గుడివాడ అమర్నాథ్ ఇంట్లో భోగి సంబరాలు
Breaking News
ఒక్క సీన్‌తో వైరల్.. 'టాక్సిక్' బ్యూటీ ఇన్‌స్టా డిలీట్
Published on Wed, 01/14/2026 - 11:49
కన్నడ స్టార్ హీరో యశ్ కొత్త సినిమా టాక్సిక్ టీజర్ పాన్ ఇండియా రేంజ్‌లో హీట్ పెంచుతుంది. టీజర్‌లో ఉన్న ఇంటిమేట్ సీన్‌పై మహిళా సంఘాలు తీవ్రమైన అభ్యంతరం తెలిపాయి. యశ్‌తో పాటు బోల్డ్ సీన్‌లో కనిపించిన బీట్రీజ్ టోఫెన్ బాఖ్ (Beatriz Taufenbach) తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాను తొలగించింది. తన ఇంటిమేట్ సీన్స్‌పై వివాదాలు రావడం వల్లనే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీని దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.

టాక్సిక్ టీజర్‌లో చాలా బోల్డ్‌గా నటించిన తర్వాత ఆమె గురించి తెలుసుకోవాలని నెటిజన్లు పోటీపడ్డారు. ఈ క్రమంలో దర్శకురాలు గీతూ మోహన్‌దాస్ ఆమె వివరాలు షేర్ చేశారు. దీంతో ఆమె పేరు బీట్రీజ్ బాఖ్ అని పంచుకున్నారు. హాలీవుడ్‌లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు ఇదే ఫస్ట్ ఇండియన్ సినిమా... దీంతో ఆమెకు భారీగా ఫాలోవర్స్ పెరిగారు. జనవరి 13 వరకు ఆమె ఖాతా యాక్టివ్‌గానే ఉంది. కానీ, సెడెన్‌గా ఇన్‌స్టాగ్రామ్‌లో ఆమె ఖాతా కనిపించకపోవడంతో నెటిజన్లు ఈ విషయాన్ని షేర్ చేస్తున్నారు.
Tags : 1