CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్..! అక్కడ న్యూ ఇయర్‌కి..
Published on Wed, 12/31/2025 - 17:03
ఈరోజుతో 2025కి గుడ్ బై చెప్పేసి..కొత్త ఏడాది 2026కి స్వాగతం పలకనున్నాం. ఈ తరుణంలో చాలామంది న్యూఇయర్ వేడుకలను మంచి సుందరమైన ప్రదేశాల్లో..సెలబ్రేట్ చేసకునేందుకు సన్నాహాలు, ప్లాన్లు వేస్తుంటారు. చాలామంది ఈపాటికి ఆయా ప్రదేశాలకు వెళ్లే హడావిడిలో ఉండి ఉంటారు కూడా. ఇక డిసెంబర్ 31 రాత్రి ఉండే సందడి, జోష్ ఓ రేంజ్లో ఉంటుంది. ఎప్పుడూ చూసే పర్యాటక ప్రదేశాలు, బీచ్‌లు, పర్వత ప్రాంతాలు కాకుండా అడవుల్లో ప్రకృతి ఒడిలో చేసుకుంటే ఆ ఫీల్ వేరేలెవెల్. దీనికి మించి బ్యూటిఫుల్ స్పాట్ ఇంకొకటి ఉండదు కూడా. అందుకోసం గాంధీ కుటుంబం మెచ్చే రణతంబోర్ నేషనల్ పార్క్‌కి చెక్కేయాల్సిందే. ఈ పార్క్ విశేషాలు, అక్కడ ఉండే రిసార్టులు, ప్రత్యేకతలు గురించి సవివరంగా తెలుసుకుందామా.
అటవీ సఫారీలకు ప్రసిద్ధి చెందిన రణతంబోర్ నేషనల్ పార్క్ న్యూఇయర్ వేడుకలకు బెస్ట్ ప్లేష్. ఇవక్క విలాసవంతమైన రిసార్ట్‌లలో వన్యప్రాణుల నడుమ ఆ సెలబ్రేషన్స్ మరింత జోష్‌ఫుల్‌గా ఉంటుంది. రాజస్థాన్‌లోని సవాయి మాధోపూర్‌లో ఉన్న రణతంబోర్ ప్రకృతి అందాలను మిళితం చేసేలా, అత్యంత ప్రైవేసిని అందించే హాలీడేస్ స్పాట్‌గా పేరొందింది. ఆ నేపథ్యంలో ప్రస్తుతం గాంధీ కుటుంబం రణతంబోర్ నేషనల్ పార్క్ సమీపంలో సవాయి మాధోపూర్‌కు చేరుకుందని అధికారిక వర్గాల సమాచారం.
ఈ కుటుంబం పులుల అభయారణ్యం సమీపంలోని ఒక ఫైవ్ స్టార్ రిసార్ట్‌లో బస చేస్తోంది. జనవరి 2 వరకు ఈ ప్రాంతంలోనే గడపనున్నారనేది సన్నిహిత వర్గాల సమాచారం. అదీగాక ప్రియాంక గాంధీ- రాబర్ట్ వాద్రాల కుమారుడు రైహాన్ వాద్రా తన ఏడేళ్ల స్నేహితురాలు, ఢిల్లీకి చెందిన అవివా బేగ్‌తో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది న్యూయర్ వేడుకలు మరింత స్పెషల్ ప్రియాంక గాంధీ కుటుంబానికి.
ప్రత్యేకతలు..
పెద్దపులులకు నిలయం ఈ పార్క్. ఇక గాంధీ కుటుంబం ఈ పార్క్ సమీపంలోని ప్రత్యేకమైన లగ్జరీ సఫారీ క్యాంపులలో ఒకటైన సుజాన్ షేర్ బాగ్‌లో బస చేస్తోంది. అభయారణ్యం అంచున ఉన్న ఈ ప్రదేశం పాతకాలపు వన్య ప్రాణులకు గమ్యస్థానం. అలాగే ఇది 1920ల నాటి వలసవాద శైలి జంగిల్ క్యాంప్ లాగా ఉంటుంది. ఇక్కడ చేతితో తయారు చేసిన పది లగ్జరీ టెంట్లు, విల్లాలు కూడా ఉంటాయి.
అక్కడ వ్యక్తిగత ఏకాంతానికి, విహారయాత్రకు అత్యంత అనువైనది కూడా. ప్రతి సూట్లో అత్యాధునిక సౌకర్యాలు, పూర్వకాలపు డిజైన్ల ఆకర్షణతో కట్టిపడేస్తోంది. ఇక్కడ పూర్తి ఎయిర్ కండిషనింగ్, వైఫై, వాలెట్ సేవలు, స్విమ్మింగ్ పూల్ వంటి అన్ని సౌకర్యాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఒక్క రాత్రికి బస దాదాపు రూ. 2 లక్షలు పైనే ఖర్చవుతుంది. రణతంబోర్‌లోని అత్యంత ప్రీమియం న్యూ ఇయర్ బసలలో ఒకటి ఇది. కాగా న్యూఇయర్ వేడుకలకు మంచి గమ్యస్థానమైనీ రణతంబోర్ ఉద్యానవనంని రాహుల్ సందర్శించడం రెండోసారి కాగా, ప్రియాంక-వాద్రాలకు ఇది మూడోసారి.
(చదవండి: ఒకప్పుడు భిక్షాటన..ఇవాళ బిలియనీర్‌గా ఏకంగా రూ. 40 కోట్ల..!)
Tags : 1