గ్రూప్-2 రద్దు.. టెన్షన్ పెట్టిస్తున్న హైకోర్టు తీర్పు.. 1000 ఉద్యోగాలు ఊడినట్టే
హీరోయిన్లే టార్గెట్‌గా కొత్త స్కామ్.. శ్రియ పోస్ట్ వైరల్
Published on Wed, 11/19/2025 - 12:04
టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో అర్ధం కావట్లేదు. ఎందుకంటే మన పేరుని, ఫోన్ నంబర్లని ఎంతలా మోసాలకు ఉపయోగిస్తున్నారో చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు టాలీవుడ్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఓ స్కామ్ బారిన పడుతున్నారు. రెండు రోజుల క్రితమే హీరోయిన్ అదితీ రావు హైదరీ తన పేరుతో వాట్సాప్‌లో మోసం జరుగుతుందని బయటపెట్టగా.. ఇప్పుడు ఇదే తరహాలో తన పేరుతోనూ జరుగుతోందని శ్రియ పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.
బుధవారం ఉదయం శ్రియ ఓ పోస్ట్ పెట్టింది. ఇందులో ఓ తన ఫొటోతో ఉన్న ఫోన్ నంబర్ స్క్రీన్ షాట్ తీసి పెట్టింది. ఇది తన నంబర్ కాదని, తన పేరుతో సెలబ్రిటీలకు మెసేజ్ చేసి వాళ్ల టైమ్ వేస్ట్ చేయొద్దని పేర్కొంది. తాను అభిమానించే వ్యక్తులకు.. కలిసి సినిమాలు చేయాలని ఉందని చెబుతూ సదరు వ్యక్తి ఫేక్ వాట్సాప్ ఖాతా నుంచి మెసేజులు పెడుతున్నాడని, ఇది తన దృష్టికి వచ్చిందని చెప్పుకొచ్చింది. దీనిపట్లు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించింది.
శ్రియ కెరీర్ విషయానికొస్తే అప్పట్లో తెలుగు, తమిళ, హిందీలో హీరోయిన్‌గా చేసింది. ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్ట్, ఐటమ్ సాంగ్స్ చేస్తోంది. ఈ ఏడాది 'మిరాయ్'లో తల్లిగా ఆకట్టుకుంది. ప్రస్తుతం 'నాన్ వయలెన్స్' అనే తమిళ మూవీ చేస్తోంది.
(ఇదీ చదవండి: ముఖ్యమంత్రిని పెళ్లికి ఆహ్వానించిన తెలుగు సింగర్)
Tags : 1