అల్లు అర్జున్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ మూవీ..?
Breaking News
డిజాస్టర్ దర్శకుడితో పవన్ కల్యాణ్ సినిమా
Published on Thu, 01/01/2026 - 11:50
పవన్ కల్యాణ్ హీరోగా, సురేందర్ రెడ్డి దర్శకత్వంలో కొత్త సినిమాను ప్రకటించారు. జనసేన ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్లూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. తాజాగా అధికారికంగా ప్రకటించారు. ఈ మూవీలో పవన్ విభిన్నమైన పాత్రలో కనిపించనున్నారు. వీరి కాంబినేషన్‌లో సినిమా వస్తుందని చాలారోజుల క్రితమే ప్రకటించారు.
దర్శకుడు సురేంద్ర రెడ్డి 2023లో తెరకెక్కించిన ఏజెంట్ సినిమా భారీ డిజాస్టర్‌గా నిలిచిన విషయం తెలిసిందే. ఈ మూవీ తర్వాత ఆయన మరో సినిమా ప్రకటించలేదు. అయితే, తాజాగా పవన్ కల్యాణ్‌తో సినిమా చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది. వక్కంతం వంశీ ఈ ప్రాజెక్ట్‌కు కథ అందిస్తున్నాడు. అయితే, డైరెక్టర్ సురేందర్ రెడ్డి ఇప్పటికే రవితేజకు ఈ కథను వినిపించారని సమాచారం. పలు కారణాల వల్ల షూటింగ్ వరకు చేరలేదని టాక్ వుంది.

గతంలో ఆయన తెరకెక్కించిన సైరా నరసింహారెడ్డి, ఏజెంట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టడంతో సరైన కథ కోసం సురేంద్ర రెడ్డి ప్లాన్ చేస్తుండగా వక్కంతం వంశీ చెప్పిన కథతో పవన్ వద్దకు వెళ్లడంతో ఆయన ఓకే చేసినట్లు సమాచారం. హైదరాబాద్‌లో గన్ కల్చర్ కాన్సెప్ట్‌తో ఈ మూవీ రానుందని తెలుస్తోంది. అయితే, ఇదే స్టోరీని రవితేజకు చెబితే నో అన్నారని టాక్ ఉంది. నిర్మాత రామ్ తాళ్లూరి గతంలో రవితేజతో నేల టికెట్టు, డిస్కో రాజా చిత్రాలను నిర్మించారు.
Tags : 1