags : 1