Breaking News

ప్రభాస్ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. కొత్తగా ఆ సీన్స్‌..!

Published on Sun, 01/11/2026 - 01:08

ది రాజాసాబ్ మూవీతో తీవ్ర నిరాశలో ఫ్యాన్స్‌కు డైరెక్టర్ మారుతి గుడ్ న్యూస్ చెప్పారు. ఈ చిత్రంలో కొత్తగా ఎనిమిది నిమిషాల పాటు సీన్స్ యాడ్ చేస్తున్నట్లు తెలిపారు. ఈ సీన్స్‌లో ప్రభాస్ ఓల్డ్ లుక్ కూడా ఉంటుందని అభిమానులకు శుభవార్త చెప్పారు. దీంతో రెబల్ స్టార్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. తాజాగా నిర్వహించిన బ్లాక్‌బస్టర్ మీట్‌లో మారుతి క్లారిటీ ఇచ్చారు. ది రాజాసాబ్‌లో ప్రభాస్‌ను కొత్తగా చూపించామని మారుతి అన్నారు.

మారుతి మాట్లాడుతూ..' హైదరాబాద్‌లో షో సరైన టైమ్‌లో పడలేదు. అందుకు నన్ను క్షమించండి. ఏది ఏమైనా ఈ అవకాశం ఇచ్చిన ప్రభాస్‌కు జీవితాంతం రుణపడి ఉంటా. ఒక మిడ్‌ రేంజ్‌ దర్శకుడు ప్రభాస్‌ సినిమా తీశాడనిపించేలా చేశారు. ప్రభాస్‌ను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటున్నారో అలానే చూపించా. ఈ ప్రక్రియలో కాస్త కొత్తగా చూపించాలనుకున్నా. మైండ్‌ గేమ్‌గా సాగే క్లైమాక్స్‌ ఇప్పటివరకూ రాలేదని అందరూ అంటున్నారు. చివరి 40 నిమిషాలు ప్రేక్షకులకు నచ్చేసింది. ఇండియన్‌ స్క్రీన్‌పై ఇలాంటి నేపథ్యంతో మూవీ రాలేదంటున్నారు. ప్రభాస్‌తో నేను సింపుల్‌గా కమర్షియల్‌ సినిమా తీయొచ్చు కానీ.. ఇలాంటి కొత్త కథలను పెద్ద హీరోలు చేయాలని ఆయన ప్రయత్నించారు. కామన్‌ ఆడియన్స్‌కు చాలా మందికి ఈ సినిమా రీచ్ అయింది. ఒక్క షో, ఒక్కరోజులోనే సినిమాను నిర్ణయించకూడదు' అన్నారు.

పదిరోజులు ఆగితేనే సినిమా ఏంటనేది తెలుస్తుందని డైరెక్టర్ మారుతి అన్నారు. ఈ మూవీలోని కొత్త పాయింట్‌ గురించి అందరూ మాట్లాడుకుంటున్నారని.. అర్థం కానీ వాళ్లే తిడుతున్నారని అన్నారు. ఓల్డ్‌ గెటప్‌లో ఉన్న ప్రభాస్‌ను టీజర్‌, పోస్టర్స్‌లో చూపించాం.. కానీ సినిమాలో కనిపించలేదని అభిమానులు చాలా మంది ఎంజాయ్‌ చేయలేకపోయారు. వాళ్ల కోసమే ఈరోజు సాయంత్రం నుంచి ఆ లుక్‌ ఉన్న సన్నివేశాలు యాడ్‌ చేస్తున్నామని తెలిపారు. సెకండ్‌ హాఫ్‌లో కొన్ని సన్నివేశాలు తగ్గించి వీటిని యాడ్‌ చేస్తున్నాం.. వాటికి సెన్సార్‌ కూడా పూర్తయిందన్నారు. కొత్తగా మొత్తం 8 నిమిషాల సీన్స్‌ యాడ్‌ అవుతాయని మారుతి వెల్లడించారు. 
 

 

Videos

జగన్ పేరు వింటే మీ ముగ్గురికి కలలో కూడా ఇది పడుతుంది

ఎవరూ అధైర్య పడకండి.. మన వెనుక జగనన్న ఉన్నాడు

సినిమా రిజల్ట్ ఒక్కరోజులోనే డిసైడ్ చేయడం కరెక్ట్ కాదు

ABN కాదు TDP ఛానల్ అని పెట్టుకోండి.. రాధాకృష్ణ, వెంకట్ కృష్ణను అరెస్ట్ చెయ్యాలి

మా రోజమ్మ గురించి పిచ్చి పిచ్చిగా వాగితే.. జనసేన నేతలకు YSRCP నేతలు వార్నింగ్

24 గంటలే టైమ్ ఇస్తున్నా.. మీ భరతం పడతా బిడ్డా

తప్పిపోయిన పాపను చేరదీసిన మంత్రి సీతక్క

బంగారాన్ని వెండి మించిపోతుందా? వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానంలో ఏం చెప్పారు?

థియేటర్లు బ్లాస్ట్ అయిపోతాయి

కాకాణి పై పోలీసుల అత్యుత్సాహం

Photos

+5

‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ మూవీ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

భార్య బర్త్‌డే సెలబ్రేట్‌ చేసిన నితిన్‌ (ఫోటోలు)

+5

Anasuya: మొన్నటిదాకా ట్రెండీగా.. ఇప్పుడు ట్రెడిషనల్‌గా (ఫోటోలు)

+5

శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

సంక్రాంతికి.. సొంతూరికి.. (ఫోటోలు)

+5

రంగవల్లికలు.. సప్తవర్ణ మల్లికలై (ఫోటోలు)

+5

'ది రాజా సాబ్‌' స్పెషల్‌ మీట్‌లో సందడిగా చిత్ర యూనిట్‌ (ఫోటోలు)

+5

మిసెస్‌ ఇండియా పోటీల్లో మెరిసిన తెలంగాణ క్వీన్స్ (ఫోటోలు)

+5

సంక్రాంతి జోష్‌.. వాహనాల రద్దీతో రోడ్లు ఫుల్‌ (ఫొటోలు)

+5

సాక్షి-ఎస్పీఆర్‌ ఆధ్వర్యంలో ఉత్సాహంగా ముగ్గుల పోటీలు (ఫోటోలు)