Breaking News

ఈ హీరోకు తొలిసారి రూ.75 కోట్ల బడ్జెట్‌!

Published on Mon, 01/05/2026 - 08:25

హాస్యనటుడిగా కెరీర్‌ ప్రారంభించి, కథానాయకుడిగా అవతారమెత్తిన నటుడు సూరి. ఈయన హీరోగా నటించి విడుదలైన గరుడన్‌, మామన్‌ చిత్రాలు మంచి విజయాన్ని సాధించాయి. తాజాగా సూరి కథానాయకుడిగా నటిస్తున్న చిత్రం మండాడి. ఆర్‌ఎస్‌ ఇన్ఫోటెయిన్‌మెంట్‌ పతాకంపై రూపొందుతున్న ఈ చిత్రానికి మదిమారన్‌ పుహళేంది దర్శకత్వం వహిస్తున్నారు. 

ఇది సముద్ర తీరంలో జరిగే జాలర్ల బోటు పందేల ఇతివృత్తంతో తెరకెక్కిస్తున్న సినిమా. ఇందులో సూరి జాలరిగా నటిస్తున్నారు. ఈ పాత్ర కోసం ఆయన చాలా వర్కౌట్‌ చేసి పూర్తిగా మారిపోయారు. రూ.75 కోట్లతో రూపొందుతున్న మండాడి సూరి కెరీర్‌లోనే అత్యంత భారీ బడ్జెట్‌ చిత్రమని యూనిట్‌ సభ్యులు తెలిపారు. 

ఈ మూవీలోని యాక్షన్‌ సన్నివేశాలను అంతర్జాతీయ స్టంట్‌ నిపుణులతో ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ హెయిన్‌ 40 రోజులపాటు చిత్రికరించినట్లు చెప్పారు. చిత్రంలోని బోటు ఫైట్‌ సన్నివేశాలు థ్రిల్లింగ్‌గా ఉంటాయన్నారు. దీనికి ప్రకాష్‌కుమార్‌ సంగీతం మరింత బలాన్ని చేకూర్చిందన్నారు. ఈ చిత్రాన్ని సమ్మర్‌ స్పెషల్‌గా రిలీజ్‌ చేయడానికి సన్నాహాలు చేస్తున్నట్లు యూనిట్‌ వర్గాలు మీడియాకు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొన్నాయి.

Videos

క్లోజ్డ్ రూమ్ లో కన్నింగ్ ప్లాన్.. అసెంబ్లీ సాక్షిగా అంతా బాబే చేశాడు..

'బేబి' వైష్ణవి చైతన్య క్యూట్ ఫొటోలు

Gadikota Srikanth : రాయలసీమ ప్రాంతంపై ఎందుకింత ద్వేషం చంద్రబాబు

NEW RECORD: రూ.3 లక్షల కోట్లు దాటేసిన చంద్రబాబు అప్పులు

TVK అధినేత విజయ్ కు సీబీఐ నోటీసులు..

Tirumala: చిరంజీవి సతీమణి సురేఖకు అవమానం...పవన్ రియాక్షన్!

Mayor Rayana: మీది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం

Konasema: బయటపడుతున్న సంచలన విషయాలు..

ఏపీ-తెలంగాణ జల వివాదంపై స్పందించిన ఏపీ బీజేపీ చీఫ్ మాధవ్

YSRCP Leaders: ఇది చేతగాకే.. ఓయబ్బో అని చేతులెత్తేశావ్..

Photos

+5

గోవాలో బీచ్ ఒడ్డున హీరోయిన్ రాశీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

కత్రినా కైఫ్ చెల్లిని ఎప్పుడైనా చూశారా? (ఫొటోలు)

+5

జపనీస్ చెఫ్ స్పెషల్.. చరణ్ ఇంట్లో బిర్యానీ పార్టీ! (ఫొటోలు)

+5

ఎ.ఆర్. రెహమాన్ బర్త్‌డే వేడుకలు.. సందడిగా సెలబ్రిటీలు (ఫోటోలు)

+5

జగజ్జేతలకు సన్మానం.. ప్రత్యేక ఆకర్షణగా రోహిత్‌, హర్మన్‌

+5

Sankranti 2026 : పల్లె గాలిలో రుచుల పండుగ (ఫొటోలు)

+5

కోనసీమ గుండెల్లో బ్లో అవుట్‌ మంటలు (ఫోటోలు)

+5

సందడిగా సాక్షి ముగ్గుల పోటీలు (ఫొటోలు)

+5

'వామ్మో వాయ్యో' సాంగ్.. తెర వెనక ఆషిక ఇలా (ఫొటోలు)

+5

దీపికా పదుకోణె బర్త్‌డే స్పెషల్‌.. వైరల్‌ ఫోటోలు ఇవే