Breaking News

ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ సినిమాలివే.. ‘స్పిరిట్‌’ ఏ స్థానంలో ఉందంటే..

Published on Fri, 01/16/2026 - 14:39

సినిమాలకు సంబంధించి రేటింగ్‌ పరంగా అత్యంత విశ్వసనీయత కలిగిన ఆన్‌లైన్‌ వేదికగా పేరున్న ఇంటర్నెట్‌ మూవీ డేటా బేస్‌ (ఐఎండీబీ).. ప్రతి ఏడాది మాదిరే ఈ సారి కూడా మోస్ట్మోస్ట్‌ అవైటెడ్‌ ఇండియన్‌ మూవీస్‌ జాబితాను ప్ర‌క‌టించింది. 250 మిలియన్లకు పైగా ఐఎండీబీ కస్టమర్ల పేజ్‌ వ్యూస్‌ ఆధారంగా తీసిన ఈ లిస్ట్‌ను తాజాగా ప్ర‌క‌టించింది. లిస్ట్లో టాప్పొజిషన్లో షారుఖ్ఖాన్కింగ్సినిమా ఉండగా.. ప్రభాస్‌-సందీప్రెడ్డి వంగా కాంబినేషన్లో తెరకెక్కుతున్నస్పిరిట్‌’ మూవీ నాలుగో స్థానం దక్కించుకుంది. అలాగే ప్రభాస్‌ మరో చిత్రం పౌజీ పదో స్టానంలో ఉంది. ఇక రామ్చరణ్‌-బుచ్చిబాబు కాంబినేషన్లో తెరకెక్కుతున్న పాన్‌ ఇండియా చిత్రం పెద్ది 13వ స్థానం దక్కించుకుంది. మొత్తంగా టాప్‌ 20లో 5 తెలుగు సినిమాలు ఉండడం విశేషం. 

ఐఎండీబీ ప్రకటించిన టాప్‌ 20 సినిమాలివే...

1) కింగ్(హిందీ) :
పఠాన్‌లాంటి బ్లాక్బస్టర్తర్వాత సిద్ధార్థ్‌ ఆనంద్‌ దర్శకత్వంలో షారుఖ్ఖాన్హీరోగా నటిస్తున్న చిత్రమింది. ఇందులో షారుక్‌ ఖాన్‌ కుమార్తె సుహానా ఖాన్‌ కీలక పాత్ర పోషిస్త్ననారు. దీపికా పదుకొణె, రాణి ముఖర్జీ, అనిల్ కపూర్, జాకీ ష్రాఫ్ లాంటి స్టార్స్కూడా ఇందులో నటిస్తున్నారు.

2) రామాయణ (హిందీ)
రణ్‌బీర్‌ ప్రధాన పాత్రలో నితేశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం రామాయణ. రెండు భాగాలుగా ‘రామాయణ’ రానున్న మూవీ మొదటి పార్ట్‌ ఏడాది దీపావళికి ప్రేక్షకుల ముందుకు రానుంది.2027లో రెండో భాగం విడుదల కానుంది. ఇందులో రణ్బీర్రాముడిగా నటించగా.. సాయి పల్లవి సీత పాత్రని పోషించింది. కన్నడ స్టార్హీరో యశ్‌.. రావణుడిగా కనిపించబోతున్నాడు.

3) జననాయగన్‌(తమిళ్‌)
తమిళ స్టార్ హీరో విజ‌య్ నటించిన చివరి చిత్రం జ‌న‌నాయ‌గ‌న్. హెచ్‌.వినోద్‌ దర్శకత్వం వహించిన యాక్షన్‌ థ్రిల్లర్‌లో పూజా హెగ్దే, మమితా బైజు, ప్రకాశ్ రాజ్‌ కీలక పాత్రలు పోషించారు.

4) స్పిరిట్‌(తెలుగు)
ప్రభాస్హీరోగా సందీప్రెడ్డి వంగా తెరకెక్కిస్తున్న పాన్ఇండియా చిత్రమిది. త్రిప్తి దిమ్రీ హీరోయిన్గా నటించగా,.బాలీవుడ్‌ నటుడు వివేక్‌ ఒబెరాయ్, సీనియర్‌ నటి కాంచన కీలక పాత్రలు పోషిస్తున్నారు.. ప్రపంచవ్యాప్తంగా తొమ్మిది భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు.

5) టాక్సిక్‌(కన్నడ)
యశ్హీరోగా గీతూ మోహన్‌దాస్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రం ‘టాక్సిక్‌. కియారా అద్వానీ, నయన తార, హూమా ఖురేషి, తారా సుతారియా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మార్చి 19 చిత్రం విడుదల కానుంది.

6) బ్యాటిల్ఆఫ్గాల్వాన్

సల్మాన్‌ఖాన్‌ హీరోగా అపూర్వ లఖియా ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతున్న చిత్రం ‘బ్యాటిల్‌ ఆఫ్‌ గల్వాన్‌’. ఇందులో సల్మాన్ ఇండియన్‌ ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఆయనకు జోడీగా చిత్రాంగద సింగ్ నటిస్తోంది. హిమేష్ రేష్మియా సంగీతం అందిస్తున్నారు. ఏడాది ఏప్రిల్‌ 17న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

7) ఆల్ఫా(హిందీ)
అలియా భట్‌. శార్వరీ వాఘ్‌ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రమిది. యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌లో రాబోతున్న ఈ మొదటి మహిళా గూఢచారి చిత్రాన్ని శివ్‌ రావేల్‌ తెరకెక్కిస్తున్నారు.

8) దురంధర్‌ 2 (హిందీ)
బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్‌ హీరోగా వచ్చిన స్పై యాక్షన్ థ్రిల్లర్‌ మూవీ దురంధర్‌ చిత్రానికి సీక్వెల్ఇది. ఆదిత్యధర్‌ దర్శకత్వం వహించిన చిత్రం మార్చి 19 విడుదల కానుంది.

9) బోర్డర్‌ 2 (హిందీ)
1997 నాటి ఐకానిక్ వార్ డ్రామా ‘బోర్డర్’ చిత్రానికి సీక్వెల్‌గా వస్తున్న చిత్రమిది. ఈ సీక్వెల్‌లో సన్నీ డియోల్‌తో పాటు వరుణ్ ధావన్, దిల్‌జిత్ దోసాంజ్ కీలక పాత్రల్లో న‌టిస్తున్నారు. అనురాగ్ సింగ్ దర్శకత్వం వ‌హిస్తున్నాడు.

10) ఫౌజీ
హను రాఘవపూడి, ప్రభాస్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతన్న చిత్రమిది. దేశభక్తి అంశాలతో ముడిపడి ఉన్న ఈ పీరియాడిక్‌ యాక్షన్‌ డ్రామాలో ప్రభాస్‌ సైనికుడి పాత్రలో నటిస్తున్నాడు. ఇమాన్వి హీరోయిన్గా నటిస్తుండగా.. జయప్రద, అనుపమ్‌ ఖేర్, రాహుల్‌ రవీంద్రన్‌ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఆగస్ట్లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

11) లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ(LIK) (తమిళ్‌) : ప్రదీప్ రంగనాథన్(హీరో)

12) ది ప్యారడైజ్(తెలుగు) : నాని

13) పెద్ది(తెలుగు): రామ్చరణ్

14) డ్రాగన్(తెలుగు)‌: ఎన్టీఆర్

15) లవ్అండ్వార్‌(హిందీ): రన్బీర్కపూర్

16) బూత్బంగ్లా(హిందీ): అక్షయ్కుమార్

17) బెంజ్‌(తమిళ్): లోకేష్ సినిమాటిక్ యూనివర్స్ (LCU)నుంచి రాబోతున్న చిత్రమిది.

18) శక్తి శాలిని(హిందీ): హారర్-కామెడీ ఫ్రాంచైజీ

19) ‘పేట్రియాట్‌ (మలయాళం) - మమ్మూట్టీ, మోహన్‌లాల్

20) రోమియో (హిందీ):  షాహిద్ కపూర్

Videos

మహారాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం

CM Revanth : ఇదేనా నీ 40 ఏళ్ల రాజకీయ చరిత్ర

సాల్మన్ పాడె మోసిన మహేష్ రెడ్డి

Medak: భార్యను కాపురానికి పంపలేదని..

Anantapur : నంబూరి వైన్స్ కేసులో ముగ్గరు టీడీపీ కార్యకర్తలు అరెస్ట్

Rachamallu: రమ్మీ, గుండాట, రికార్డింగ్ డాన్సులు ఏపీని గోవాగా మార్చేశారు

ఈనెల 19న మధ్యాహ్నం నామినేషన్ల స్వీకరణ

Peddareddy : ఎక్కడికి రమ్మంటావ్..ప్లేస్ చెప్పు నేనేంటో చూపిస్తా

YS Jagan: కోనసీమ ప్రజలకు శుభాకాంక్షలు

నాచారంలో దారుణం జరిగింది. అన్నను తమ్ముడు హత్య

Photos

+5

థాయ్‌లాండ్‌లో సంక్రాంతికి వస్తున్నాం బ్యూటీ బర్త్‌ డే సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

హీరోయిన్ లయ సంక్రాంతి బొమ్మల కొలువు (ఫోటోలు)

+5

సంక్రాంతి పతంగులు ఎగరేస్తోన్న అనసూయ (ఫోటోలు)

+5

సంక్రాంతి సంబురాల్లో సినీ ప్రముఖులు (ఫోటోలు)

+5

ప్రముఖ సినీ నిర్మాత 'అచ్చిరెడ్డి' బర్త్‌డే వేడుకలో సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

థ్యాంక్స్‌ మీట్‌లో 'మన శంకర వరప్రసాద్ గారు' చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

భోగి మంటల్లో బాబుగారి జీవో.. చిత్రాలు

+5

శిల్పారామంలో సంక్రాంతి సంబరాల సందడి (ఫొటోలు)

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)