Breaking News

తప్పు తెలుసుకున్నా.. క్షమించండి: హీరోయిన్‌

Published on Wed, 01/21/2026 - 20:07

మేడారం జాతరలో పెంపుడు కుక్కను తూకం వేసి మొక్కు చెల్లించుకున్న హీరోయిన్‌ టీనా శ్రావ్య తాజాగా క్షమాపణలు చెప్పింది. ఈ మేరకు ఇన్‌స్టాగ్రామ్‌ స్టోరీలో ఓ వీడియో రిలీజ్‌ చేసింది. మీ అందరికీ ఒక క్లారిటీ ఇవ్వడంతో పాటు క్షమాపణలు చెప్పడానికి ఈ వీడియో చేస్తున్నాను. నేను పోస్ట్‌ చేసిన వీడియో వైరల్‌ అయ్యాక తెలిసింది అది కరెక్ట్‌ కాదని! 

కుక్కకి సర్జరీ
నేను పెంచుకుంటున్న కుక్కకి 12 ఏళ్లు. దానికి ట్యూమర్‌ సర్జరీ అయింది. అది మంచిగా కోలుకోవాలని సమ్మక్కను మొక్కుకున్నాను. అనుకున్నట్లుగానే కుక్క కోలుకుని బాగా నడుస్తోంది. అందుకే మొక్కు చెల్లించాలని నా కుక్కతో బంగారం (బెల్లం) తూకం వేయించాను. అది నేను ప్రేమతో, భక్తితో మాత్రమే చేశాను. ఎవరినీ కించపరచాలన్న ఉద్దేశంతో చేయలేదు. 

తప్పు తెలుసుకున్నా
మన మేడారం జాతర సాంప్రదాయం ప్రకారం, గిరిజనుల ఆచారం ప్రకారం అది తప్పని నేను ఇప్పుడు తెలుసుకున్నాను. నేను చేసిన పొరపాటు వల్ల ఎవరైనా హర్ట్‌ అయి ఉంటే క్షమించండి. ఇలాంటి పొరపాట్లు మళ్లీ జరగనివ్వను. మన సాంప్రదాయాలను ఎప్పుడూ గౌరవిస్తాను. ఈ వివాదాన్ని ఇక్కడితో ముగించమని కోరుతున్నాను అని చేతులెత్తి వేడుకుంది.

మేడారం జాతర
తెలంగాణలోని మేడారంలో జరిగే సమ్మక్క-సారలమ్మ జాతర ఎంతో విశిష్టమైనది. ఇది దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర. ఈ వేడుకకు లక్షలాది భక్తులు హాజరవుతుంటారు. చాలామంది వారి బరువుకు సరిపడా బంగారాన్ని (బెల్లాన్ని) అమ్మవారికి మొక్కుగా చెల్లిస్తారు. ఈ క్రమంలోనే 'ద ‍గ్రేట్‌ ప్రీ వెడ్డింగ్‌ షో' హీరోయిన్‌ టీనా శ్రావ్య తన పెంపుడు కుక్కని తక్కెడలో కూర్చోబెట్టి బెల్లాన్ని మొక్కుగా చెల్లించింది. ఈ వీడియో ఆమె సోషల్‌ మీడియాలో షేర్‌ చేయగా పలువురూ ఆమె చేసిన పనిని విమర్శించారు. దాంతో ఆమె ఇలా వివరణ ఇచ్చుకుంది.

చదవండి: తెలుగు, తమిళ హీరోయిన్స్‌పై రాజాసాబ్‌ బ్యూటీ సెటైర్లు

Videos

జమ్మూకశ్మీర్ : దోడా జిల్లాలో ఘోర ప్రమాదం

జార్ఖండ్‌లోని చైబాసాలో భారీ ఎన్ కౌంటర్

Viral Video: నంద్యాల బస్సు ప్రమాదం CCTV వీడియో

YS Jagan: ఏంటి బాబు ఈ పనికిమాలిన పనులు

YS Jagan: నీకు కొడుకు వయసులో ఉన్నా.. నాతో కూడా పోటీ పడలేకపోతున్నావ్

సరిగ్గా ఎన్నికలకు మూడు రోజుల ముందు బాబు బండారం బయటపెట్టిన వైఎస్ జగన్

భూ రీసర్వే పై YS జగన్ రియాక్షన్

YS Jagan: సొమ్మొకరిది.. సోకొకరిది

13 రూపాయల వడ్డీ టైం కి ఇవ్వకపోతే అంతు చూస్తా..!

గుర్తుపెట్టుకో బాబూ.. రేపు మా వాళ్లు నేను ఆపినా ఆగరు!

Photos

+5

ఇప్పుడు స్టార్‌ సెలబ్రిటీస్‌.. పదేళ్ల కిందట ఎలా ఉన్నారంటే? (ఫోటోలు)

+5

బ్లాక్‌ & వైట్‌ డ్రెస్‌లో జిగేలుమంటున్న హీరోయిన్‌ (ఫోటోలు)

+5

మేడారం మహాజాతరలో తొలిఘట్టం...ఘనంగా మండమెలిగె పండుగ (ఫొటోలు)

+5

ఫుల్‌ జోష్‌లో బిగ్‌బాస్‌ విష్ణు ప్రియ (ఫోటోలు)

+5

ఎల్లే లిస్ట్ అవార్డులు 2026...మెరిసిన బాలీవుడ్ తారలు (ఫొటోలు)

+5

కాలుదువ్వుతూ..రంకెలేస్తూ రంగంపేట జల్లికట్టు (ఫొటోలు)

+5

కడప : అంగరంగ వైభవంగా శ్రీ సీతారాముల కళ్యాణం..హాజరైన వైఎస్ అవినాష్ రెడ్డి (ఫొటోలు)

+5

అభిషేక్‌ శర్మ మెరుపు ఇన్నింగ్స్‌..తొలి టి20లో భారత్‌ ఘనవిజయం (ఫొటోలు)

+5

అదే మొదటిసారి అంటున్న రుక్మిణి వసంత్‌ (ఫోటోలు)

+5

ఉజ్జయిని మహకాళేశ్వర్ ఆలయంలో హీరోయిన్ లక్ష‍్మీరాయ్ పూజలు (ఫొటోలు)