16 రోజుల్లో శబరిమలకు 13.5 లక్షల మంది.. ఆదాయం ఎంతంటే.

Published on Tue, 12/02/2025 - 15:46

సాక్షి శబరిమల: కేరళలోని ప్రసిద్ధ శబరిమల అయ్యప్ప క్షేత్రానికి ఈ ఏడాది మండల-మకరవిలక్కు సీజన్​లో రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. కేవలం 16 రోజుల్లోనే రూ.92 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ట్రావెన్‌కోర్‌ దేవస్వం బోర్డు (టీడీబీ) వెల్లడించింది. ఈ ఏడాది మండల- మకరవిళక్కు (Mandala Makaravilakku) వేడుకలు గత నెల 17వ తేదీ నుంచి ప్రారంభమైన విషయం తెలిసిందే. అంటే ఈ సీజన్‌ తొలి 16 రోజుల్లోనే రికార్డు స్థాయిలో ఆదాయం రావడం విశేషం. 

గతేడాది ఇదే సీజన్‌తో పోలిస్తే ఈ దఫా ఆదాయం 33.33 శాతం పెరిగినట్లు టీడీబీ పేర్కొంది. అయితే గతేడాది కేవలం రూ.69 కోట్లు మాత్రమే వసూలైనట్లు దేవస్వం బోర్డు తెలిపింది. ఈ ఏడాది ఆదాయంలో అత్యధికంగా అయ్యప్ప ప్రసాదం విక్రయాల నుంచే వచ్చినట్లు వెల్లడించింది. అంతేగాదు దాదాపు రూ.47 కోట్లు ప్రసాదాల విక్రయాల ద్వారే సమకూరినట్లు బోర్డు వివరించింది. 

ఇక మండల-మకరవిలక్కు సీజన్‌ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు(16 రోజుల తర్వాత) సుమారు పదమూడున్నర లక్షల మందికి పైగా భక్తుల అయ్యప్పను దర్శించుకున్నట్లు దేవస్వం బోర్డు పేర్కొంది. శని, ఆదివారాల్లో రద్దీ తక్కువగా ఉన్నప్పటికీ..సోమవారం మధ్యాహ్నం నుంచి రద్దీ పెరిగింది. 

సోమవారం గురుపవనపురి ఏకాదశి సందర్భం తెల్లవారుజామున 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు దాదాపు 90 వేల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించారు. అలాగే కేరళ అన్నదాన సద్య పథకం నేడు ప్రారంభం కాదని దేవస్వం బోర్డు తెలిపింది. కాగా, పంపా నుంచి సన్నిధానం వెళ్లే మార్గంలో 12 ప్రదేశాల్లో తాగునీరు, స్నాక్స్‌, అత్యవసర ఆరోగ్య సేవలను ఏర్పాటు చేశారు.

(చదవండి: శబరిమలలో తగ్గిన భక్తుల రద్దీ ..!)

 

Videos

భవానీపురం ప్లాట్ల బాధితులకు అండగా వైఎస్ జగన్

ఏడీకి 100 కోట్ల ఆస్తులు.. ఏసీబీ అరెస్ట్

జగన్ అనే వ్యక్తి లేకపోతే ఏపీ ఖేల్ ఖతం..

అఖండ-2 రిలీజ్ వాయిదా.. మద్రాస్ హైకోర్టు స్టే

ప్రకాశం జిల్లాలో భూప్రకంపనలు.. ఇళ్ల నుంచి జనం పరుగులు

ఒకటేసారి పుట్టి.. ఒకే చోట చదివి.. ఒకటే శాఖల జాబ్ కొట్టిండ్రు

ఫుల్లుగా తాగి.. యువతిని లాక్కెళ్లి మానభంగం

అయిందా.. బాగా అయిందా.. ఎందుకు ఈ ఎగస్ట్రాలు

కారు పైకి ఎక్కి హంగామా చేసావే.. ఇప్పుడు ఎందుకు నోరు మూసుకొని ఉన్నావ్

హత్యా రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్.. మహానటి.. డాక్టర్ సునీత

Photos

+5

హైదరాబాద్ టైమ్స్ ఫ్యాషన్ వీక్‌లో అనన్య నాగళ్ల (ఫోటోలు)

+5

విశాఖ : వైభవంగా శ్రీ కనకమహాలక్ష్మి మార్గశిర మాసోత్సవాలు (ఫొటోలు)

+5

విశాఖ చేరుకున్న భారత్‌, దక్షిణాఫ్రికా జట్లు క్రికెట్ ఫ్యాన్‌ సందడి (ఫొటోలు)

+5

ఎరుపెక్కిన ఇంద్రకీలాద్రి..వైభవంగా కలశజ్యోతుల ఉత్సవం (ఫొటోలు)

+5

భారత్‌లో పుతిన్‌ (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో సమంత ఫ్రెండ్‌ శిల్పా రెడ్డి అందాలు (ఫోటోలు)

+5

షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో తేజ సజ్జా, మీనాక్షి చౌదరి సందడి (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారి సేవలో టాలీవుడ్ ప్రముఖులు (ఫోటోలు)

+5

దిగ్గజ నిర్మాత ఏవీఎం శరవణన్‌ మృతి.. ప్రముఖుల నివాళులు (ఫోటోలు)

+5

చలికాలం స్వింగ్‌లో పూజా హెగ్డే.. స్పెషల్‌ ఫోటోలు చూశారా..?