'భారత్‌ చాలా నేర్పించింది'..! ఓ విదేశీ తల్లి భావోద్వేగ పోస్ట్‌

Published on Thu, 12/25/2025 - 17:14

చాలామంది విదేశీయలు మన మాతృగడ్డపై మమకారం పెంచుకుని ఇక్కడే శాశ్వత నివాసం ఏర్పరుచుకుంటున్నారు. ముఖ్యంగా ఇక్కడ సంస్కృతి, ఆచార వ్యవహారాలకు ఫిదా అంటూ ఇక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటున్నారు. పైగా వాళ్ల సతంతి కూడా ఇక్కడ పెరిగితేనే మంచిదని భావిస్తుండటం విశేషం. ఆ కోవలోకి తాజాగా మరో రష్యన్‌ తల్లి వచ్చి చేరింది. ఆ పిల్లల తల్లి పోస్ట్‌లో పేర్కొన్న విషయాలు వింటుంటే మన గడ్డపై మమకారం, ప్రేమ రెట్టింపు అవవ్వడమే కాదు భారతీయులుగా గర్వం ఉప్పొంగుతుంది కూడా. మరి ఇంతకీ ఆమె ఆ పోస్ట్‌లో ఏం చెప్పుకొచ్చిందంటే..

బెంగళూరులో నివశిస్తున్న ఈ రష్యన్‌ మహిళ తాను తన భర్త భారతదేశాన్ని కేవలం పర్యాటక ప్రదేశంగా కాకుండా శాశ్వత నివాసంగా ఎందుకు మార్చుకున్నామో వెల్లడించింది పోస్ట్‌లో. ఈ గడ్డపై ఉంటేనే తన పిల్లలు మంచిగా పెరుగుతారని, ఇది పిల్లల పెంపకానికి అత్యంత అనుకూలమైన వాతావరణమని, విశాల దృక్పథంతో వ్యవహరించడం అలవడుతుందని అటోంది. 

ఈ భారతదేశం తమ కుటుంబానికి ఎన్నో నేర్పించిందంటూ ఇలా వివరించింది. వేగాన్ని తగ్గించడం దగ్గర నుంచి తొందరపడకుండా ఉండటం, మాటకు స్పదించడం, శ్రద్ధగా వినడం వంటివి తమ కుటుంబం నేర్చుకుందని తెలిపింది. అలాగే తాము ఇక్కడ భారతీయులను తాము ఎంతగానో ప్రేమిస్తున్నామని, వారి కపటం లేని మనసు, దయ, ప్రతిఫలాప్రేక్ష లేని హెల్పింగ్‌ నేచర్‌ మమ్మల్ని ఎంతగానో కట్టిపడేశాయని చెప్పుకొచ్చింది. 

ముఖ్యంగా పొరుగువారితో సత్సంబంధాలు చాలా బాగుంటాయని, ఇక్కడ చిరునవ్వే అందరి కామన్‌భాష అని అంటోంది. అందువల్లే తన పిల్లలను ఇక్కడే పెంచాలని స్ట్రాంగ్‌గా ఫిక్స్‌ అయ్యానంటోంది ఈ తల్లి. ఈ బహుళ సంస్కృతి, బహుభాషా వాతావరణంలో ఎన్నో నేర్చుకోగలరు, ముఖ్యంగా గౌరవించడం, చిన్న చిన్న వాటికి ప్రశంసించడం వంటివి నేర్చుకుంటారని చెబుతోంది. ఈ వెచ్చని వాతావరణం ఎంజాయ్‌ చేయడం ఓ థ్రిల్‌, అలాగే ఏడాది పొడవునా కాలానుగుణ తాజా పండ్లను ఆస్వాదించడంలో ఓ మజా ఉందంటోంది. 

అందువల్లే తాము భారతదేశాన్ని తమ నివాస స్థలంగా మార్చుకున్నామంటూ పోస్ట్‌ని ముగించింది. అయితే నెటిజన్లు స్పందిస్తూ..మా భారత్‌కి స్వాగతం, మా మృతృభూమి చాలా అందమైనది, ఎవరినైనా తనలో ఇట్టే కలిపేసుకుంటుంది అని ఆమెకు సాదారంగా ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టారు.

 

(చదవండి: సంపాదన కంటే అదే అత్యంత ముఖ్యం! వైరల్‌గా ఎన్‌ఆర్‌ఐ పోస్ట్‌)

 

#

Tags : 1

Videos

హార్ట్ పేషెంట్స్ ఎవ్వరూ లేరు..! కేటీఆర్ కు పొన్నం కౌంటర్

అల్లాడిపోతున్నది అమ్మ మా అనిత.. పేర్నినాని ఊర మాస్ ర్యాగింగ్

ఎవడబ్బ సొమ్మని మా భూమిలోకి వస్తారు.. మీకు చేతనైతే..

ఒక్క బిడ్ రాలేదు.. జగన్ దెబ్బకు బొమ్మ రివర్స్.. పగతో రగిలిపోతున్న చంద్రబాబు

సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టిన విజయ్

సాక్షి మీడియా గ్రూప్ డైరెక్టర్ దివ్యారెడ్డికి గోల్డ్ మెడల్

టీడీపీ, జనసేన నేతలే ఛీ కొడుతున్నారు.. అయినా మీకు సిగ్గు రాదు

శివాజీ వ్యాఖ్యలపై కేఏ పాల్ షాకింగ్ కామెంట్స్

వైఎస్ జగన్ ను చూసి చంద్రబాబు అండ్ కో భయపడుతున్నారు

ప్లాన్ చేసి యువకుడి మర్డర్.. అక్కా చెల్లెళ్ల మాస్టర్ ప్లాన్

Photos

+5

బేబీ బంప్‌తో హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

అబుదాబిలో వెకేషన్ ఎంజాయ్ చేస్తోన్న ఉప్పెన బ్యూటీ కృతి శెట్టి.. ఫోటోలు

+5

ప్రభాస్ ది రాజాసాబ్‌ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌లో ఫ్యాన్స్‌ సందడి.. ఫోటోలు

+5

బీచ్ ఒడ్డున 'కోర్ట్' బ్యూటీ బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

మహేశ్ బాబు 'మురారి' క్లైమాక్స్ ఇలా తీశారు (ఫొటోలు)

+5

చీరలో రీసెంట్ ట్రెండింగ్ బ్యూటీ గిరిజ (ఫొటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న క్రికెటర్‌ కర్ణ్‌ శర్మ (ఫొటోలు)

+5

తెలుగు రాష్ట్రాల్లో వరుస సెలవులు.. కిక్కిరిసిన ఆలయ ప్రాంగణాలు.. పోటెత్తిన భక్తులు.. (చిత్రాలు)

+5

తెలంగాణలో ఎంతో ప్రసిద్ధి చెందిన ఈ శివయ్యను మీరు ఎప్పుడైనా చూశారా (ఫొటోలు)

+5

హీరోయిన్ల దుస్తులపై 'శివాజీ' కామెంట్‌.. ట్రెండింగ్‌లో 'అనసూయ' (ఫోటోలు)