Breaking News

నా జీవితంలో ప్రత్యేకమైన రోజు.. పుట్టినందుకు థాంక్స్‌

Published on Sun, 01/11/2026 - 13:20

ట్రోలింగ్‌ను ఎదుర్కోని హీరో లేడు. కెరీర్‌ తొలినాళ్లలో దారుణమైన ట్రోల్స్‌ చూశాడు అల్లు అర్జున్‌. 'గంగోత్రి' సినిమాలో అతడు ఆడవేషం కడితే అందరూ పడీపడీ నవ్వారు. అదే అల్లు అర్జున్‌ 'పుష్ప 2' మూవీలో చీరకట్టి తాండవం చేస్తే అదుర్స్‌ అంటూ ప్రశంసల వర్షం కురిపించారు.

నాలుగు సార్లు రిపీట్‌
హీరోగా తన తొలి సినిమా గంగోత్రితో ఎన్నో విమర్శలను ఎదుర్కొన్న బన్నీ తర్వాతి మూవీ 'ఆర్య'తో తనేంటో నిరూపించుకున్నాడు. ఈ సినిమాతోనే సుకుమార్‌ దర్శకుడిగా పరిచయమయ్యాడు. 'ఆర్య 2'తో వీరి కాంబినేషన్‌ మరోసారి హిట్టు అని నిరూపితమైంది. ఆ ధైర్యంతోనే ముచ్చటగా మూడోసారి జత కట్టి 'పుష్ప' సినిమా తీశారు. ఇది పాన్‌ ఇండియా స్థాయిలో ఆదరణ పొందడంతో పాటు భారీగా కలెక్షన్స్‌ కొల్లగొట్టింది. 

ఎనలేని గౌరవం
పుష్పకు సీక్వెల్‌గా వచ్చిన 'పుష్ప 2' చిత్రం అయితే రికార్డులు తిరగరాసింది. అల్లు అర్జున్‌ను తిరుగులేని పాన్‌ ఇండియా స్టార్‌గా నిలబెట్టింది. తనకు ఇంత గుర్తింపు తీసుకొచ్చిన సుకుమార్‌ అంటే బన్నీకి ఎనలేని గౌరవం. తన కెరీర్‌ తారాజువ్వలా వెలగడానికి ఆయనే కారణమని బలంగా నమ్ముతాడు. ఈరోజు (జనవరి 11న) సుకుమార్‌ పుట్టినరోజు. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌ ఎక్స్‌ (ట్విటర్‌) వేదికగా ఎమోషనల్‌ పోస్ట్‌ పెట్టాడు.

నా జీవితాన్ని మార్చేసిన రోజు 
హ్యాపీ బర్త్‌డే డార్లింగ్‌.. ఈరోజు నీకంటే కూడా నాకే ఎంతో ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే నా జీవితాన్ని మార్చేసిన రోజు ఇదే! నువ్వు నా జీవితంలో ప్రసాదించిన సంతోషాన్ని మాటల్లో చెప్పలేను. పుట్టినందుకు థాంక్స్‌ సుకుమార్‌ అంటూ రెండు ఫోటోలు షేర్‌ చేశాడు. ఈ పోస్ట్‌ కింద అభిమానులు 'పుష్ప 3' కోసం వెయిటింగ్‌ అని కామెంట్లు చేస్తున్నారు.

 

 

చదవండి: పొగిడినా, విమర్శించినా నవ్వుతా: అనిల్‌ రావిపూడి

Videos

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)