Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
బంగారం, వెండి తగ్గొచ్చు పెరగొచ్చు.. కానీ..
Published on Fri, 01/23/2026 - 13:49
‘రిచ్ డాడ్ పూర్ డాడ్’ రచయిత, ప్రముఖ ఇన్వెస్టర్ రాబర్ట్ కియోసాకి బంగారం, వెండి, బిట్‌కాయిన్ వంటి ఆస్తుల ధరలు పెరుగుతాయా తగ్గుతాయా అన్న విషయాన్ని తాను పట్టించుకోనని స్పష్టం చేశారు. తాత్కాలిక మార్కెట్ ఊగిసలాటలకంటే దీర్ఘకాలిక ఆర్థిక వాస్తవాలే ముఖ్యమని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈమేరకు సోషల్ మీడియాలో రాబర్ట్ కియోసాకి తాజాగా ఒక పోస్ట్ చేశారు. అమెరికా జాతీయ రుణం నిరంతరం పెరుగుతుండటం, డాలర్ కొనుగోలు శక్తి తగ్గుతుండటమే తన పెట్టుబడి దృక్పథానికి ప్రధాన కారణమని కియోసాకి తెలిపారు.
“బంగారం, వెండి లేదా బిట్‌కాయిన్ ధరలు పెరుగుతాయా పడిపోతాయా అని నేను పట్టించుకోను, ఎందుకంటే అమెరికా జాతీయ రుణం పెరుగుతూనే ఉంది, అదే సమయంలో డాలర్ విలువ క్రమంగా తగ్గుతోంది” అంటూ తన ‘ఎక్స్’ పోస్టులో రాసుకొచ్చారు.
కేంద్ర బ్యాంకులు, ప్రభుత్వ ద్రవ్య విధానాలపై కియోసాకి చాలాకాలంగా విమర్శలు చేస్తూ వస్తున్నారు. తాజా వ్యాఖ్యల్లో, ఫెడరల్ రిజర్వ్, యూఎస్ ట్రెజరీ, ప్రభుత్వ ఆర్థిక వ్యవస్థను “అధిక విద్య కలిగిన కానీ అర్హత లేని పీహెచ్‌డీలు” నియంత్రిస్తున్నారని విమర్శించారు.
ధరల మార్పులపై దృష్టి పెట్టకుండా, తాను బంగారం, వెండి వంటి భౌతిక ఆస్తులతో పాటు బిట్‌కాయిన్, ఎథీరియమ్ వంటి డిజిటల్ ఆస్తులను నిరంతరం కొనుగోలు చేస్తూనే ఉన్నానని కియోసాకి తెలిపారు. పరిమిత సరఫరా ఉన్న ఈ ఆస్తులు ద్రవ్యోల్బణం, కరెన్సీ విలువ తగ్గుదలకు రక్షణగా నిలుస్తాయని ఆయన నమ్మకం.
Q: Do I care when the price of gold silver or Bitcoin go up or down?
A: No. I do not care.
Q: Why Not?
A: Because I know the national debt of the US keeps going up and the purchasing power of the US dollar keeps going down.
Q: Why worry about the price of gold, silver,…— Robert Kiyosaki (@theRealKiyosaki) January 23, 2026
Tags : 1