Breaking News

‘ఛాంపియన్’లో ఈ నటుడిని గుర్తుపట్టారా?

Published on Wed, 12/31/2025 - 16:00

టాలీవుడ్ సీనియర్ నటుడు శ్రీకాంత్ వారసుడు రోషన్ మేకా హీరోగా నటించిన తాజా చిత్రం ఛాంపియన్. పీరియాడికల్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ఈ నెల 25న విడుదలై పాజిటిట్‌ టాక్‌ని సంపాదించుకుంది. తెలంగాణ సాయుధ పోరాటాన్ని ఓ ఆటగాడి నేపథ్యంలో చూపిస్తూనే.. ఓ చక్కని ప్రేమ కథను చెప్పారు. ఈ చిత్రంలోని రంగయ్య పాత్ర అందరిని ఆకట్టుకుంది. తక్కువ నిడివే ఉన్నప్పటికీ..సినిమా చూసినవాళ్లకు ఆ పాత్ర కూడా గుర్తిండిపోతుంది. బడుగు బలహీన వర్గాలకు ప్రతీకగా నిలిచిన ఆ కారెక్టర్‌లో నటించింది విజయ్‌ దేవరకొండ మేనమామ యశ్‌ రంగినేని.

నిర్మాతగా హిట్‌ సినిమాలు!
యశ్ రంగినేని నిర్మాతగా టాలీవుడ్‌లోకి అడుగుపెట్టాడు.  బిగ్ బెన్ సినిమాస్ బ్యానర్‌‌ను స్థాపించి తన మేనల్లుడైన విజయ్ దేవరకొండతో ‘పెళ్లి చూపులు’ చిత్రానీ నిర్మించారు. ఆ తరువాత ఆయన నిర్మాతగా దొరసాని, డియర్ కామ్రేడ్, ఏబీసీడీ, అన్నపూర్ణ ఫోటో స్టూడియో, భాగ్ సాలే వంటి చిత్రాల్ని తెలుగు ఆడియెన్స్‌కి అందించారు. ఆయన నిర్మించిన ‘పెళ్లి చూపులు’ చిత్రానికి జాతీయస్థాయిలో అవార్డులు వచ్చాయి.

నటన పై ఇష్టంతో..
నిర్మాతగా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. యశ్‌కి నటన అంటే చాలా ఇష్టం. అందుకే వచ్చిన అవకాశం వదులుకోలేదు. ఛాంపియన్‌లో వీరయ్య పాత్ర కోసం తనను సంప్రదించగానే.. కథ నచ్చి వెంటనే ఓకే చెప్పేశాడట. ఓ చదువు రాని వ్యక్తిగా, గ్రామీణ జీవితాలకు, అణగారిన వర్గాలకు ప్రతినిధిగా  వీరయ్య పాత్రలో యశ్ రంగినేని ఒదిగిపోయారు. తక్కువ మాట్లాడుతూ.. ఎక్కువ గ్రహించడం, లోలోపల అగ్ని జ్వాలలు రగిలేట్టుగా భావాలతో ఉండే ఈ పాత్రలో యశ్ రంగినేని చక్కగా నటించారు. ప్రస్తుతం ఈ చిత్రం థియేటర్లో సక్సెస్ ఫుల్‌గా దూసుకుపోతోన్న సంగతి తెలిసిందే.
 

Videos

CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ

నెలకో డ్రామా, రోజుకో అబద్దం... రక్షించాల్సిన పాలకులు.

వనమిత్ర యాప్ పేరుతో సచివాలయ ఉద్యోగులకు వేధింపులు

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ సెలబ్రిటీలు (ఫొటోలు)

ఫుల్ ఫోకస్ లో ఉన్నాం ఏం చేయాలో అది చేస్తాం..

చైనాకు భారత్ బిగ్ షాక్ మూడేళ్లు తప్పదు

బాలీవుడ్ నటుడికి జోకర్ లుక్ లో ఇచ్చిపడేసిన ప్రభాస్!

అప్పన్న ప్రసాదంలో నత్త... నాగార్జున యాదవ్ స్ట్రాంగ్ రియాక్షన్

తణుకులో పోలీసుల ఓవరాక్షన్, 13 మందిపై అక్రమ కేసులు

AP: కూటమి పాలనలో నిలువెత్తు నిర్లక్ష్యంలో ఆలయాలు

Photos

+5

హిమాలయాల్లో తిరిగేస్తున్న టాలీవుడ్ హీరోయిన్ (ఫొటోలు)

+5

2025లో ఊహించనవి జరిగాయి.. కియారా అద్వానీ జ్ఞాపకాలు (ఫొటోలు)

+5

న్యూ ఇయర్‌ వేళ..రారండోయ్‌ ముగ్గులు వేద్దాం..!

+5

తిరుమల : వైకుంఠ ద్వాదశి చక్రస్నానం..ప్రముఖుల దర్శనం (ఫొటోలు)

+5

హైదరాబాద్: కమ్మేసిన పొగమంచు..గజగజ వణుకుతున్న జనం (ఫొటోలు)

+5

జనాలకు భరోసా కల్పిస్తూ జగన్‌ ప్రయాణం.. 2025 రౌండప్‌ చిత్రాలు

+5

‘అనగనగా ఒక రాజు’ మూవీ రిసెప్షన్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

భర్తతో హనీమూన్‌ ట్రిప్‌లో సమంత..! (ఫొటోలు)

+5

రష్మిక రోమ్ ట్రిప్.. మరిది ఆనంద్‌తో కలిసి (ఫొటోలు)

+5

అన్షులా కపూర్ బర్త్ డే పార్టీ.. జాన్వీ కపూర్ మిస్సింగ్ (ఫొటోలు)