మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం
Breaking News
థియేటర్లలో హౌస్‌ఫుల్.. రికార్డులు సృష్టిస్తోన్న చిరంజీవి మూవీ
Published on Fri, 01/16/2026 - 17:41
'మన శంకరవరప్రసాద్‌గారు' డబుల్ సెంచరీ కొట్టారు. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన లేటెస్ట్ మూవీ మన శంకరవరప్రసాద్‌గారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో యాక్ట్ చేశాడు. సంక్రాంతి స్పెషల్‌గా జనవరి 12న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా తొలిరోజే బ్లాక్‌బస్టర్ టాక్ సంపాదించుకుంది.
డబుల్ సెంచరీ
రెండురోజుల్లోనే సెంచరీ (రూ.100 కోట్లు) కొట్టిన ఈ మూవీ ఇప్పుడు నాలుగురోజుల్లోనే డబుల్ సెంచరీ (రూ.200 కోట్లు) మార్క్‌ను చేరుకోవడం విశేషం. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ షైన్ స్క్రీన్స్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'థియేటర్లలో విజిళ్లు.. బయటేమో హౌస్‌ఫుల్ బోర్డులు.. రెండువందల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు' అంటూ చిరు- అనిల్ పోస్టర్ రిలీజ్ చేసింది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికి సినిమా మరిన్ని రికార్డులు తిరగరాయడం ఖాయంగా కనిపిస్తోంది.
Whistles inside - Housefuls outside…
BOX-OFFICE OVERFLOWING EVERY SIDE 💥💥#ManaShankaraVaraPrasadGaru కి
"రెండువంద"ల కోట్ల కలెక్షన్స్ ఇచ్చిన ప్రేక్షకులకు శతకోటి వందనాలు. 🙏🏻🙏🏻🙏🏻#MegaSankranthiBlockbusterMSG grosses 200 CRORE+ worldwide and racing ahead with BLOCKBUSTER… pic.twitter.com/CO2GTdqUfS— Shine Screens (@Shine_Screens) January 16, 2026
చదవండి: నా సినిమా చూసి విడాకులు క్యాన్సిల్ చేసుకున్నారు: చిరంజీవి
Tags : 1