Bolla Brahmanaidu: సంబంధం లేని వ్యక్తులను అన్యాయంగా అరెస్ట్ చేస్తున్నారు..
Breaking News
భారీగా పడిపోయిన రాజాసాబ్ కలెక్షన్స్.. 3 రోజుల్లో ఎంతంటే?
Published on Mon, 01/12/2026 - 16:04
డార్లింగ్ ప్రభాస్ నటించిన ఫస్ట్ అండ్ లేటెస్ట్ హారర్ మూవీ ది రాజాసాబ్. మారుతి దర్శకత్వం వహించిన ఈ మూవీ భారీ అంచనాల మధ్య జనవరి 9న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫస్ట్ షో నుంచే మిక్స్‌డ్ టాక్ అందుకున్నప్పటికీ తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.112 కోట్లు రాబట్టింది.
మూడురోజుల్లో ఎంతంటే?
అయితే తర్వాతి రోజు నుంచి మాత్రం వసూళ్లు భారీగా పడిపోయాయి. మూడు రోజుల్లో ఈ మూవీ రూ.183 కోట్లు కోట్లు మాత్రమే వసూలు చేసింది. చూస్తుంటే పెట్టిన పెట్టుబడి రావడం కూడా కష్టంగానే కనిపిస్తోంది. పైగా సోమవారం (జనవరి 12) నాడు చిరంజీవి మన శంకర వరప్రసాద్ రిలీజైంది. ఈ సినిమా బ్లాక్‌భస్టర్ టాక్‌తో దూసుకుపోతోంది. దీంతో రాజాసాబ్ వసూళ్లకు పెద్ద దెబ్బే పడేట్లు కనిపిస్తోంది.
సినిమా
మరి సంక్రాంతి బరిలోని సినిమాల పోటీని తట్టుకుని రాజాసాబ్ నిలుస్తాడా? ఫైనల్‌గా ఎన్నికోట్ల మేర కలెక్షన్స్ రాబడతాడో చూడాలి! ది రాజాసాబ్ మూవీ విషయానికి వస్తే.. మాళవిక మోహనన్, రిద్ధి కుమార్, నిధి అగర్వాల్ హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.450 కోట్ల బడ్జెట్‌తో పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టీజీ విశ్వప్రసాద్ నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు.
A festival treat turned BOX OFFICE CARNAGE ❤️🔥❤️🔥#TheRajaSaab crosses 183+ Crores Worldwide Gross in just 3 days 🔥🔥
&
Gears up for the Sankranthi festive week with massive audience love ❤️❤️#BlockbusterTheRajaSaab #Prabhas @directormaruthi @musicthaman @peoplemediafcy… pic.twitter.com/KW6pv2nGkZ— People Media Factory (@peoplemediafcy) January 12, 2026
చదవండి: ది రాజాసాబ్ రివ్యూ కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Tags : 1