ఆస్ట్రేలియా లో కాల్పులు.. 10 మంది మృతి
Breaking News
తొలిసారి అలా కనిపించిన సామ్ దంపతులు.. వీడియో వైరల్
Published on Sun, 12/14/2025 - 08:29
అందరూ ఊహించినట్లుగానే సమంత రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టింది. కొన్ని నెలలుగా వస్తున్న రూమర్స్‌ను నిజం చేస్తూ రెండో పెళ్లి చేసుకుంది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరు సామ్ పెళ్లాడింది. భూత శుద్ధి వివాహం పేరుతో ఇషా ఫౌండేషన్‌లో వీరి పెళ్లి గ్రాండ్‌గా జరిగింది. ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలను సమంత సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఈ పెళ్లిలో సమంత అత్యంత సన్నిహితులు మాత్రమే పాల్గొన్నారు.
అయితే ఈ పెళ్లి తర్వాత వీరిద్దరు మొదటిసారి జంటగా బయట కనిపించారు. ఎయిర్‌పోర్ట్‌లో వెళ్తుండగా ఈ నూతన వధువరులు కెమెరాలకు చిక్కారు. ఈ జంటను చూసిన కొందరు కంగ్రాట్స్ చెప్పారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
కాగా.. సమంత మొదట టాలీవుడ్ హీరో నాగ చైతన్యను పెళ్లాడారు. ఆ తర్వాత వీరిద్దరు 2021లో విడాకులు తీసుకున్నారు. గతేడాది నాగచైతన్య.. మరో హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను పెళ్లాడారు. తాజాగా ఈ ఏడాది సామ్ రెండోసారి వివాహబంధంలోకి అడుగుపెట్టారు.
#Samantha was seen at the airport with husband #RajNidimoru for the first time after their wedding. 😍
#FilmfareLens pic.twitter.com/ohc48wCUgj— Filmfare (@filmfare) December 13, 2025
Tags : 1