Prof Nageshwar: విచారణ చేయకుండా కల్తీ జరిగిందని ఎలా చెప్తారు?
Breaking News
'నారీ నారీ నడుమ మురారి' ఓటీటీ డేట్ వచ్చేసింది
Published on Fri, 01/30/2026 - 14:16
ఈ సంక్రాంతికి పెద్ద సినిమాలతో పోటీపడి మరీ హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం "నారీ నారీ నడుమ మురారి". శర్వానంద్ హీరోగా సంయుక్త, సాక్షి వైద్య హీరోయిన్లుగా నటించారు. రామ్ అబ్బరాజు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మించాడు. జనవరి 14న విడుదలై హిట్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తాజాగా ఓటీటీలోకి వచ్చేస్తోంది.
వచ్చే వారం ఓటీటీలో..
అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఫిబ్రవరి 4 నుంచి ప్రసారం కానుంది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని ప్రైమ్ వీడియో అధికారిక పోస్ట్ ద్వారా వెల్లడించింది. మరి థియేటర్లలో సినిమా చూడటం మిస్ అయినవారు ఎంచక్కా వచ్చే వారం నారీ నారీ నడుమ మురారి చూసేయండి..
శర్వా అలా అన్నాడో లేదో..
నారీ నారీ నడుమ మురారి టీమ్.. జనవరి 23న సంక్రాంతి విన్నర్ బ్లాక్బస్టర్ ఈవెంట్ అంటూ సెలబ్రేషన్స్ జరిపారు. ఈ కార్యక్రమంలో శర్వానంద్ మాట్లాడుతూ.. ఈ మూవీ ఇక్కడితో ఆగిపోదు, ఇంకో నాలుగువారాలు ఆడుతుందన్నాడు. థియేటర్ల సంఖ్య కూడా పెంచామని తెలిపాడు. శర్వానంద్ అలా అన్నాడో లేడో రెండు వారాల్లోనే మూవీ ఓటీటీలో రిలీజ్ అవుతుండటం గమనార్హం. ఒక్కసారి సినిమా ఓటీటీకి వచ్చాక థియేటర్లలో ఆడటం కష్టమే!
Tags : 1