Breaking News

మోదీ మెచ్చిన 'కిచెన్‌'..! అక్కడ అంతా ఒకేసారి..

Published on Mon, 01/26/2026 - 12:34

అక్కడ అందరికి ఒకే వంటగది. అందరూ కలిసి ఒకే కుటుంబ సభ్యుల్లా భోంచేస్తారు. ఈ రోజుల్లో ఇలాంటి ఐక్యత ఎక్కడ కనిపించదు. కానీ ఈ గ్రామం ఐక్యమత్యం విలువ ఏంటో గొంతెత్తి చెబుతున్న​ట్లు ఉంటుంది. అక్కడ ఎవ్వరి నోట నుంచి ఒంటరితనం అనే మాట వినిపించదు. అంతలా వసుధైక కుటుంబంలా ఆదర్శవంతంగా నివశిస్తున్న గ్రామప్రజల జీవిన విధానం చూసి మోదీ సైతం మెచ్చుకున్నారు. అంతా ఒక్కమాటపై సమిష్టిగా ఉంటే ఏ బడ్జెట్‌ కేటాయింపులతో పని ఉండదు. కేవలం కలిసి ఉండాలన్న ఆ ఆలోచనే అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిపోతుంది అనేందుకు ఈ గ్రామమే ఉదాహరణ. పైగా ఇతర గ్రామాలకు ఆదర్శం కూడా. 

ఆ గ్రామమే గుజరాత్‌లోని చందకి గ్రామం. అక్కడ ఎవ్వరూ వంట చెయ్యరు. ఏ ఇంటిలోనే పొయ్యి వెలగదు. మరి భోజనం ఎలా అంటే..అక్కడ వాళ్లందరికీ కమ్యూనిట్‌ కిచ్‌న్‌ ఆధారం. అక్కడ సమిష్టిగా భోజనం తయారు చేసుకుని, అందరు కలిసి తింటారు. నిజానికి ఈ సంప్రదాయం ఐక్యత, సంరక్షణ, భాగస్వామ్య జీవనం వంటి విలువలను నేర్పించేలా ఉంది ఆ గ్రామస్తుల జీవన విధానం.

ఆ ఆలోచన ఎలా వచ్చిందంటే..
గుజరాత్‌లోని మెహ్సానా జిల్లాలోని చందాకి గ్రామంలో ఒకప్పుడు వెయ్యి మందికి పైగా నివాసితులు ఉండేవారు. కానీ ఇప్పుడు కేవలం 500 మంది పెద్దలు మాత్రమే ఉన్నారు. యువకులు చదువు, ఉద్యోగ రీత్యా అహ్మదాబాద్‌ వంటి నగరాలకు వెళ్‌లిపోయారు. కొందరు విదేశాల్లో స్థిరపడ్డారు. దాంతో అక్కడ జనాభా తగ్గింది. చుట్టూ దుకాణాలు తగ్గాయి..రోజువారీ వంట వారికి ఓ పోరాటంలా మారింది. కనీస ప్రాథమిక అవసరాల కోసం కూడా ఏకంగా రూ. 3 కిలోమీటర్లు నడక తప్పేది కాదు. దాంతోపాటు ఒంటిరితనం ఆవరించడం మొదలైంది. ఎటుచూసినా ఇళ్లన్నీ.. నిశబ్దంగా ఉండటం మొదలయ్యాయి. ఇదంతా గమనించి ఆ ఊరి సర్పంచ్‌ పూనంభాయ్‌ పటేల్‌ దీనికి పరిష్కార మార్గం ఏంటని ఆలోచిస్తుండేదామె. న్యూయార్క్‌లో 20 ఏళ్లకు పైగా ఉన్న ఆమె తన స్వంతూరికి తిరిగి వచ్చి.. చాలా ఆలోచించి..ఓ కమ్యూనిటీ కిచెన్‌ ఏర్పాటు చేస్తే ఎలా ఉంటుంది అనుకుంది. 

గ్రామానికంతటికి ఒకే వంటగది ఉండేలా గ్రామ ప్రజలందర్నీ చైత్యనపరిచి మరి ఏర్పాటు చేశారామె. అక్కడున్న వారంతా నెలకు కేవలం రూ.2000 నుంచి రూ. 2500 వరకు చెల్లిస్తే చాలు..రెండు పూటల ఆరోగ్యకరమైన భోజనం రోటీలు, స్వీట్లు తినొచ్చు. సౌరశక్తితో నడిచే కిచెన్‌, ఎయిర్‌ కండిషన్‌ తదితర అత్యాధునిక సౌకర్యాలతో కమ్యూనిటీ వంటగదిని ఏర్పాటు చేసుకున్నారు. అందరు కలిసి సమిష్టిగా వంటచేసుకుని మరి..భోజనం చేస్తారు. 

ఇక నడవలేని దివ్యాంగులు, పెద్దలకు నేరుగా భోజనం ఇంటి వద్దకే అందిస్తారు. దీనివల్ల వారిలో తాము ఒంటరి అనే భావన కనుమరుగైంది. అందరూ ఆనందంగా ఆరోగ్యకరమైన భోజనం తింటూ సంతోషభరితంగా జీవిస్తూ..ఇతర గ్రామాలకు ఆదర్శంగా నిలిచారు అక్కడి ప్రజలు. ఆ గ్రామ జీవన విధానం ప్రధాని నరేంద్ర మోదీని సైతం ఆకర్షించింది. ఆయన తన నెలవారీ రేడియో కార్యక్రమం 'మన్ కీ బాత్'లో, దీని గురించి ప్రస్తావించి..అక్కడి కమ్యూనిటీ కిచెన్‌ సంప్రదాయన్ని మెచ్చుకున్నారు.

ఇది వంటభారాన్ని తగ్గించడమే కాకుండా సామాజిక బంధాలను బలోపేతం చేసింది. వసుధైక కుటుంబంలా జీవించేలా బలమైన కుటుంబ స్ఫూర్తిని అందించిందన్నారు. అంతేగాదు వాళ్లంతా కలిసి తినేలా ఒక విధానాన్ని కూడా ఏర్పాటు చేసుకున్నారు. ప్రతి రోజు ఉదయం 11 గంటలకు గంట మోగుతుంది. అది భోజన సమయం అయ్యింది అనేందుకు సంకేతం. అప్పుడు పెద్దలు గ్రామ ప్రవేశద్వారం సమీపంలో ఉన్న చంద్రేశ్వర్ మహాదేవ్ ఆలయంలో సమావేశమవుతారు. వెంటనే ఆ ఆలయ ప్రాంగణంలో  టేబుళ్లు, కుర్చీలు క్షణాల్లో సిద్ధమవుతాయి. అంతా హాయిగా మాట్లాడుకుంటూ కలిసి భోజనం చేస్తారు. వడ్డన కూడా చాలా గౌరవప్రదంగా ఉంటుందట.

 

(చదవండి: ఒంటరి పెంగ్విన్‌ ఇంత స్ఫూర్తిని రగిలించిందా?!)

 

Videos

రిపబ్లిక్ డే శుభాకాంక్షలు.. జగన్ ట్వీట్

జాతీయ మీడియా ముందు ఏపీ పరువు తీస్తున్నారు!

ఇప్పుడు ఏ చెప్పుతో కొట్టాలి మిమ్మల్ని.. జడ శ్రవణ్ షాకింగ్ నిజాలు

మంచు తుఫాన్ బీభత్సం.. ఏడుగురు మృతి

అడిగింది చెప్పు.. ఎక్స్ట్రాలు చెయ్యకు.. క్లాస్ పీకిన చంద్రబాబు

రీల్స్ చేయను క్షమించండి..

టీడీపీ గూండాల బరితెగింపు.. డెయిరీ ఫామ్ ను కూల్చేసి.. 26 గేదలను..

20 వేలకే కారు.. లక్కీ డ్రా పేరుతో మోసం.. కార్లను తుక్కు తుక్కు చేసిన జనం

తిరుమల లడ్డూపై జడ శ్రవణ్ సంచలన ప్రెస్ మీట్

కామారెడ్డిలో విషాదం.. ఆటో నుండి దూకిన ముగ్గురు అమ్మాయిలు..

Photos

+5

'ఇరుముడి' సెట్‌లో రవితేజ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ఢిల్లీలో ఘనంగా 77వ గణతంత్ర దినోత్సవ వేడుకలు (ఫొటోలు)

+5

'బిగ్‌బాస్' సోనియా కుమార్తె బారసాల వేడుక (ఫొటోలు)

+5

వికసించిన పద్మాలు

+5

Medaram Jatara 2026 : మేడారం జాతరలో భారీ భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

‘మనశంకర వరప్రసాద్‌ గారు’ మూవీ బ్లాక్‌బస్టర్‌ సక్సెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

గాజులరామారం : ఘనంగా చిత్తారమ్మ జాతర (ఫొటోలు)

+5

అనిల్‌ రావిపూడికి ఒక రేంజ్‌ గిఫ్ట్‌ ఇచ్చిన చిరంజీవి (ఫోటోలు)

+5

తెలుగు సీరియల్ నటి కూతురి బారసాల (ఫొటోలు)

+5

కాంతార బ్యూటీ 'సప్తమి గౌడ' పదేళ్ల సినీ జర్నీ స్పెషల్‌ ఫోటోలు