Dharmana : భూములు కొట్టేయడానికే చట్టమా? మీరే పెద్ద దొంగలు..
Breaking News
పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గాలంటే...!
Published on Fri, 01/23/2026 - 13:47
సాధారణ వ్యక్తులకు బరువు తగ్గడమే కష్టమైన టాస్క్ అనుకుంటే..అందులోనూ ఇలా పెరిమెనోపాజ్ దశలో ఉన్న మహిళలకు మరింత ఇబ్బందిగా ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో మూడ్ స్వింగ్స్ సవ్యంగా ఉండవు. హర్మోన్ల మార్పులతో ఒక రకమైన చికాకు, ఒత్తిడి వంటివి ఎదుర్కొంటారు. దాంతో కొందరికి విపరీతమైన ఆకలి వేసేస్తుంటుంది కూడా. అందువల్ల ఆ టైంలో బరువుని అదుపులో ఉంచడం అనేది మాములు విషయం మాత్రం కాదు. అయితే దాన్ని ఈజీగా హ్యాండిల్ చేస్తూ వెయిట్‌లాస్ అవ్వొచ్చని చెబుతోంది స్వతహాగా ఫోటోగ్రాఫర్ అయిన ఈ ఇన్ఫ్లుయొన్సర్. అదెలాగో ఆమె మాటల్లోనే సవివరంగా తెలుసుకుందామా..!.
పెరిమెనోపాజ్ సమయంలో బరువు తగ్గడం ఎలాగో అందుకు హెల్ప్ అయ్యే చిట్కాల గురించి షేర్ చేసుకున్నారు ఫోటోగ్రాఫర్ . ఆమె ఆ సమయంలోనే తాను ఆరు నెలల్లో 11 కిలోలు వరకు తగ్గానని చెప్పుకొచ్చారామె. ఈ సీక్రెట్ ఏంటో ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌లో షేర్ చేసుకున్నారామె. మొదట్లో పెరిమెనోపాజ్‌లో ఉన్నప్పుడు బరువు తగ్గాను అని చెప్పడానికి చాలా ఇబ్బంది పడ్డా..కానీ ఇప్పుడు గట్టిగా అరిచి చెబుతా. ఎందుకంటే..ఆ సమయంలో తన శరీరం చాలా లావుగా అసహస్యంగా ఉండటంతో..తనను తాను గుర్తించడం మానేసిన దారుణమైన పరిస్థితని చెప్పుకొచ్చారామె.
అయితే లాక్‌డౌన్ సమయం నుంచి ఇప్పటి వరకు బరువుని అదుపులో ఉంచేలా చక్కటి ఆహారాన్ని తీసుకుని సత్ఫలితాలు పొందానని ఆనందంగా వెల్లడించారామె. భవిష్యత్తులో 50 ఏళ్లు నిండిన నా ఆహార సంబంధాన్ని ఆరోగ్యప్రదంగానే ఉంచుకుంటానంటోంది. తాను ప్రోటీన్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు తినడం, బరువులు ఎత్తడం, చిరుతిళ్లకు దూరంగా ఉండటం అలవాట్లను తన డైట్‌లో భాగం చేసుకున్నట్లు చెప్పుకొచ్చారు. అంతేగాదు ఆ సమయంలో బరువు తగ్గాలంటే మన జీవనశైలి ఎలా ఉండాలో కూడా వివరించిందామె.
బరువులు ఎత్తడం..
కండర ద్రవ్యరాశికి, జీవక్రియలు మెరుగుపడేందుకు వారానికి నాలుగు సార్లు బరువులు ఎత్తడం వంటివి చేసేదాన్ని అని తెలిపారామె.
వాకింగ్
అడుగుల సంఖ్యను రోజు రోజుకి పెంచుతూ అలా పదివేల అడుగులు వేసేలా సెట్ చేసుకున్నారట ఆమె. దీంతోపాటు వారానికి రెండుసార్లు యోగా సెషన్‌లకు హాజరయ్యేదాన్ని అని తెలిపింది.
ప్రోటీన్‌కి ప్రాధాన్యత..
ఎక్కువసేపు కడుపు నిండిన అనుభూతిని ఇచ్చే ఆరోగ్యకరమైన ప్రోటీన్లను ఎంపిక చేసుకుని మరి తినేదాన్ని అని చెప్పారు.
చిరుతిళ్లుకు చెక్..
సంతృప్తిగా తినడం ప్రారంభించడంతో..చిరుతిళ్ల జోలికి వెళ్లిపనే తప్పిందని చెప్పింది. తన అల్పాహారంలో అదనపు కేలరీల ప్రధాన మూలం తన బరువు పెరిగేందుకు కారణమని భావించే వాటికి దూరంగా ఉన్నానని వివరించింది.
సహజసిద్ధమైన వాటిని తీసుకుంటూ.. ఫిట్‌నెస్ యాప్‌తో తన ఆరోగ్యాన్ని ట్రాక్ చేయడం ప్రారంబించారమె. అలాగే వెయిట్‌లాస్ ప్రక్రియలో ఇతరులు సహాయం తీసుకుంటూ మనలో మార్పులు వచ్చాయో లేదా అడగి తెలుసుకోవడం తదితరాలను చేయాలని చెప్పొకొచ్చింది ఫోటోగ్రాఫర్ కింబర్లీ ఎస్పినెల్.
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం
(చదవండి: పోగొట్టుకున్న రూ. 30 కోట్లు తిరిగి సంపాదించా..! కానీ అతి విలువైన..)
Tags : 1