సంక్రాంతికి నారీ నారీ నడుమ మురారి.. ఇలా కూడా రిలీజ్ చేస్తారా?

Published on Tue, 12/09/2025 - 18:45

సంక్రాంతి సినిమాల పోటీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఏడాది ముందే కర్ఛీప్వేసేయాల్సిందే. లేదంటే చివరికీ వచ్చేసరికి పోటీ మరింత పెరిగిపోతుంది. అలా ఇప్పటికే వచ్చే ఏడాది రిలీజయ్యే పొంగల్సినిమాలు చాలా వరకు డేట్స్ ప్రకటించారు. వాటిలో మనశంకరవరప్రసాద్గారు, అనగనగా ఒక రాజు, ది రాజాసాబ్‌, భర్త మహాశయులకు విజ్ఞప్తి అఫీషియల్తేదీలు వెల్లడించారు.

తాజాగా మరో టాలీవుడ్హీరో సంక్రాంతి పోటీలో ఉన్నట్లు అధికారికంగా ప్రకటించారు, శర్వానంద్ హీరోగా వస్తోన్న నారీ నారీ నడుమ మురారి రిలీజ్ డేట్ అఫీషియల్ అనౌన్స్మెంట్వచ్చేసింది. జనవరి 14 థియేటర్లలో రిలీజ్ కానుందని ఏకే ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ సంస్థ రివీల్ చేసింది. అయితే ఈ సినిమా సాయంత్రం ఐదు గంటల 49 నిమిషాలకు విడుదల కానుందని మేకర్స్ ప్రకటించారు. ఇదే ఆడియన్స్‌కు కాస్తా ఆశ్చర్యానికి గురి చేస్తోంది. సాధారణంగా ఏ మూవీ అయినా రిలీజ్‌ డే మార్నింగ్ షో ఉదయం 11 గంటలకు మొదలవుతుంది. ఇలా సాయంత్రం వేళ మూవీని విడుదల చేసి కొత్త ట్రెండ్‌కు తెర తీస్తున్నారా అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు.  ఈ లెక్కన ఈవినింగ్ ఫస్ట్‌ షోతో నారీ నారీ నడుమ మురారి షురూ కానుంది. 

కాగా.. చిత్రంలో సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రానికి సామజవరగమన ఫేమ్‌ రామ్‌ అబ్బరాజు దర్శకత్వం వహించారు. అనిల్‌ సుంకర ఏకే ఎంటర్‌టైన్మెంట్స్, అడ్వెంచర్స్‌ ఇంటర్నేషనల్‌ పతాకాలపై రామబ్రహ్మం సుంకర ఈ సినిమాను నిర్మించారు. ఈ మూవీ శర్వానంద్ కెరీర్లో 37 చిత్రంగా నిలవనుంది.

 

 

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)