నిన్ను బతకనీయను.. కార్యకర్త తలపై ఇనుప రాడ్డుతో టీడీపీ నేత దాడి
Breaking News
జోహో ఫౌండర్ విడాకులు: తెరపైకి రూ.15వేల కోట్ల వివాదం!
Published on Sat, 01/10/2026 - 20:51
జోహో ఫౌండర్.. టెక్ దిగ్గజం 'శ్రీధర్ వెంబు'.. ఆయన భార్య 'ప్రమీలా శ్రీనివాసన్' విడాకుల విషయం మరోసారి తెరపైకి వచ్చింది. ఓ వ్యాపారవేత్త వ్యక్తిగత జీవితం, కంపెనీ ఆస్తుల మధ్య జరుగుతున్న ఈ వివాదం ప్రస్తుతం.. కార్పొరేట్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
శ్రీధర్ వెంబు తన వద్ద ఉండే.. జోహో కంపెనీ షేర్స్ భార్యకు (ప్రమీలా శ్రీనివాసన్) తెలియకుండా.. బంధువులకు బదిలీ చేశారనేది ఆరోపణ. కంపెనీలో ఆమెకు రావాల్సిన వాటా.. రాకుండా చేయడానికే ఈ విధమైన బదిలీలు జరిగాయని అమెరికా కోర్టులో వాదనలు జరుగుతున్నాయి. ఈ సమయంలోనే రూ.15వేల కోట్ల విలువైన ఆర్థిక లావాదేవీలు, బాండ్ల బదిలీ అంశం తెరపైకి వచ్చింది.
ఒకప్పుడు ఆదర్శ దంపతులుగా అనోన్య జీవితం సాగించిన శ్రీధర్ వెంబు, ప్రమీలా శ్రీనివాసన్ కొన్ని అనివార్య కారణాల వల్ల విడాకులు తీసుకున్నారు. ఈ తరువాత శ్రీధర్ వెంబు ఇండియా వచ్చేసారు. ఇప్పుడు వీరిమధ్య ఆస్తుల పంపకం, నమ్మకద్రోహం అనే అంశాలపై తీవ్రమైన చర్చ జరుగుతోంది.
ప్రమీలా శ్రీనివాసన్ చేస్తున్న ఆరోపణలను శ్రీధర్ వెంబు ఖండించారు. నేను ఎప్పుడూ భార్య, బిడ్డకు (కుమారుడు) అన్యాయం చేయలేదు. నా ప్రతిష్టను దెబ్బతీయడానికి, కేవలం డబ్బు కోసం జరుగుతున్న డ్రామా అని అన్నారు. నేను బదిలీ చేసిన షేర్స్ అన్నీ.. చట్టబద్ధంగా జరిగినవే అని పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ వివాదం జోహో కంపెనీ ఇన్వెస్టర్లలో ఆందోళన రేకెత్తించింది.
ఆటిజంతో బాధపడుతున్న తన కుమారుని భవిష్యత్తు కోసం నేను పోరాడుతున్నాను అని.. మరోవైపు ప్రమీలా శ్రీనివాసన్ చెబుతున్నారు. ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందిస్తున్నారు. ఒక కంపెనీ అధినేత జీవితం.. సంస్థ భవిష్యత్తును ఎలా ప్రభావితం చేస్తుందనే దానికి ఇది ఒక ఉదాహరణ అని కొందరు చెబుతున్నారు.
ఇదీ చదవండి: H-1B వీసా కొత్త ఫీజులు.. మార్చి 1 నుంచి అమల్లోకి!
Tags : 1