Breaking News

ఈ సంక్రాంతి కూడా నాకో మంచి జ్ఞాపకం: దర్శకుడు అనిల్‌ రావిపూడి

Published on Wed, 01/14/2026 - 00:30

‘‘2026 సంక్రాంతిని కూడా నాకు ఇంత మెమొరబుల్‌గా చేసిన ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. మళ్లీ మళ్లీ ఇలాంటి మంచి సినిమాలతో మీకు ఆనందాన్ని ఇచ్చి, కృతజ్ఞతలు తెలియజేసుకుంటా. నా కెరీర్‌లో చాలా వేగంగా  25 రోజుల్లో పూర్తి చేసిన స్క్రిప్ట్‌ ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నేను రాసిన ప్రతి సీన్‌కి స్ఫూర్తి చిరంజీవిగారే... అందుకే ఆ ఘనత మొత్తం చిరంజీవిగారికి ఇస్తాను’’ అని అనిల్‌ రావిపూడి చెప్పారు.

చిరంజీవి హీరోగా నటించిన చిత్రం ‘మన శంకరవరప్రసాద్‌గారు’. నయనతార హీరోయిన్‌గా నటించగా, వెంకటేశ్‌ ముఖ్య పాత్ర చేశారు. సాహు గారపాటి, సుష్మిత కొణిదెల నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా మంగళవారం నిర్వహించిన మెగా బ్లాక్‌బస్టర్‌ థ్యాంక్‌ యూ మీట్‌లో చిత్రదర్శకుడు అనిల్‌ రావిపూడి మాట్లాడుతూ– ‘‘చిరంజీవిగారితో పని చేసిన 85 రోజుల్లో ప్రతి రోజూ ఒక బ్యూటిఫుల్‌ మెమొరీ.

సంక్రాంతి వసూళ్లపరంగా మా నిర్మాతలు సాహు, సుష్మిత సంతోషపడాలి. ప్రేక్షకులు ఎంత సంతోషపడ్డారో అలా డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్‌ అందరూ ఆనందపడాలి. వెంకీ గౌడ పాత్రని ఒప్పుకున్నందుకు వెంకటేశ్‌గారికి హ్యాట్సాఫ్‌’’ అని తెలిపారు. ‘‘ప్రేక్షకులు మా సినిమాని అద్భుతంగా ఆస్వాదిస్తున్నారు’’ అని సాహు గారపాటి అన్నారు. సుష్మిత కొణిదెల మాట్లాడుతూ– ‘‘ఈ సినిమా లాంచింగ్‌ సమయంలో నాన్నగారు నా పేరు అడిగితే... సుష్మిత కొణిదెల అని చెప్పాను. ‘ఆ పేరు నిలబెట్టుకో’ అన్నారు. ఇప్పుడు ఆ పేరు నిలబెట్టుకున్నాను అనుకుంటున్నాను’’ అని చెప్పారు. సంగీత దర్శకుడు భీమ్స్, నటులు హర్షవర్ధన్, అభినవ్, శ్రీనివాస రెడ్డి, సాయి శ్రీనివాస్, ఎగ్జిక్యూటివ్‌ ప్రోడ్యూసర్‌ సాయికృష్ణ, కెమెరామేన్‌ సమీర్‌ రెడ్డి, పాటల రచయితలు రామజోగయ్య శాస్త్రి, కాసర్ల శ్యామ్‌ తదితరులు పాల్గొన్నారు.

Videos

విభజన హామీలు ముగిశాయనే వాళ్లు ఆంధ్రా ద్రోహులు: చలసాని

Ravi Chandra : లోకేష్ రెడీగా ఉండు.. నీ కాలర్ పట్టుకోవడానికి రెడీగా ఉన్నారు

చిరంజీవి సినిమాలో హీరోయిన్ గా ఐశ్వర్య రాయ్..?

Talasani : మా ఆత్మగౌరవంపై దెబ్బ కొడితే చూస్తూ ఊరుకోం

Satish Reddy: కేసులో మాఫీ చేసుకుని సంబరపడకు YSRCP నిన్ను వదిలిపెట్టదు

గ్రీన్ లాండ్ విలీనం కోసం బిల్లు తెచ్చిన అమెరికా

Kannababu : 8 కేసులు ఎత్తేశారు..ED పెట్టిన కేసులో గోల్ మాల్

విజయవాడ హైవేపై లారీ బోల్తా పల్టీ కొట్టిన కట్టెల లోడ్ లారీ

Achanta: ఎమ్మెల్యే సేవలో ఎంపీడీవో.. గుండెపోటు నాటకం?

CCTV Footage: కోనసీమలో కారు బీభత్సం

Photos

+5

గ్రాండ్‌గా కృతి సనన్ సిస్టర్‌ నుపుర్ సనన్ పెళ్లి వేడుక (ఫొటోలు)

+5

చంద్రబాబుకు మాత్రమే తెలిసిన స్కిల్‌ ఇది (ఫొటో స్టోరీ)

+5

'నారీ నారీ నడుమ మురారి' మూవీ ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

'అనగనగా ఒక రాజు' మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

అందంగా కవ్విస్తూనే యాక్షన్‌ మోడల్‌లో రాజాసాబ్‌ బ్యూటీ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న సీనియర్‌ నటులు విజయకుమార్ (ఫోటోలు)

+5

ప్రముఖ నటుడికి సన్మానం.. హాజరైన మీనా (ఫోటోలు)

+5

ఒకే ఫ్రేమ్‌లో నమ్రత, లక్ష్మీ ప్రణతి (ఫోటోలు)

+5

పతంగులు ఎగురవేసిన ప్రధాని మోదీ, జర్మనీ ఛాన్సలర్ మెర్జ్ (ఫోటోలు)

+5

పెళ్లి తర్వాత మరింత కళగా సమంత (ఫోటోలు)