TDP MLA చేసిన అవమానం.. షరీఫ్ కు ముస్లిం నేతల పరామర్శ
Breaking News
టాలీవుడ్‌ను కాపాడుతున్న 'Gen Z' కిడ్స్
Published on Tue, 01/20/2026 - 13:05
భారతదేశంలోని మల్టీప్లెక్స్ థియేటర్ల ప్రయోజనాలను కాపాడటానికి ఏర్పడిన సంస్థ MAI.. ఈ సంస్థ ఎప్పటికప్పుడు థియేటర్స్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్యను క్రోడీకరిస్తుంది. గత 5ఏళ్లలో వచ్చిన మార్పులను మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఎప్పటికప్పుడు తెలుపుతూనే ఉంది. వారు ఇప్పటికే అందించిన నివేదిక ప్రకారం కోవిడ్ తర్వాత 2020–2022 మధ్య థియేటర్‌కు వెళ్లిన వారి సంఖ్య గణనీయంగా తగ్గిందని తెలిపింది. కానీ, 2023–2025లో పెద్ద సినిమాల కారణంగా మళ్లీ పెరుగుదల కనిపించిందని పేర్కొంది.
ముఖ్యంగా 2025లో Gen Z (13–29 ఏళ్ల వయసు) ప్రేక్షకులు థియేటర్‌కి వెళ్లే వారి సంఖ్య 25% పెరిగింది. వారు సగటున సంవత్సరానికి 6 సార్లు థియేటర్‌కి వెళ్లారని లెక్కలు చెబుతున్నాయి. అయితే, 30 ఏళ్లకు పైబడిన వారి సంఖ్యతో పాటు ఫ్యామిలీ ఆడియన్స్ ఏకంగా 41 శాతం వరకు థియేటర్‌వైపు వెల్లడంలేదని తేల్చిచెప్పింది. 2019 వరకు ప్రతి ఏడాది థియేటర్లలో సినిమాలు చూసిన ప్రేక్షకుల సంఖ్య సుమారు 150 కోట్ల వరకు ఉంది. అయితే, 2024కు వచ్చేసరికి కేవలం రూ. 86 కోట్లకు పడిపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. సినిమా టికెట్ ధరలతో పాటు క్యాంటీన్ రేట్ల కారణంగా థియేటర్‌వైపు వెళ్లాలని ఉన్నప్పటికీ సామాన్యులు దడుసుకుంటున్నారు. దీంతో కొన్ని థియేటర్స్ మూతపడుతున్నాయి. ఓటీటీల ప్రభావం కూడా ఎక్కువగా ఉండటంతో థియేటర్స్ అవసరం తగ్గింది.
థియేటర్స్‌కు ప్రేక్షకులు వెళ్లడం తగ్గించడంతో కలెక్షన్స్‌పై ఆ ప్రభావం పడుతుంది. గత ఐదేళ్లగా భారతీయ సినిమాలన్నీ సాధించిన వసూళ్లులో పెద్దగా మార్పు లేదు. దేశవ్యాప్తంగా 2019లో రూ. 19వేల కోట్లు వస్తే.. 2024లో రూ. 18వేల కోట్లు, 2025లో రూ. 14వేల కోట్లకు పైగానే కలెక్షన్స్ వచ్చాయి. 41శాతం ప్రేక్షకులు తగ్గినప్పటికీ ఈ రేంజ్ కలెక్షన్స్ రావడానికి ప్రధాన కారణం టికెట్ రేట్ల పెంపు అని చెప్పవచ్చు. 2025లో సినిమా టికెట్ ధరల పెంపు గణనీయంగా పెరిగింది. అదే సమయంలో థియేటర్‌కు వచ్చే ప్రేక్షకుల సంఖ్య కూడా దారుణంగా పడిపోయింది.
ప్రస్తుతం ఎక్కువగా Gen Z (13–29 ఏళ్ల వయసు) వారే థియేటర్‌కు వెళ్తున్నారని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. గతేడాదిలో హిందీ పరిశ్రమ కాస్త మెరుగ్గానే ఉంది. హిందీ పరిశ్రమ నుంచి గతేడాది 231 సినిమాలు విడుదలైతే రూ. 4,639 కోట్ల గ్రాస్ వచ్చింది. కానీ, టాలీవుడ్ పాతాళానికి పడిపోయింది. తెలుగులో 274 సినిమాలు తీస్తే రూ. 2500 కోట్లు మాత్రమే రాబట్టింది. ఆ తర్వాతి స్థానంలో తమిళ ఇండస్ట్రీ 290 సినిమాలకు గాను రూ. 1,533 కోట్ల గ్రాస్‌తో ఉంది. కన్నడ రూ. 1,100 కోట్లు, మలయాళం రూ. 919 కోట్లతో వరుసగా ఉన్నాయి. కలెక్షన్స్‌తో పాటు ఓటీటీ వంటి వాటితో నిర్మాతలు కాస్త బయటపడుతున్నారు. లేదంటే కోట్ల రూపాయలు నష్టం భరించాల్సి వచ్చేదని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ఏదేమైనా టాలీవుడ్‌లో ఈ ఏడాది నుంచి మరింత కఠనంగా పరిస్థితిలు ఉండే ఛాన్స్ ఉంది.
Tags : 1