పార్వతీపురంలో YS జగన్ పుట్టినరోజు వేడుకలు
Breaking News
'మనకొక మగతోడు కావాలి..' బోల్డ్‌గా బ్యాడ్ గర్ల్స్ ట్రైలర్
Published on Mon, 12/22/2025 - 17:21
అంచల్ గౌడ, పాయల్ చెంగప్ప, రోషిణి, యష్ణ లీడ్ రోల్స్‌లో నటిస్తోన్న చిత్రం బ్యాడ్ గర్ల్స్. కానీ చాలా మంచోళ్లు అనేది ట్యాగ్ లైన్. ఈ సినిమాకు 30 రోజుల్లో ప్రేమించడం ఎలా మూవీ ఫేమ్ మున్నా ధులిపూడి దర్శకత్వం వహించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రిలీజ్‌కు సిద్దమైంది. ఇటీవల రిలీజైన పాటలకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది.
తాజాగా బ్యాడ్ గర్ల్స్ మూవీ ట్రైలర్ రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ చూస్తుంటే సంప్రదాయం కుటుంబం నుంచి వచ్చిన నలుగురు అమ్మాయిలు విదేశాలకు వెళ్లిన తర్వాత ఎలా మారిపోయారనే అనే కాన్సెప్ట్‌తో తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ట్రైలర్‌లోని ఫుల్ కామెడీతో ఎమోషన్స్ ఈ చిత్రంపై అంచనాలు మరింత పెంచేస్తున్నాయి. ఈ మూవీలో రేణు దేశాయ్ కీలక పాత్రలో కనిపించనుంది. ఈ మూవీని ప్రశ్విత ఎంటర్‌టైమెంట్, నీలి నీలి ఆకాశం క్రియేషన్స్, ఎన్‌వీఎస్ క్రియేషన్స్ బ్యానర్లపై శశిధర్ నల్లా, ఎమ్మాడి సోమ నర్సయ్య, రామిశెట్టి రాంబాబు, రావుల రమేశ్ నిర్మించారు. ఈ చిత్రం క్రిస్మస్ పండగ సందర్భంగా డిసెంబర్ 25న విడుదల కానుంది.
Tags : 1