తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్
Breaking News
ఎన్నాళ్లయిందో.. ఇది నా లైఫ్‌లో మధుర జ్ఞాపకం: తనూజ
Published on Mon, 12/29/2025 - 10:04
సీరియల్ నటి తనూజ పుట్టస్వామి బిగ్‌బాస్ షో ద్వారా ప్రేక్షకులకు మరింత దగ్గరైంది. తెలుగు బిగ్‌బాస్ తొమ్మిదో సీజన్ రన్నరప్‌గా నిలిచిన ఆమె తాజాగా తన మంచి మనసు చాటుకుంది. షో అయిపోగానే తన ఫ్రెండ్స్ ఏర్పాటు చేసిన చిన్నపాటి పార్టీలో సందడి చేసిన ఆమె తాజాగా అనాథాశ్రమానికి వెళ్లింది. ఈ మేరకు ఒ వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసింది.
చిన్నారులతో సరదాగా
అందులో చిన్నారులతో కలిసి ముచ్చటించింది. వారు డ్యాన్స్ చేస్తుంటే చప్పట్లు కొట్టింది. తర్వాత పిల్లలందరికోసం పాట పాడింది. కేక్ కట్ చేసి చిన్నారులకు తినిపించింది. అనంతరం వారికి భోజనం వడ్డించింది. ఓ చిన్నారికి గోరుముద్దలు పెడుతూ తనూ వారితో కలిసి భోజనం చేసింది.
మధురమైన జ్ఞాపకం
వాళ్లందరినీ తన ఫ్యామిలీగా అభివర్ణించింది. 'నా కుటుంబాన్ని చూసి ఎన్నాళ్లయిందో! వాళ్ల ప్రేమలు, చిరునవ్వులు, జ్ఞాపకాలు.. మమ్మల్ని మళ్లీ ఒక్కటి చేశాయి. చాలాకాలం తర్వాత వారితో మళ్లీ కాలక్షేపం చేశాను. నా మనసు ఆనందంతో నిండిపోయింది. ఇది నా జీవితంలో మర్చిపోలేని మధురమైన జ్ఞాపకాల్లో ఒకటిగా నిలిచిపోతుంది' అని తనూజ రాసుకొచ్చింది.
చదవండి: అభిమానుల అత్యుత్సాహం.. కిందపడ్డ విజయ్
Tags : 1