Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
కాంబో సూపర్ హిట్.. డైరెక్టర్‌కు మెగాస్టార్ అభినందనలు
Published on Mon, 01/12/2026 - 18:09
మెగాస్టార్ చిరంజీవి- అనిల్ రావిపూడి కాంబోలో వచ్చిన చిత్రం 'మనశంకర వరప్రసాద్‌గారు'. ఈ మూవీ సంక్రాంతి కానుకగా ఈ రోజే థియేటర్లలో విడుదలైంది. తొలిసారి వీరిద్దరి కాంబోలో వస్తోన్న మూవీ కావడంతో ఫ్యాన్స్‌లోనూ భారీ అంచనాలు ఏర్పడ్డాయి. ఇవాళ విడుదలైన ఈ సినిమాకు అందుకు తగ్గట్టుగానే పాజిటివ్ టాక్ వస్తోంది. తొలి షో నుంచే ఆడియన్స్ నుంచి సూపర్ హిట్ అనే కామెంట్స్ వస్తున్నాయి. దీంతో మూవీ టీమ్ సంబురాల్లో మునిగిపోయింది.
మనశంకర వరప్రసాద్ గారు మూవీకి హిట్ టాక్ రావడంతో అనిల్ రావిపూడిని మెగాస్టార్ అభినందించారు. చిరు హత్తుకున్న వీడియోను డైరెక్టర్ అనిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా మెగాస్టార్ స్వీట్స్ తినిపించారు. ఈ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ సూపర్ హిట్ కాంబో అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఈ చిత్రంలో నయనతార హీరోయిన్‌గా నటించగా.. వెంకీమామ కీలక పాత్రలో మెరిశారు.
Cherishing moments with Megastar @KChiruTweets garu for team #ManaShankaraVaraPrasadGaru ❤️🔥✨
Experience the BIGGEST FAMILY ENTERTAINER of Sankranthi 2026 in cinemas 💥#MegaBlockbusterMSG IN CINEMAS NOW ❤️ pic.twitter.com/dhcbC4L7pL— Shine Screens (@Shine_Screens) January 12, 2026
Sometimes, words aren’t needed at all ❤️🤗#ManaShankaraVaraPrasadGaru pic.twitter.com/wWZ77wGUIH
— Anil Ravipudi (@AnilRavipudi) January 12, 2026
Tags : 1