CP Sajjanar: న్యూ ఇయర్‌కు హైదరాబాద్ రెడీ
Breaking News
ఆ సినిమా చూసి డిస్టర్బ్ అయ్యా.. ఇది ఊహించలేదు!
Published on Wed, 12/31/2025 - 14:05
'బైసన్' మూవీతో ఈ ఏడాది మంచి హిట్ అందుకున్నాడు తమిళ దర్శకుడు మారి సెల్వరాజ్.. కేవలం ఐదు సినిమాలతోనే టాప్ దర్శకుడిగా మారిపోయాడు. 'పెరియేరమ్ పెరుమాల్', 'కర్ణన్', 'మామన్నన్', 'వాళై', 'బైసన్' చిత్రాలతో ఇండస్ట్రీలో తన మార్క్ క్రియేట్ చేసుకున్నాడు. అయితే ఇటీవల ఓ సినిమా తనను ఎంతగానో డిస్టర్బ్ చేసిందంటున్నాడు మారి సెల్వరాజ్.
కలత చెందా..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ.. ఓటీటీలో 'హోంబౌండ్' అనే హిందీ సినిమా చూశాను. ఆ తర్వాత రెండు, మూడు రోజులు నేను మామూలు మనిషిని కాలేకపోయాను. ఆ సినిమా నాపై ఇంత ప్రభావాన్ని చూపుతుందనుకోలేదు. ఎంతో కలత చెందాను.. మనం మాత్రం కరోనా లాక్‌డౌన్‌ను మనం ఇంత ఈజీగా దాటేశామా? అనిపించింది.
నా దృక్కోణాన్నే మార్చేసింది
హోంబౌండ్ చూశాక కొద్దిరోజులు ఎవరితోనూ మాట్లాడలేదు. సినిమాను మరింత ప్రామాణికంగా, వాస్తవికంగా ఎలా తీయాలో నన్ను ఆలోచించేలా చేసింది. ఒక దర్శకుడిగా నా దృక్కోణాన్నే మార్చేసింది అని చెప్పుకొచ్చాడు. హోంబౌండ్ విషయానికి వస్తే.. ఇషాన్ ఖట్టర్, విశాల్ జెత్వా, జాన్వీ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. నీరజ్ గెవాన్ దర్శకత్వం వహించాడు. మార్టిన్ స్కోర్సెస్ నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం నెట్‌ఫ్లిక్స్‌లో అందుబాటులో ఉంది.
చదవండి: చిన్న వయసులో ఆస్తులన్నీ కోల్పోయాం.. షాంపూలు అమ్మా: నటుడు
Tags : 1