ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
బిగ్‌బాస్ 'సుమన్ శెట్టి' ఎలిమినేట్.. ఆల్‌టైమ్ రికార్డ్‌గా రెమ్యునరేషన్
Published on Sun, 12/14/2025 - 10:52
బిగ్‌బాస్ తెలుగు 9 నుంచి కమెడియన్ సుమన్ శెట్టి ఎలిమినేట్ అయ్యారు. ఫస్ట్ వారమే ఆయన హౌస్ నుంచి బయటకు వచ్చేస్తారని అందరూ భావించారు. కానీ, అంచనాలకు మించి ఏకంగా 14 వారాల పాటు ప్రేక్షకులను మెప్పించాడు. 97వ ఎపిసోడ్‌లో బిగ్‌బాస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం హౌస్‌లో కేవలం 6 మంది కంటెస్టెంట్స్ మాత్రమే ఉన్నారు. నేడు ఆదివారం ఎపిసోడ్‌లో భరణి ఎలిమినేట్ కానున్నట్లు సమాచారం. అప్పుడు టాప్-5లో తనూజ, కల్యాణ్, ఇమ్మన్యూయేల్, పవన్, సంజన మాత్రమే ఉంటారు. అయితే, తాజాగా ఎలిమినేట్ అయిన సుమన్ శెట్టి భారీ రెమ్యునరేషన్ అందుకున్నట్లు వార్తలు వస్తున్నాయి.
సుమన్ శెట్టి ఎలిమినేషన్ తర్వాత ప్రేక్షకులు అతని రెమ్యునరేషన్ గురించి తెలుసుకుని ఆశ్చర్యపోతున్నారు. సుమన్ శెట్టి వారానికి రూ. 2.6 లక్షల చొప్పున రెమ్యూనరేషన్ అందుకున్నట్టు తెలుస్తోంది. 14 వారాలు హౌస్‌లో ఆయన కొనసాగడంతో సుమారుగా రూ.36 లక్షలకు పైగానే సంపాదించినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ తెలుగు చరిత్రలోనే టాప్ రెమ్యూనరేషన్ అందుకున్నవారిలో సుమన్ శెట్టి నిలిచారని చెప్పవచ్చు. గతంలో యాంకర్ రవి కూడా ఇదే రేంజ్‌లో రెమ్యునరేషన్ అందుకున్న విషయం తెలిసిందే.
Tags : 1