Breaking News

అమెను ఇప్పటికే పెళ్లి చేసుకున్నా.. కానీ..: అమిర్ ఖాన్

Published on Thu, 01/22/2026 - 16:13

బాలీవుడ్ స్టార్ అమిర్ ఖాన్‌ గతేడాది అభిమానులకు ఊహించని సర్‌ప్రైజ్‌ ఇచ్చాడు. ఆరు పదుల వయస్సులోనూ తనకు గర్ల్‌ఫ్రెండ్‌ ఉందంటూ బర్త్ డే రోజే పెద్ద షాకిచ్చాడు. బెంగళూరుకు చెందిన గౌరీ స్ప్రాట్‌ను తన ప్రియురాలిగా ఫ్యాన్స్‌కు పరిచయం చేశారు. ఆ తర్వాత వీరిద్దరు ఎక్కడికెళ్లినా జంటగా కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో వీరిద్దరి పెళ్లిపై నెట్టింట చర్చ నడుస్తోంది. అమిర్ ఖాన్‌- గౌరీ వివాహ బంధంతో ఒక్కటవుతున్నారా? అనే టాక్ వినిపిస్తోంది.

ఈ నేపథ్యంలో అమిర్ ఖాన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తాజాగా గౌరీ స్ప్రాట్‌తో తన రిలేషన్ గురించి మాట్లాడారు.  గౌరీని వెంటనే పెళ్లి చేసుకోవాలనే ప్రణాళిక ఏదీ లేదని ఆమిర్ ఖాన్ స్పష్టం చేశారు. ప్రస్తుతం నేను, గౌరీ ఒకరి పట్ల ఒకరం చాలా  చాలా నిబద్ధతతో ఉన్నామని తెలిపారు. మీ అందరికీ తెలుసు.. ప్రస్తుతం మేము భాగస్వాములం.. మేమిద్దరం కలిసే ఉన్నామని వెల్లడించారు. ఇక పెళ్లి విషయానికొస్తే ఆమెను నా  మనసుతో ఇప్పటికే పెళ్లి చేసుకున్నానని తెలిపారు. ప్రస్తుతానికి పెళ్లిని అధికారికంగా చేసుకోకపోయినా.. అలా చేసుకోవాలా? వద్దా? అనేది భవిష్యత్తులో ఇద్దరం నిర్ణయించుకుంటామని అమిర్ ఖాన్ అన్నారు.

కాగా.. ఆమిర్ ఖాన్, గౌరీ స్ప్రాట్ కొంతకాలంగా డేటింగ్ చేస్తున్నారు. గతేడాది పుట్టినరోజు ఆమిర్ తన రిలేషన్‌ను అఫీషియల్‌గా ప్రకటించారు. తాము ముంబైలో ఒక విలాసవంతమైన కొత్త ఇంటికి మారుతున్నట్లు ఆమిర్ ఇటీవలే తెలిపారు. కాగా.. మొదట ఆమిర్ మొదట రీనా దత్తాను వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు కుమార్తె ఐరా ఖాన్, కుమారుడు జునైద్ ఖాన్ జన్మించారు. దాదాపు 16 సంవత్సరాల వివాహం తర్వాత 2002లో వారు విడిపోయారు. ఆ తర్వాత అమిర్ 2005లో కిరణ్ రావును వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులు సరోగసీ ద్వారా ఆజాద్ రావు ఖాన్ అనే కుమారుడికి జన్మనిచ్చారు. ఆమిర్ కిరణ్‌ రావుతో 2021లో విడిపోయారు. ఇద్దరితో విడాకులు తీసుకున్నప్పటికీ కుటుంబంలో జరిగే ఈవెంట్లకు అమిర్ ఖాన్ హాజరవుతున్నారు. విడిపోయిన ఇద్దరు భార్యలతో స్నేహపూర్వక రిలేషన్ కొనసాగిస్తూనే ఉన్నారు. 
 

Videos

విజయ్ కి గుడ్ న్యూస్ TVK పార్టీ గుర్తు ఇదే..

RK Roja: రెడ్ బుక్ అని తిరిగేవాళ్లకు వడ్డీతో ఇచ్చేద్దాం

బాబు భూ సెర్వే... చంద్రబాబుపై మధుసూదన్ రెడ్డి పంచులు

కేతిరెడ్డి పెద్దారెడ్డి పై దాడి చేసేందుకు స్కేచ్ తెగించిన జేసీ ప్రభాకర్ రెడ్డి

వైఎస్సార్‌సీపీ ఎంపీలతో వైఎస్‌ జగన్‌ కీలక సమావేశం

నువ్వు నాటిన విత్తనాలు వృక్షాలు అయితే ఎలా ఉంటుందో చూపిస్తా బాబుకు జగన్ స్ట్రాంగ్ వార్నింగ్

ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే సిట్ నోటీసులు ఇస్తారా?: హరీష్ రావు

కేటీఆర్ కు సిట్ నోటీసులు

విద్యుత్ చార్జీలు తగ్గించినట్టు ప్రభుత్వం తప్పుడు ప్రచారం

ట్రంప్ VS న్యూసమ్... సొంత దేశంలోనే గొడవలు

Photos

+5

వేకేషన్‌ ఎంజాయ్‌ చేస్తోన్న చిన్నారి పెళ్లికూతురు అవికా గోర్ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో సూపర్ స్టార్ కృష్ణ మనవడు జయకృష్ణ (ఫోటోలు)

+5

స్టన్నింగ్‌ అవుట్‌ఫిట్‌లో టాలీవుడ్ హీరోయిన్ ఇషా రెబ్బా (ఫోటోలు)

+5

నిన్ను విసిగించడం నాకెంత ఇష్టమో!: భావన (ఫోటోలు)

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)