'తెలుగు ఇండస్ట్రీకి లేని భయం మనకెందుకు'.. హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్..!

Published on Tue, 12/09/2025 - 17:43

కోలీవుడ్ స్టార్ కార్తీ ప్రస్తుతం వా వాతియార్మూవీతో ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. మూవీకి నలన్ కుమారస్వామి దర్శకత్వం వహించారు. తెలుగులో చిత్రాన్ని అన్నగారు వస్తారు అనే టైటిల్తో రిలీజ్ చేస్తున్నారు. నేపథ్యంలోనే చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్నిర్వహించారు మేకర్స్.

సందర్భంగా ఈవెంట్కు హాజరైన హీరో కార్తీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. తెలుగు, మలయాళ ఇండస్ట్రీలను ఉద్దేశించి మాట్లాడారు. క్రమంలోనే తెలుగు ఇండస్ట్రీపై ప్రశంసలు కురిపించారు. తెలుగు ఇండస్ట్రీలో ఎలాంటి భయం లేకుండా భారీ బడ్జెట్‌ చిత్రాలు తెరకెక్కిస్తున్నారని అన్నారు. అలాగే మలయాళ ఇండస్ట్రీలోనూ ప్రత్యేకమైన కథలు వస్తున్నాయని కార్తీ కొనియాడారు.

మరి కోలీవుడ్ఇండస్ట్రీకి ప్రత్యేక గుర్తింపు ఎక్కడ? అని కార్తీ ప్రశ్నించారు. వాళ్లలాగా మనం అద్భుతాలు ఎందుకు చేయలేకపోతున్నామో ఆలోచించాలని హితవు పలికారు. మనకంటూ ప్రత్యేక గుర్తింపు రావాలంటే.. భయానికి దూరంగా ఉండాలన్నారు. అప్పుడే మనం కొత్త ఆవిష్కరణలు చేయడానికి వీలవుతుందని సూచించారు. సరిహద్దులు చెరిపేసి తమిళ సినిమాను ముందుకు తీసుకెళ్లాల్సిన సమయం ఆసన్నమైందని కార్తీ వెల్లడించారు.

(ఇది చదవండి: భారీ ధరకు ది రాజాసాబ్‌ ఓటీటీ డీల్.. ఎన్ని కోట్లంటే?)

అంతేకాకుండా ఓ నటుడిగా వా వాతియార్‌ తనకు రిస్కీ సబ్జెక్ట్‌ అని కార్తీ అన్నారు. ఈ సినిమా కత్తితో సావాసం చేయడం లాంటిదని.. తమిళ నటుడు దివంగత ఎంజీఆర్‌ను అనుకరించడాన్ని ఉద్దేశించి కార్తి మాట్లాడారు. దర్శకుడు నలన్‌ కుమారస్వామి కథ చెప్పినప్పుడు నటించేందుకు సందేహించా.. కానీ తర్వాత ఓకే చెప్పానని తెలిపారు.

Videos

రంగారెడ్డి జిల్లా మీర్‌పేట్ పీఎస్ పరిధిలో కారు బీభత్సం

ఇండిగోకు DGCA షాక్

Florida : కారుపై ల్యాండ్ అయిన విమానం

అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ కుట్ర రాజకీయాలు

నారాయణ కాలేజీలో.. వేధింపులు భరించలేక విద్యార్ధి ఆత్మహత్యాయత్నం

కోటి సంతకాల ప్రతులను గవర్నర్ కు అందించనున్న వైఎస్ జగన్

సీఎం ఓయూ పర్యటనను స్వాగతిస్తూనే విద్యార్థుల డిమాండ్లు

KSR Live Show : సాక్షి ఛానల్ ను ఎలా బ్లాక్ చేస్తారు?

చిన్న వయసులోనే చాలా చూశా.. బోరున ఏడ్చేసిన కృతిశెట్టి

Vasupalli Ganesh: రీల్స్ నాయుడు.. రాజీనామా చేసి ఇంట్లో కూర్చో

Photos

+5

విజయవాడ : అదరగొట్టిన అమ్మాయిలు (ఫొటోలు)

+5

'రాజాసాబ్' బ్యూటీ మాళవిక సఫారీ ట్రిప్ (ఫొటోలు)

+5

ఫేట్ మార్చిన ఒక్క సినిమా.. రుక్మిణి వసంత్ బర్త్ డే (ఫొటోలు)

+5

‘అన్నగారు వస్తారు’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘న‌య‌నం’ ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

హార్దిక్‌ పాండ్యా సూపర్‌ షో...తొలి టి20లో భారత్‌ ఘన విజయం (ఫొటోలు)

+5

గ్లోబల్‌ సమిట్‌లో సినీ ప్రముఖుల సందడి.. సీఎం రేవంత్ రెడ్డితో భేటీ (చిత్రాలు)

+5

తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌.. డే2 స్పెషల్‌ ఎట్రాక్షన్స్‌ ఇవిగో (ఫొటోలు)

+5

స్వదేశీ దుస్తుల్లో ఆదితి రావు హైదరీ నేచురల్‌ బ్యూటీ లుక్ (ఫొటోలు)

+5

ప్రతిరోజూ మిస్ అవుతున్నా.. 'కేదార్‌నాథ్' జ్ఞాపకాల్లో సారా (ఫొటోలు)