బీహార్ ఎగ్జిట్ పోల్స్ లో ఊహించని ట్విస్ట్
Breaking News
ఢిల్లీ బ్లాస్ట్: తప్పు చేసిన కారు ఓనర్!
Published on Tue, 11/11/2025 - 15:28
సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఎర్రకోట సమీపంలో జరిగిన భారీ పేలుడులో తొమ్మిది మంది మరణించగా, 20 మంది గాయపడ్డారు. ఈ నేపథ్యంలో ఢిల్లీలో హై అలర్ట్ ప్రకటించారు. ఈ పేలుడుకు ఉపయోగించిన కారు 'హ్యుందాయ్ ఐ20' అని తేలింది. దీనిని మొదట ఉపయోగించిన వ్యక్తి/ఓనర్ రిజిస్ట్రేషన్ బదిలీ చేయకుండా ఒకరికి విక్రయిస్తే.. వాళ్లు ఇంకొకరికి విక్రయించడంతో.. అలా, అలా చాలా రాష్ట్రాలు తిరిగింది. ఈ ఘటన సెకండ్ హ్యాండ్ మార్కెట్లో ఒకింత భయాన్ని కలిగించింది.
పేలుడు సంభవించిన హ్యుందాయ్ ఐ20 రిజిస్ట్రేషన్ బదిలీ చేయలేదు కాబట్టి.. ఆ కారు మొదటి ఓనర్ పేరు మీదనే ఉంది. ఇది ఆ యజమానిని ఇబ్బందుల్లోకి నెడుతుంది. కాబట్టి సెకండ్ హ్యాండ్ వాహనాలను విక్రయించేటప్పుడు యజమాని ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ తెలుసుకుందాం..

సెకండ్ హ్యాండ్ కారును విక్రయించేటప్పుడు.. యాజమాన్య బదిలీ అత్యంత ముఖ్యమైన దశలలో ఒకటి. కానీ దీనినే నిర్లక్ష్యం చేస్తూ విస్మరిస్తుంటారు. ఎట్టి పరిస్థితుల్లో యజమాని ఆలా చేయకూడదు. ఎందుకంటే.. మీరు అమ్మేసిన కారు ఏదైనా ప్రమాదంలో చిక్కుకుంటే ఆ కేసు మీ మీద పడే అవకాశం ఉంయింది.
వెహికల్ అమ్మేటప్పుడు తీసుకోవలసిన జాగ్రత్తలు
ఒక కారు లేదా బైక్‌ను విక్రయించాలనుకున్నప్పుడు.. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇందులో ఆర్సీ, భీమా, పొల్యూషన్ సర్టిఫికేట్, సర్వీస్ హిస్టరీ, ట్యాక్స్ రసీదులు ఉంటాయి. వీటన్నింటినీ అందించడం మాత్రమే కాకుండా.. రిజిస్ట్రేషన్ కూడా బదిలీ చేయలి. లేకుంటే మీరు విక్రయించే వాహనాన్ని నేరపూరిత కార్యకలాపాలకు ఉపయోగిస్తే.. అది రిజిస్ట్రేషన్ ఎవరి పేరు మీద ఉంటుందో వారిమీద పడుతుంది.
బీమాను కూడా బదిలీ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు ఎందుకున్న బీమా పాలసీ కాకుండా.. కొనుగోలుదారు ఇతర బీమా ఎంచుకోవచ్చు. కాబట్టి అప్పటికే వాహనం మీద ఉన్న బీమాను కారు కొనుగోలుదారు క్యాన్సిల్ చేసుకోవచ్చు. అంతే కాకుండా పెండింగ్‌లో ఉన్న ఏవైనా లోన్స్, చలాన్లు లేదా సర్వీస్ బకాయిలను చెల్లించండి.

అధికారికంగా యాజమాన్యాన్ని బదిలీ చేయడానికి.. RTO వద్ద ఫారమ్‌లు 28, 29, 30లను సమర్పించండి. ఫారమ్ 28 నో అబ్జెక్షన్ మంజూరుకు సంబంధించినది. ఫారమ్ 29 & 30 యాజమాన్య బదిలీకి సంబంధించినవి. ఇవన్నీ పూర్తి చేయడం వల్ల వాహనం బాధ్యతలు కొనుగోలుదారుకు వెళ్తాయి.
ఢిల్లీ బ్లాస్ట్‌లో హ్యుందాయ్ ఐ20
నిజానికి.. ఢిల్లీ బ్లాస్ట్‌లో పేలిన హ్యుందాయ్ ఐ20 కారు రిజిస్ట్రేషన్ నంబర్ - HR26CE7674. 2013లో తయారైన ఈ కారును 2014లో గుర్గావ్ నివాసి అయిన 'సల్మాన్' కొనుగోలు చేశారు. ఆ తరువాత కొన్ని రోజులకు ఢిల్లీలోని ఓఖ్లాకు చెందిన దేవేంద్రకు విక్రయించారు. తరువాత, అది అంబాలాలోని ఒక వ్యక్తి చేతుల్లోకి వెళ్ళింది. ఆపైన జమ్మూ & కశ్మీర్‌లో పుల్వామా నివాసికి అమ్మినట్లు సమాచారం.
ఆ కారు విక్రయం అంతటితో ఆగలేదు. ఆ తర్వాత దానిని సూసైడ్ బాంబర్‌గా అనుమానించబడిన డాక్టర్ ఉమర్ మొహమ్మద్‌కు అప్పగించారు. ఈ అమ్మకాల ప్రక్రియ కొనసాగినప్పటికీ, రిజిస్ట్రేషన్ కొత్త యజమానులకు బదిలీ కాలేదు. మొదటి ఓనర్ కాకుండా.. తరువాత కారును కొనుగోలుచేసినవారందరూ.. చట్టబద్ధమైన యజమానులు కానందున, సల్మాన్ ఇబ్బందుల్లో పడ్డాడు.
ఇదీ చదవండి: విజయ్ మాల్యా సామ్రాజ్యం: దివాలా తీసిందిలా..
Tags : 1